తెలంగాణ ఆధునిక కవులు
Sakshi Education
దాశరథి కృష్ణమాచార్యులు (1925-1987)
పీవీ నరసింహారావు (1921-2004)
వట్టికోట ఆళ్వారుస్వామి (1915-1961)
కాళోజీ నారాయణరావు (1914-2002)
సురవరం ప్రతాపరెడ్డి (1896-1953)
భిన్నూరి నరసింహశాస్త్రి (బి.ఎన్ శాస్త్రి )
బిరుదురాజు రామరాజు
ఆదిరాజు వీరభద్రరావు (1890-1973)
బూర్గుల రామకృష్ణారావు (1889-1967)
వానమామలై వరదాచార్యులు
ఒద్దిరాజు సోదర కవులు
- జన్మస్థలం: వరంగల్ జిల్లా చిన్న గూడూరు
- బిరుదులు: కవి సింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి,
- విశేషం: ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పనిచేశారు.
- రచనలు:
- కవితా సంపుటాలు: అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం, నవమంజరి, దాశరథీ శతకం, మహాబోధి, తిమిరంతో సమరం, అలోచనాలోచనలు
- అనువాదం: గాలిబ్ గీతాలు
- స్వీయ చరిత్ర: యాత్రా స్మృతి
- అవార్డులు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (కవితాపుష్పకం), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (తిమిరంతో సమరం), ఏపీ ఉత్తమ అనువాద బహుమతి (గాలిబ్ గీతాలు), ఆంధ్రా విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది.
- నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న అభ్యుదయ కవి దాశరథి. నిజాంకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లి... అక్కడ నుంచే తన కవిత్వం ద్వారా పోరాటాన్ని కొనసాగించిన ధీశాలి దాశరథి కృష్ణమాచార్యులు. ‘నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళంబునక గ్గి పెట్టెద’ అని ఆయన నినదించారు. ‘ననుగని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ’ అని అంటూ దాశరథి పుట్టిన ప్రాంతంపై మమకారాన్ని చాటుకోవటంతో పాటు రుద్రవీణ కావ్యాన్ని తెలంగాణకు అంకితమిచ్చారు. ‘అనాదిగా సాగుతోంది-అనంత సంగ్రామం అనాథునికీ ఆగర్భ శ్రీమంతునికీ మధ్య’ అంటూ తనలోని సామ్యవాద ఆలోచనలను దాశరథి వ్యక్తీకరించారు.
పీవీ నరసింహారావు (1921-2004)
- జన్మస్థలం: వంగర, కరీంనగర్ జిల్లా
- నడిపిన పత్రిక: కాకతీయ
- రచనలు: సహస్రఫణ్, ది ఇన్‌సైడర్, అబలా జీవితం.
వట్టికోట ఆళ్వారుస్వామి (1915-1961)
- స్థాపన: దేశోద్ధారక గ్రంథమాల (35 పుస్తకాలను ప్రచురించారు)
- రచనలు: జైలు లోపల (కథల సంపుటి), ప్రజల మనిషి (నవల), గంగు (అసంపూర్తి నవల), రామప్ప రభస (వ్యాసాలు),
- నడిపిన పత్రికలు: తెలంగాణ, గుమాస్తా
కాళోజీ నారాయణరావు (1914-2002)
- జన్మస్థలం: మడికొండ (వరంగల్ జిల్లా), అసలు పేరు రఘువీర్
- బిరుదు: ప్రజాకవి
- పురస్కారం: పద్మవిభూషణ్ (1992)
- రచనలు: నా గొడవ (కవితాసంపుటాలు), అణాకథలు, కాళోజీ కథలు, తెలంగాణ ఉద్యమ కవితలు.
సురవరం ప్రతాపరెడ్డి (1896-1953)
- జన్మస్థలం: మహబూబ్‌నగర్ జిల్లా బోరవెల్లి
- నడిపిన పత్రికలు: గోల్కొండ, ప్రజావాణి
- రచనలు: శుద్ధాంత కాంత (నవల), భక్తతుకారాం (నాటకం), హైందవ ధర్మవీరులు, మొగలాయి కథలు, హరిశర్మోపాఖ్యానము, చంపకీ భ్రమర విషాదము.
- పరిశోధన గ్రంథాలు: ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు.
భిన్నూరి నరసింహశాస్త్రి (బి.ఎన్ శాస్త్రి )
- సంపాదకత్వం: మూసీ (సాహిత్య మాస పత్రిక)
- నవలలు: సంధ్యారాగం, రాధాజీవనం, తీరనికోరిక, వాకాటిక మహాదేవి,
- గేయకావ్యాలు: తపోభంగం, పాపాయి పతకం
- ఇతర రచనలు: భారతదేశ చరిత్ర- సంస్కృతి (21 సంపుటాలు), నల్గొండ జిల్లా కవులు- పండితులు, విప్లవ జ్వాల (తెలంగాణ సాయుధ పోరాటం)
బిరుదురాజు రామరాజు
- జన్మస్థలం: వరంగల్ జిల్లా దేవనూరు
- ప్రసిద్ధి: గొప్ప జానపద సాహితీవేత్త
- రచనలు: తెలుగు జానపదగేయ సాహిత్యం, త్రివేణి (జానపద పాటల సంకలనం), పిల్లల పాటలు, తెలంగాణ పల్లె పాటలు. బిరుదురాజు రామరాజు తెలుగులో జానపద సాహిత్య పరిశోధనకు శ్రీకారం చుట్టారు.
ఆదిరాజు వీరభద్రరావు (1890-1973)
- జన్మస్థలం: దెందుకూరు గ్రామం, మధిర(ఖమ్మం జిల్లా)
- బిరుదు: తెలంగాణ భీష్ముడు
- రచనలు: జీవిత చరితావళి, దేశభక్తుల జీవిత చరితావళి, ప్రాచీనాంధ్రనగరములు, మన తెలంగాణము, నవ్వులు-పువ్యులు, మిఠాయి చెట్టు.
బూర్గుల రామకృష్ణారావు (1889-1967)
- ప్రసిద్ధి: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బహుభాషా కోవిదుడు
- తెలుగు రచనలు: శ్రీకృష్ణశతకం, పుష్పాంజలి, తొలిచుక్క నివేదన, కవితామంజరి
- అనువాద రచనలు: ఉమర్ ఖయ్యూం రుబాయిలు, పండిత రాజ పంచామృతం, సౌందర్యలహరి
- ఇతర రచనలు: సారస్వత వ్యాస ముక్తావళి (సాహిత్య విమర్శన వ్యాసాలు),పారశీక వాజ్మయ చరిత్ర, బూర్గుల పీఠికలు
వానమామలై వరదాచార్యులు
- బిరుదులు: అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధురకవి, కవిచక్రవర్తి
- రచనలు: పోతన చరిత్ర, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, భోగినీ లాస్యం, కూలిపోయే కొమ్మ, రైతుబిడ్డ (బుర్రకథల సంపుటి)
ఒద్దిరాజు సోదర కవులు
- పేర్లు: ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవరంగారావు
- ప్రసిద్ధి: తెలంగాణ సోదర జంట కవులు, తెలంగాణ వైతాళికులు
- రచనలు: ఉపదేశ రత్నమాల, సంస్కృత వ్యాకరణం, శశ విషాణం (కావ్యం), సౌదామినీ పరిణయం (కావ్యం), రుద్రమదేవి(నవల), పాణినీ అష్టాధ్యాయికి వ్యాఖ్యానం, భక్తిసార చరిత్ర నాటకం
మాదిరి ప్రశ్నలు
1. ‘పాలమూరు జిల్లా దేవాలయాలు’ అన్న ప్రసిద్ధ గ్రంథకర్త?
1) కపిలవాయి లింగమూర్తి
2) ఇరువెంటి కృష్ణమూర్తి
3) ముకురాల రామిరెడ్డి
4) ఆదిరాజు వీరభద్ర రాజు
1) కపిలవాయి లింగమూర్తి
2) ఇరువెంటి కృష్ణమూర్తి
3) ముకురాల రామిరెడ్డి
4) ఆదిరాజు వీరభద్ర రాజు
- View Answer
- సమాధానం: 1
2. తెలంగాణలో జానపద సాహిత్యాన్ని సేకరించిన వ్యక్తి?
1) ఆదిరాజు వీరభద్రరాజు
2) ఒద్దిరాజు సోదరకవులు
3) బిరుదురాజు రామరాజు
4) కపిలవాయి లింగమూర్తి
1) ఆదిరాజు వీరభద్రరాజు
2) ఒద్దిరాజు సోదరకవులు
3) బిరుదురాజు రామరాజు
4) కపిలవాయి లింగమూర్తి
- View Answer
- సమాధానం: 3
3. ‘ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి’ పీఠాన్ని అలంకరించిన ఏకైక తెలంగాణ కవి?
1) చెల్లాపిల్లా వెంకటశాస్త్రి
2) సి.నారాయణరెడ్డి
3) దాశరథి కృష్ణమాచార్యులు
4) దాశరథి రంగాచార్యులు
1) చెల్లాపిల్లా వెంకటశాస్త్రి
2) సి.నారాయణరెడ్డి
3) దాశరథి కృష్ణమాచార్యులు
4) దాశరథి రంగాచార్యులు
- View Answer
- సమాధానం: 3
4. వేయిపడగలు నవలను హిందీలోకి అనువదించిన వారు?
1) మఖ్దూం మొహియుద్దీన్
2) పీవీ నరసింహారావు
3) బూర్గుల రామకృష్ణారావు
4) సామల సదాశివ
1) మఖ్దూం మొహియుద్దీన్
2) పీవీ నరసింహారావు
3) బూర్గుల రామకృష్ణారావు
4) సామల సదాశివ
- View Answer
- సమాధానం: 2
5.‘నల్గొండ జిల్లా కవులు-పండితులు’ గ్రంథకర్త?
1) పొట్లపల్లి రామారావు
2) ముకురాల రామారెడ్డి
3) మరిగంటి పురుషోత్తమాచార్యులు
4) బి.ఎన్ శాస్త్రి
1) పొట్లపల్లి రామారావు
2) ముకురాల రామారెడ్డి
3) మరిగంటి పురుషోత్తమాచార్యులు
4) బి.ఎన్ శాస్త్రి
- View Answer
- సమాధానం: 4
6.తెలంగాణ సాహిత్యంలో వెలువడిన తొలి కథా సంపుటి?
1) మల్లికా గుచ్ఛము
2) మాలతి గుచ్ఛము
3) హృదయశల్యము
4) మొగలాయి కథలు
1) మల్లికా గుచ్ఛము
2) మాలతి గుచ్ఛము
3) హృదయశల్యము
4) మొగలాయి కథలు
- View Answer
- సమాధానం: 1
7. ఒద్దిరాజు జంటకవులు రచించిన ప్రసిద్ధ కావ్యాలు?
1) రుద్రమదేవి, తపోభంగం
2) శశ విషాణం, సౌదామినీ పరిణయం
3) సంధ్యారాగం, భక్తిసార చరితం
4) మిఠాయిచెట్టు, గ్రీకు పురాణ కథలు
1) రుద్రమదేవి, తపోభంగం
2) శశ విషాణం, సౌదామినీ పరిణయం
3) సంధ్యారాగం, భక్తిసార చరితం
4) మిఠాయిచెట్టు, గ్రీకు పురాణ కథలు
- View Answer
- సమాధానం: 2
8. ఏ రచనకు సురవరం ప్రతాపరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది?
1) రామాయణ విశేషాలు
2) హిందువుల పండుగలు
3) గోల్కొండ పత్రికా వ్యాసాలు
4) ఆంధ్రుల సాంఘిక చరిత్ర
1) రామాయణ విశేషాలు
2) హిందువుల పండుగలు
3) గోల్కొండ పత్రికా వ్యాసాలు
4) ఆంధ్రుల సాంఘిక చరిత్ర
- View Answer
- సమాధానం: 4
Published date : 18 Dec 2015 12:04PM