Vocational Training Centre: వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వార్షిక పరీక్షలు
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందిన 12వ బ్యాచ్ 178 మంది అభ్యర్థులకు హైదరాబాద్ సెట్విన్ ఆధ్వర్యంలో శుక్రవారం వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు థియరీ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలను డీవైఎస్‌ఓ శ్రీనివాస్, ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ మాట్లాడుతూ 12వ బ్యాచ్ విద్యార్థులకు గతేడాది డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 29 వరకు 220 మంది నిరుద్యోగ యువతకు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ అందజేశారన్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సెట్విన్ వారిచే సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. కేంద్రంలో శిక్షణ పొందిన అభ్యర్థులకు త్వరలో జాబ్‌మేళా నిర్వహించి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం అవకాశం కల్పించేలా చూస్తామన్నారు. వార్షిక పరీక్షలను హైదరాబాద్ సెట్విన్ కోఆర్డినేటర్, పరీక్షల పరిశీలకుడు ఎండీ ఫయాజుద్దీన్, అర్చన, టీవీఎన్ మాధవి, షేక్ ఇస్మాయిల్, శ్రీనివాసరావు పర్యవేక్షించారు. కార్యక్రమంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఇన్‌చార్జ్ విజయ్‌కుమార్, సూపరింటెండెంట్ జయశ్రీ, ఫ్యాకల్టీ హరిప్రసాద్, విజయలక్ష్మి, కౌసల్య, ఖలీల్, ఇమ్రాన్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.