Tenth Class Rankers: విద్యార్థుల ఉన్నత ఫలితాలకు ప్రశంసలు..
Sakshi Education
పదో తరగతిలో ఉన్నత మార్కులతో మొదటిస్థానంలో నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించి, అభినందించారు..
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 10 జీపీఓ సాధించిన విద్యార్థులకు జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ప్రశంస పత్రాలు అందజేసి అభినందంచారు.
Junior Lecturers: పీఆర్సీ కమిటీతో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం భేటీ
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10 జీపీఏ సాధించడం గర్వించదగ్గ విషయమని కొని యాడారు. దిశానిర్దేశం చేసి ప్రోత్సహించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఇందులో డీఈవో ప్రణీత, మండల విద్యాధికారి జయశీల, సైన్స్ అధి కారి రఘురమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Published date : 07 May 2024 11:40AM