Junior Lecturer Counselling : ఈనెల 13 నుంచి జూనియర్ లెక్చరర్‌ల కౌన్సెలింగ్.. ఈ తేదీల్లోనే..

సాక్షి ఎడ్యుకేషన్: ఇటీవల కొత్తగా ఎంపికైన జూనియర్ లెక్చరర్‌లకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు తాజాగా ప్రకటనను విడుదల చేశారు. అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే ఎంపికైనవారికి సబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది.
Inter Marks Memo : ఇంటర్ సర్టిఫికెట్‌ను అందుకున్న విద్యార్థి!!
ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు ఇంటర్మీడియెట్ ఆర్జేడీ జయప్రద బాయి. ఈ షెడ్యూల్ ప్రకారం, 13వ తేదీన ప్రారంభం కానున్న కౌన్సెలింగ్ ఇదే నెల 19వ తేదీకి ముగియనుందని స్పష్టం చేశారు.
1286 మందికి..
ఎంపకైన 1286 మంది జూనియర్ లెక్చరర్‌లకు ఈనెల 13వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది. అందులో, మల్టీజోన్ 1 పరిధిలో 659 మంది ఉద్యోగులు ఉండగా, 2వ పరిధలో 627 ఉద్యోగులు పాల్గొననున్నారు. ఇక, వీరికి హైదరాబాద్లోని గన్ ఫౌండ్రీలోని మహబూబియా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు.
ఈ తేదీల్లో..
జూనియర్ లెక్చరర్‌లుగా ఎంపికైన వారిలో మల్టీజోన్ 1 అభ్యర్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మల్టీజోన్ 2 అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇక తేదీల విషయానికొస్తే.. ఈనెల 13న 214 మందికి, 14న 215 మందికి, 15న 215 మందికి, 17న 214 మందికి, 18న 213 మందికి, 19న మిగిలిన 215 మందికి కౌన్సెలింగ్ ఉంటుంది. ఇక, కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత వారికి కాలేజీలను అలాట్ చేస్తారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- junior lecturers
- college and schools teachers
- junior college lecturers
- JL Counselling 2025
- telangana junior colleges lecturers
- junior lecturers counselling schedule
- february 13th
- 1286 junior lecturers
- jobs at junior colleges
- feb 13th to 19th
- multizone 1 and 2 for junior lecturers
- lecturer jobs in junior colleges
- Govt Junior College
- Junior Lecturers Counselling
- Education News
- Sakshi Education News