DOST Special Counselling 2023: డిగ్రీలో ప్రవేశాలకు ప్రత్యేక కౌన్సెలింగ్
Sakshi Education
నారాయణఖేడ్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యాశాఖ మరోసారి దోస్త్ ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనుందని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఖేడ్ కళాశాలకు సంబంధించి బీఏలో 23, బీకాంలో 37, బీజెడ్సీలో 32, ఎంపీసీలో 48 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈనెల 28వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకాగా సెప్టెంబరు 4వ తేదీవరకు రిజిస్ట్రేషన్లు చేసుకుని 5వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. 9వ తేదీన సీట్లు కేటా యిస్తారని చెప్పారు. ఇప్పటివరకు నమోదు చేసుకున్నవారితోపాటు కొత్తగా నమోదు చేసుకునే వారికి, ఇంజనీరింగ్, నీట్, వ్యవసాయకోర్సుల్లో సీట్లు రానివారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
CM Jagan Good News: Benefits for AP MBBS Aspirants | 100% Seats #sakshieducation
Published date : 31 Aug 2023 05:29PM