Skip to main content

TCS - NQT 2022: టీసీఎస్‌–నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్ట్‌ ప్రకటన విడుదల..

కార్పొరేట్‌ రంగంలో స్థిరపడాలనుకునే పట్టభద్రులకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) సంస్థ చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్ట్‌ (ఎన్‌క్యూటీ) నిర్వహించి.. ప్రతిభ కలిగిన అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటోంది. ప్రతి ఏటా నాలుగుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రస్తుతం 2022 ఏప్రిల్‌ సెషన్‌కు సంబంధించి ఎన్‌క్యూటీ ప్రకటన వెలువడింది. దీనిలో అర్హత సాధించిన యూజీ, పీజీ, డిప్లొమా అభ్యర్థులకు టీసీఎస్‌లో కొలువులు లభిస్తాయి.
tcs national qualifier test notification 2022
tcs national qualifier test notification 2022

టీసీఎస్‌–ఎన్‌క్యూటీ
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌–నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్ట్‌(టీసీఎస్‌–ఎన్‌క్యూటీ) రాసేందుకు ఇంజనీరింగ్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్‌ విభాగాల్లో యూజీ/పీజీ/డిప్లొమా అర్హతలున్న అభ్యర్థులు అర్హులు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కోర్సుల ఫైనల్‌ ఇయర్, ఫ్రెషర్స్‌ లేదా రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తుకు అర్హులే. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్షకు రెండురోజుల ముందు పరీక్ష తేదీ, సమయానికి సంబంధించిన సమాచారం తెలియజేస్తారు. 

ఎంపిక విధానం

  • ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించే నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంట్రీ లెవెల్‌ జాబ్స్‌కు అవసరమయ్యే నైపుణ్యాలు అభ్యర్థుల్లో ఉన్నాయో లేదో పరీక్షిస్తారు.

రెండేళ్ల వ్యాలిడిటీ
టీసీఎస్‌ ఎన్‌క్యూటీ పరీక్షలో సాధించిన స్కోరుకు రెండేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది.

పరీక్ష విధానం
ఎన్‌క్యూటీ పరీక్షలో మొత్తం 92ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 180 నిమిషాలు ఉంటుంది. వెర్బల్‌ ఎబిలిటీ 24 ప్రశ్నలు–30 నిమిషాలు, రీజనింగ్‌ ఎబిలిటీ 30 ప్రశ్నలు–50 నిమిషాలు, న్యూమరికల్‌ ఎబిలిటీ 26 ప్రశ్నలు–40 నిమిషాలు, ప్రోగ్రామింగ్‌ లాజిక్‌ 10 ప్రశ్నలు–15 నిమిషాలు, కోడింగ్‌కు 2 ప్రశ్నలకుగాను 45 నిమిషాల పరీక్ష సమయాన్ని కేటాయిస్తారు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 25.03.2022
  • ఎన్‌క్యూటీ పరీక్ష తేదీ: 10.04.2022
  • వెబ్‌సైట్‌ : https://learning.tcsionhub.in/hub/national-qualifier-test/
Published date : 10 Feb 2022 07:01PM

Photo Stories