CM Foreign Education Scheme: విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
వికారాబాద్ అర్బన్: రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గ సంక్షేమ శాఖ ద్వారా విదేశాలలో ఉన్నత విద్య అభ్య సించాలనుకునే పేద మైనార్టీ విద్యార్థులకు సీఎం విదేశీ విద్యా పథకం స్ప్రింగ్ సీజన్‌కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పథకం ద్వారా పేద మైనార్టీ విద్యార్థులకు రూ. 20 లక్షలు ఉపకార వేతనంతో పాటు, విమాన రవాణా ఖర్చుల కింద రూ.60,000 మంజూరు చేయనున్నట్లు తెలిపారు. డిగ్రీ, ఇంజనీరింగ్‌లో 60 శాతం మార్కులు ఉండి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయుటకు, పీహెచ్‌డీ చేయాలనుకునేవారు పీజీలో 60 శాతం మార్కులు పొందిన వారు అర్హులని తెలిపారు. జన వరి 2023 నుంచి జులై 2023 మధ్యకాలంలో విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన మైనార్టీ విద్యార్థులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. సంబంధిత ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను చేసుకోవాలని సూచించారు. చివరి తేదీ ఈనెల 25 వరకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. సా. 5 గంటల వరకు దరఖాస్తు చేసుకొని హార్డ్ కాపీలను జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ కార్యాలయం లో సమర్పించాలని ఆమె తెలిపారు.
Civils Preparation APPSC గ్రూప్స్ కి హెల్ప్ అవుతుందా?? #sakshieducation
Published date : 22 Sep 2023 11:43AM