Skip to main content

Tomorrow All Schools and Colleges Holiday : రేపు తెలంగాణ‌, ఏపీలోని అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ప్ర‌క‌ట‌న‌.. అలాగే ఫిబ్ర‌వ‌రి 27న కూడా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు రేపు అన‌గా ఫిబ్ర‌వ‌రి 26వ తేదీ (బుధ‌వారం) ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌టించింది.
Tomorrow All Schools and Colleges Holiday

ఎందుకంటే... ఫిబ్రవరి 26న మహాశివరాత్రి  సందర్భంగా సెలవు ఇచ్చారు. అలాగే రేపు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ఆ ఫీసుల‌కు కూడా సెల‌వు రానుంది. దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇప్ప‌టికే సెల‌వు ప్ర‌క‌టించారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వం ప్రకటించిన వార్షిక సెలవుల క్యాలెండర్‌లో ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి  సందర్భంగా పబ్లిక్‌ హాలిడేగా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో ఫిబ్ర‌వ‌రి 27వ తేదీ ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు.

ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన కూడా సెల‌వు...?
అలాగే తెలంగాణ‌లోని కొన్ని స్కూల్స్‌లో ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన కూడా సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఎందుకంటే... చాలా మంది శివరాత్రి  సందర్భంగా ఉపవాసం ఉండి.. రాత్రి స‌మయం జాగరణము చేస్తుంటారు. మ‌ళ్లీ రోజు స్కూల్స్‌, కాలేజీల‌కు వెళ్లాలంటే... క‌ష్టంగా ఉంటుంది క‌నుక‌.... చాలా స్కూల్స్, కాలేజీలు, ఆఫీస్‌ల‌కు సెల‌వులు ఇస్తుంటాయి. ఇది సెల‌వులు అయా స్కూల్స్ , కాలేజీలు విద్యార్థుల విన్న‌పం మేర‌కు సెలవు ఇస్తుంటాయి.

భారతదేశం అంతటా గొప్ప వైభవంగా...

ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం నాడు వచ్చింది. చతుర్దశి తిథి ఆరోజు ఉదయం 11:08 గంటలకు ప్రారంభమై.. ఫిబ్రవరి 27న ఉదయం 8:54కి ముగుస్తుంది. ఆ రోజున (ఫిబ్రవరి 26) శివభక్తులు ఉపవాసం, జాగరణ ఉండి, రోజంతా శివనామస్మరణ చేస్తారు. శివుడికి అభిషేకం చేయడంతో పాటు.. బిల్వార్చన, రుద్రాభిషేకం చేస్తారు. ప్రతీ చాంద్రమాన మాసంలోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే 12 శివరాత్రులలో ఫిబ్రవరి.., మార్చి నెలలో వచ్చే శివరాత్రికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఈ పండుగ ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం పద్నాలుగో రాత్రి జరుపుకుంటారు. భారతదేశం అంతటా గొప్ప వైభవంగా జరుపుకుంటారు. 

ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 2025 వ‌ర‌కు సెల‌వులు ఇవే.. :
ఫిబ్రవరి 2025  :

➤☛ మహ శివరాత్రి – 26 ఫిబ్రవరి 

➤☛ ఎమ్మెల్సీ ఎన్నికలు – 27 ఫిబ్రవరి 

మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31

ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18

జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07

జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06

ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27

సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05

అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20

నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25
➤☛ క్రిస్మస్ తర్వాత రోజు – 26

Published date : 25 Feb 2025 03:26PM

Photo Stories