Skip to main content

Teachers Counselling : నేడు ఉపాధ్యాయుల స‌ర్దుబాటుపై కౌన్సెలింగ్‌..

Counselling for school teachers adjustments

అచ్యుతాపురం: ఉపాధ్యాయుల సర్దుబాటుపై ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. టీచర్ల సర్దుబాటుకు సంబంధించి తొలి ప్రాధాన్యతా క్రమాన్ని ఎంఈవోలకు అప్పగించారు. ఎంఈవో(డీడీవో)ల లాగిన్‌లో ఉన్న సర్‌ప్లస్‌ ఉపాధ్యాయుల జాబితా, అవసరమైన సబ్జెక్టు టీచర్ల వివరాల బట్టి మధ్యాహ్నం 11 గంటలలోపు మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు.

NEET PG Exam : వైద్య క‌ళాశాల‌లో పీజీ కోర్సు ప్ర‌వేశాల‌కు నీట్ ప‌రీక్ష‌ ముగిసింది..

మధ్యాహ్నం 12 గంటలకు తుది జాబితా ప్రకటించి, అనంతరం మధ్యాహ్నం సర్‌ప్లస్‌ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. మండల స్థాయిలో సర్‌ప్లస్‌ అయిన ఉపాధ్యాయులను మళ్లీ డివిజన్‌ స్థాయిలో డిప్యూటీ డీఈవో స్థాయిలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. తుది పర్యవేక్షణ జిల్లా విద్యా శాఖ అధికారి చేపట్టనున్నారు. టీచర్ల సర్దుబాటు గణాంకాల సమాచారమంతా ఆయా ఎంఈవోల లాగిన్‌లలోనే ఉంది.

40000 Above Central Government Jobs 2024 : నిరుద్యోగులకు పండ‌గే పండ‌గ‌.. మ‌రో 40000ల‌కు పైగా ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..! వివ‌రాలు ఇవే..

Published date : 12 Aug 2024 05:27PM

Photo Stories