Inter Marks Memo : ఇంటర్ సర్టిఫికెట్‌ను అందుకున్న విద్యార్థి!!

ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని బీఎస్సార్ కళాశాలలో చదివిన కాటేపల్లి సురేంద్ర అనే విద్యార్థికి ఎట్టకేలకు ఇంటర్ మార్కుల ఒరిజినల్ మెమోను కళాశాల యాజమాన్యం సోమవారం సాయంత్రం అందజేసింది.
కళాశాలకు రూ.20 వేలు ఫీజు బాకీ ఉన్నాడని, ఇంటర్మీడియట్ మార్కుల జాబితా ఇవ్వని విషయం తెలిసిందే. ఈ విషయంమై గత మంగళవారం 'సర్టిఫికెట్లు ఇవ్వకుండా' అనే శీర్షికన 'సాక్షి'లో వచ్చిన కథనంపై స్పందించిన ఆర్డీఓ కళాశాల యాజమాన్యానికి ఫోన్ చేసి ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు బకాయిలు ఉన్నా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం నేరమని, వెంటనే ఆ విద్యార్థికి సర్టిఫికెట్ అందజేయాలని లేకపోతే కేసు నమోదు చేశారు.
One Year B Ed Course : పదేళ్ల తరువాత ఏడాది కోర్సుగా బీఈడీ.. ఈ విద్యార్థులకు మాత్రమే అర్హత..!!
దీంతోతోపాటు కళాశాల రిజిస్ట్రేషన్ నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కళాశాల ఉద్యోగి ఖాజా ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్కుల మెమోను ఆర్డీఓ ద్వారా విద్యార్థికి అందజేశారు. ఆర్డీఓ పావని బాధిత విద్యార్థిని కార్యాలయానికి పిలిపించి సర్టిఫికెట్ అందజేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)