CUET PG 2023 : దరఖాస్తు తేదీ పొడిగింపు... జూన్ 5 నుంచి పరీక్షలు.. పూర్తి వివరాలు ఇవే....
అలాగే మే 6 నుంచి 8వ తేదీల్లో దరఖాస్తుల్లో ఏమైనా మార్పులు చేసుకునేందుకు వీలు కల్పించారు. జూన్ 5, 6, 7, 8, 9, 10, 11, 12వ తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
చదవండి: సీయూఈటీ పీజీ ప్రత్యేకత, అందించే కోర్సులు.. పరీక్ష విధానం, ప్రిపరేషన్ ఇలా..
ఒకే ఒక పరీక్షతో...
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ)ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. గతంలో విశ్వవిద్యాలయాలు విడిగా పరీక్ష నిర్వహించేవి. దీంతో విద్యార్థులు విడిగా దరఖాస్తు చేసుకునేవారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో ఫీజు చెల్లించి, పలు ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు రాసేవాళ్లు. ఆ ఇబ్బందులు సీయూఈటీతో తొలగిపోయాయి. ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్.. కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్.. ఎకనామిక్స్, ఇంగ్లిష్.. ఇలా అభ్యర్థులు చేరాలనుకున్న విభాగం పరీక్ష రాసి, దేశవ్యాప్తంగా ఆ సబ్జెక్టులో ఉన్న సీట్లకు పోటీపడవచ్చు.
అన్ని యూనివర్సీటీలకు ఒకే స్కోర్‌తో...
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తొలి ప్రాధాన్యమిచ్చే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీజీ సీట్లన్నీ సీయూఈటీతోనే భర్తీ చేస్తారు. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ- హైదరాబాద్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ - విజయనగరం, ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ- అనంతపురంలలో ప్రవేశానికి ఈ స్కోరే ప్రామాణికం. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ - న్యూదిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ- వారణాసి, పాండిచ్చేరి యూనివర్సిటీ, జామియా మిల్లియా ఇస్లామియా.. ఇలా పలు పేరున్న సంస్థల్లో సీట్లకు ఈ స్కోరే ఆధారం.
ముఖ్య గమనిక: సీయూఈటీలో సాధించిన స్కోరుతో ప్రవేశం కావాలనే విశ్వవిద్యాలయానికి విడిగా దరఖాస్తు చేసుకోవాలి.