Skip to main content

BSc Nursing and B Ed Admissions : బీఈడీ, బీఎస్సీ న‌ర్సింగ్‌లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్.. ద‌రఖాస్తులు ఎలా అంటే..!!

బీఎస్సీ న‌ర్సింగ్‌, బీఈడీ ప్ర‌వేశాల‌కు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నోటిఫికేష‌న్ జారీ చేసింది.
Applications for bsc nursing and b ed courses notification  Applications invited for IGNOU B.Sc. Nursing and B.Ed programs

సాక్షి ఎడ్యుకేష‌న్: బీఎస్సీ న‌ర్సింగ్‌, బీఈడీ ప్ర‌వేశాల‌కు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నోటిఫికేష‌న్ జారీ చేసింది. అర్హ‌త, ఆస‌క్తి ఉన్న విద్యార్థులకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇగ్నో విశాఖ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్‌ గోనిపాటి ధర్మారావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Artificial Intelligence in Inter : ఇంట‌ర్ బోర్డు కీల‌క నిర్ణ‌యం.. త్వ‌ర‌లో ఈ స‌బ్జెక్టులో పాఠంగా కృత్రిమ మేధ !!

ఈ రెండు కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అర్హులైన విద్యార్థులు మొద‌ట ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. వారు ద‌క్కించుకున్న స్కోరు ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ‌ను నిర్వ‌హిస్తారు ఇగ్నో యాజ‌మాన్యం. 

బీఎస్సీ న‌ర్సింగ్‌..

ఇగ్నోలో మూడేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్ర‌వేశాల‌కు విద్యార్థులు https://ignounursing.samarth.edu.in/ index.php లింక్ లో లాగ‌న్ అయ్యి త‌మ వివ‌రాల‌ను న‌మోదు చేయాలి. కోర్సులో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి.

Polytechnic Courses Job Apportunities: పాలిటెక్నిక్‌ కోర్సుతో ఉపాధి అవకాశాలు.. ఉచితంగా స్టడీ మెటీరియల్‌

బీఈడీ ప్ర‌వేశాలు..

ఇక రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు https://ignou&bed.samarth.edu.in/index.php/ లింక్ లో త‌మ వివ‌రాల‌ను న‌మోదు చేసి, లాగిన్ అయ్యి, కోర్సులో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. అలాగే, ఈ లింకులతోనే విద్యార్థులు ఫీజును కూడా చెల్లించవచ్చు. 

ద‌రఖాస్తులు.. ఎంపిక విధానం..

వ‌చ్చే నెల అంటే.. ఫిబ్రవరి 21లోగా విద్యార్థులు త‌మ దరఖాస్తుల ప్ర‌క్రియ‌ను పూర్తి చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా, 2025, మార్చి 16న ఈ కోర్సుల్లో ప్ర‌వేశానికి పరీక్ష నిర్వహిస్తామని డాక్ట‌ర్ గోనిపాటి ధర్మారావు ప్ర‌క‌టన‌లో వివ‌రించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Jan 2025 03:23PM

Photo Stories