Skip to main content

Artificial Intelligence in Inter : ఇంట‌ర్ బోర్డు కీల‌క నిర్ణ‌యం.. త్వ‌ర‌లో ఈ స‌బ్జెక్టులో పాఠంగా కృత్రిమ మేధ !!

విద్యార్థులు కూడా ఇత‌ర విష‌యాల‌ను, టెక్నాల‌జీ అభివృద్ధిని తెలియ‌జేసే ప్ర‌య‌త్నంలో కృత్రిమ మేధస్సు త్వ‌ర‌లోనే అంతర్భాగం కానుంది.
Inter board announces the lesson of ai in english

సాక్షి ఎడ్యుకేష‌న్: రోజురోజుకి పెరుగుతున్న టెక్నాల‌జీతో ప్ర‌తీ ఒక్క‌రు ఏదో ఒక‌టి నేర్చుకుంటున్నారు. అయితే, విద్యార్థులు సైతం ఇందులోంచి ఏదోక‌టి నేర్చుకోవాల‌ని ఆస‌క్తి చూపుతున్నారు. విద్యార్థులు కూడా ఇత‌ర విష‌యాల‌ను, టెక్నాల‌జీ అభివృద్ధిని తెలియ‌జేసే ప్ర‌య‌త్నంలో కృత్రిమ మేధస్సు త్వ‌ర‌లోనే అంతర్భాగం కానుంది. ఈ మెర‌కు ఇంట‌ర్ బోర్డు కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. ఈ ఏఐ ను ఇంగ్లిష్‌ సబ్జెక్టులో ప్ర‌వేశ పెట్టి విద్యార్థుల‌కు టెక్నాల‌జీ ఎడ్యుకేష‌న్‌కు అంద‌జేయాని ప్ర‌య‌త్నిస్తుంది.

ప్రాథ‌మిక ప‌రిజ్ఞానం..

విద్యార్థుల‌కు పాఠ్యాంశాల‌ల్లో ప‌రిచ‌యం చేయ‌నున్న ఏఐ అంశంలో కేవలం అందుకు సంబంధించిన ప‌రిచ‌యం మాత్ర‌మే ఇంటర్‌ పాఠ్యాంశంగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు. విద్యార్థులకు ఆయా అంశంపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది.

UPSC Civils New Rule 2025 : యూపీఎస్సీ సివిల్స్ కొత్త రూల్స్ ఇవే.. ఇక‌పై ఈ సర్టిఫికెట్స్ కావాల్సిందే..!

ఇందులో భాగంగా.. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ప్ర‌వేశ పెట్టి, విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన ప‌రిజ్ఞానాన్ని అందించాలి. ఈ టెక్నాల‌జీలో ఉన్న లాభ‌న‌ష్టాల‌ను కూడా విద్యార్థుల‌కు వివ‌రించాలని ఇంట‌ర్ బోర్డు స్ప‌ష్టం చేసింది.

ఇంగ్లీష్ ల్యాంగ్వేజ్‌లో భాగంగా..

టెక్నాల‌జీకి సంబంధించిన అంశాల‌ను వాస్త‌వానికి ఫిజిక్స్ స‌బ్జెక్టులో ప్ర‌వేశ పెడ‌తారు. కాని, ఇక్క‌డ ఇంట‌ర్ బోర్డు విద్యార్థుల‌కు ఇంగ్లీష్‌లో కేటాయిస్తున్నారు. నిజానికి, ఫిజిక్స్‌లోనే ప్ర‌వేశ‌పెట్టాల‌ని అధికారులు భావించారు.. అయిన‌ప్ప‌టికీ, ఫిజిక్స్ అంటే, కేవలం ఇంట‌ర్‌లో కేవ‌లం ఆ స‌బ్జెక్టు ఎంచుకున్నవారికే నేర్చుకోవ‌డానికి వీల‌వుతుంది. కాగా, ఇంగ్లీష్‌లో అయితే కామ‌న్ స‌బ్జెక్ట్ క‌వ‌డంతో ఇందులో ప్ర‌వేశ‌పెడితే ప్ర‌తీ విద్యార్థికి ఈ విద్య అందుతుందని ఇంట‌ర్ బోర్డు ఈ నిర్ణ‌యం తీసుకుంది. 

Polytechnic Courses Job Apportunities: పాలిటెక్నిక్‌ కోర్సుతో ఉపాధి అవకాశాలు.. ఉచితంగా స్టడీ మెటీరియల్‌

థియ‌రీ, ప్రాక్టిక‌ల్స్‌..

ఏఐతోపాటు రోబోటిక్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ పాఠాలను సైతం పరిచయం చేయాలని భావిస్తున్నారు. ఈ మూడు అంశాలపై విద్యార్థులకు థియరీ, ప్రాక్టికల్‌ పరిజ్ఞానాన్ని అందించే దిశగా కసరత్తు చేస్తున్నది. ఈ నెలాఖరులోగా ఈ మూడు అంశాలను ప్రవేశపెట్టే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 25 Jan 2025 02:46PM

Photo Stories