Collector Inspection: గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ఉరవకొండ: చదువుల్లో రాణిస్తే ఉజ్వల భవిత అందుతుందని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. మంగళవారం ఉరవకొండ బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.తరగతి గదులు, వంటగది, అధ్యాపకుల క్వార్టర్స్ పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడారు. బాగా చదువుకోవాలని సూచించారు.
విద్యార్థినులకు ఇబ్బందుల్లేకుండా మౌలిక వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. మోను ప్రకారం భోజనం అందించాలన్నారు. ఉత్తీర్ణత శాతం పెంపునకు కృషి చేయాలన్నారు. జిల్లాలోని విద్యాశాఖ, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, రెసిడెన్షియల్ పాఠశాలల సిబ్బందితో ఓ బృందం ఏర్పాటు చేశామన్నారు.
CBSE Syllabus News: పాఠశాలల్లో CBSE సిలబస్ అమలు ఎప్పటినుంచి అంటే...
ప్రతి నెలా మొదటి మంగళవారం బృందంతో సమీక్ష నిర్వహించి విద్యార్థుల ప్రగతి, క్రీడా కార్యక్రమాల అమలు గురించి తెలుసుకుంటానన్నారు. విద్యార్థులు కోరుకున్న పాఠశాలల్లోనే సీట్లు కేటాయించాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీత, ఆర్‌డీఓ శ్రీనివాసరెడ్డి, డీసీఓ మురళీకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఎహసాన్‌బాషా, ఎంపీడీఓ సుబ్బరాజు, డిప్యూటీ తహసీల్దార్ హరిప్రసాద్ పాల్గొన్నారు.