తెలంగాణ చరిత్ర - 2
1. శ్రీముఖ శాతవాహనుడి కాలంనాటి నాణేలు ఎక్కడ లభించాయి?
ఎ) వరంగల్
బి) ఉట్నూరు
సి) కరీంనగర్
డి) చెన్నూరు
- View Answer
- సమాధానం: సి
2. ‘వాత్సాయనుడు’ ఏ పాలకుల ఆస్థానంలో ఉండేవారు?
ఎ) కాకతీయులు
బి) విజయనగర రాజులు
సి) తూర్పు చాళుక్యులు
డి) శాతవాహనులు
- View Answer
- సమాధానం: డి
3. శాతవాహన వంశ స్థాపకుడెవరు?
ఎ) గౌతమీపుత్ర శాతకర్ణి
బి) శ్రీముఖుడు
సి) యజ్ఞశ్రీ శాతకర్ణి
డి) హాలుడు
- View Answer
- సమాధానం: బి
4. కాకతీయులు మొదటగా ఏ రాజులకు సేనానులుగా పనిచేశారు?
ఎ) తూర్పు చాళుక్యులు
బి) కళ్యాణి చాళుక్యులు
సి) రాష్ట్రకూటులు
డి) పాండ్యులు
- View Answer
- సమాధానం: సి
5. మొదటిసారిగా ఏ శాసనంలో కాకతీయుల ప్రస్తావన కనిపించింది?
ఎ) హాతిగుంఫా శాసనం
బి) మాగల్లు శాసనం
సి) బయ్యారం చెరువు శాసనం
డి) పాకాల శాసనం
- View Answer
- సమాధానం: బి
6. కాకతీయులు మొదట ఏ ప్రాంతాన్ని పాలించారు?
ఎ) కొరివి
బి) ఓరుగల్లు
సి) ముదిగొండ
డి) హన్మకొండ
- View Answer
- సమాధానం: ఎ
7. తూర్పు చాళుక్య రాజైన దానర్ణవుడికి సహాయం చేసిన కాకతీయ సేనాని?
ఎ) బేతరాజు
బి) ప్రోలరాజు
సి) కాకర్త్యగుండన
డి) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: సి
8. పల్నాటి యుద్ధంలో జోక్యం చేసుకున్న కాకతీయ పాలకుడెవరు?
ఎ) రుద్రదేవుడు
బి) గణపతిదేవుడు
సి) మహాదేవుడు
డి) ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: ఎ
9. ‘చలమర్తి గండ’ అనే బిరుదు ఎవరిది?
ఎ) కాకర్త్యగుండన
బి) దుర్గరాజు
సి) మొదటి బేతరాజు
డి) మొదటి ప్రోలరాజు
- View Answer
- సమాధానం: బి
10. కాకతీయుల మొదటి రాజధాని ఏది?
ఎ) హన్మకొండ
బి) ఓరుగల్లు
సి) కొరివి
డి) కోటిలింగాల
- View Answer
- సమాధానం: ఎ
11. ఓరుగల్లు పట్టణ నిర్మాత?
ఎ) గణపతి దేవుడు
బి) రుద్రదేవుడు
సి) కాకర్త్యగుండన
డి) మహాదేవుడు
- View Answer
- సమాధానం: బి
12. కాకతీయుల పాలనా కాలం?
ఎ) క్రీ.శ. 950 నుంచి 1300 వరకు
బి) క్రీ.శ. 1000 నుంచి 1368 వరకు
సి) క్రీ.శ. 1000 నుంచి 1323 వరకు
డి) క్రీ.శ. 950 నుంచి 1342 వరకు
- View Answer
- సమాధానం: సి
13. ‘ఆంధ్రదేశాధీశ్వర’ బిరుదు పొందిన పాలకులెవరు?
ఎ) కాకతీయులు
బి) శాతవాహనులు
సి) ఇక్ష్వాకులు
డి) విజయనగర రాజులు
- View Answer
- సమాధానం: ఎ
14. రామప్ప ఏ జిల్లాలో ఉంది?
ఎ) నల్గొండ
బి) ఖమ్మం
సి) వరంగల్
డి) కరీంనగర్
- View Answer
- సమాధానం: సి
15. ఎవరి పాలనా కాలంలో ‘మార్కోపోలో’ మోటుపల్లి రేవును సందర్శించాడు?
ఎ) ప్రతాపరుద్రుడు
బి) రుద్రమదేవి
సి) గణపతి దేవుడు
డి) మహాదేవుడు
- View Answer
- సమాధానం: బి
16. కాకతీయుల కాలంలో ఏ మతం ఆధిపత్యంలో ఉండేది?
ఎ) శైవం
బి) వైష్ణవం
సి) బౌద్ధం
డి) జైనం
- View Answer
- సమాధానం: ఎ
17. హనుమకొండ ప్రాంతంపై పూర్తి వంశపారం పర్య హక్కులను మొదటి ప్రోలరాజు ఎవరి ద్వారా పొందాడు?
ఎ) చాళుక్య దానర్ణవుడు
బి) కాలచూరి బిజ్జలుడు
సి) చాళుక్య రెండో తైలపుడు
డి) చాళుక్య మొదటి సోమేశ్వరుడు
- View Answer
- సమాధానం: డి
18. ‘బయ్యారం చెరువు శాసనాన్ని’ వేయించిన వారు?
ఎ) రుద్రమదేవి
బి) మైలమదేవి
సి) గణపాంబ
డి) అనితల్లి
- View Answer
- సమాధానం: బి
19. కిందివారిలో కాకతీయ రాజ్య పునఃస్థాపనకు సహాయపడినవారెవరు?
ఎ) రుద్రమదేవి
బి) మైలాంబ
సి) కామసాని
డి) అనితల్లి 1
- View Answer
- సమాధానం: సి
20. కాకతీయ వంశ మూలపురుషుడు?
ఎ) వెన్ననృపుడు
బి) కాకర్త్యగుండన
సి) మొదటి బేతరాజు
డి) కాకతీరాజు
- View Answer
- సమాధానం: ఎ
21. ఏకవీర దేవి ఆలయం ఎక్కడ ఉంది?
ఎ) ఘణపురం
బి) కొలనుపాక
సి) మొగిలిచర్ల
డి) ఇనుగుర్తి
- View Answer
- సమాధానం: సి
22. కిందివాటిలో సరికాని జత ఏది?
ఎ) వల్లభా చార్యుడు - నీతిసార యోగం
బి) రుద్రదేవుడు - నీతిసారం
సి) విద్యానాథుడు - ప్రతాపరుద్ర యశోభూషణం
డి) జాయపసేనాని - నృత్త రత్నావళి
- View Answer
- సమాధానం: ఎ
23. మొదటగా చెరువులను తవ్వించిన కాకతీయ రాజు?
ఎ) మొదటి బేతరాజు
బి) మొదటి ప్రోలరాజు
సి) రుద్రదేవుడు
డి) రుద్రమదేవి
- View Answer
- సమాధానం: బి
24. వేయి స్తంభాల గుడి నిర్మాత ఎవరు?
ఎ) గణపతి దేవుడు
బి) ప్రతాపరుద్రుడు
సి) రుద్రదేవుడు
డి) మహాదేవుడు
- View Answer
- సమాధానం: సి
25. దేవాలయాలను నిర్మించిన మొదటి కాకతీయ పాలకుడెవరు?
ఎ) రుద్రదేవుడు
బి) మహాదేవుడు
సి) మొదటి ప్రోలరాజు
డి) మొదటి బేతరాజు
- View Answer
- సమాధానం: డి
26. స్వతంత్రంగా కాకతీయ రాజ్య పాలనను ప్రాంభించినవారెవరు?
ఎ) కాకర్త్యగుండన
బి) వెన్ననృపుడు
సి) మొదటి ప్రోలరాజు
డి) రెండో ప్రోలరాజు
- View Answer
- సమాధానం: డి
27. హనుమకొండలో కాకతీయ వంశ పాలనను ప్రారంభించినవారు?
ఎ) మొదటి ప్రోలరాజు
బి) మొదటి బేతరాజు
సి) రుద్రదేవుడు
డి) కాకర్త్యగుండన
- View Answer
- సమాధానం: బి
28. కరీంనగర్ ప్రాంతాన్ని కాకతీయుల కాలంలో ఏ పేరుతో పిలిచేవారు?
ఎ) ముల్కినాడు
బి) సబ్బినాడు
సి) రేనాడు
డి) పాకనాడు
- View Answer
- సమాధానం: బి
29. కాకతీయుల కాలంలో గ్రామపాలనను పర్యవేక్షించేవారిని ఏమని పిలిచేవారు?
ఎ) ఆయగారు
బి) ఇనామ్దార్
సి) గ్రామణీ
డి) గోమేయక
- View Answer
- సమాధానం: ఎ
30. కాకతీయుల శిల్పకళకు సంబంధించి ప్రత్యేకమైన నిర్మాణాలేవి?
ఎ) కోటగుళ్లు
బి) తోరణ స్తంభాలు
సి) త్రికూటాలయాలు
డి) ఆలయాల ప్రాకారాలు
- View Answer
- సమాధానం: బి
31. పాకాల సరస్సును తవ్వించిన వారెవరు?
ఎ) బయ్యన నాయకుడు
బి) రేచర్ల రుద్రుడు
సి) మల్యాల గౌండప్ప
డి) జగదల ముమ్మడి నాయకుడు
- View Answer
- సమాధానం: డి
32. ‘భట్టారకులు’ అంటే ఎవరు?
ఎ) సైనికులు
బి) వ్యాపారులు
సి) ప్రభుత్వ ఉద్యోగులు
డి) రాయబారులు
- View Answer
- సమాధానం: సి
33. తెలుగు ప్రాంత విమోచన ఉద్యమ నాయకుడెవరు?
ఎ) ముసునూరి ప్రోలయ నాయకుడు
బి) ముసునూరి కాపయ నాయకుడు
సి) అద్దంకి వేమారెడ్డి
డి) రాచకొండ పద్మనాయకుడు
- View Answer
- సమాధానం: ఎ
34. కాకతీయుల చివరి రాజు?
ఎ) రుద్రదేవుడు
బి) రుద్రమదేవి
సి) ప్రతాపరుద్రుడు
డి) గణపతిదేవుడు
- View Answer
- సమాధానం: సి
35. ‘ఆంధ్ర సుల్తాన్లు’గా పేరు పొందిన పాలకులు ఎవరు?
ఎ) బహమనీ సుల్తాన్లు
బి) నిజాం షాహీలు
సి) అసఫ్ జాహీలు
డి) కుతుబ్ షాహీలు
- View Answer
- సమాధానం: డి
36. హుస్సేన్‌సాగర్ (హైదరాబాద్) చెరువును తవ్వించినవారు?
ఎ) నిజాం అలీఖాన్
బి) సాలార్జంగ్
సి) ఇబ్రహీం కుతుబ్ షా
డి) అబుల్ హసన్ తానీషా
- View Answer
- సమాధానం: సి
37. హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు?
ఎ) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
బి) అసఫ్ జా మీర్ ఉస్మాన్ ఖాన్
సి) ఇబ్రహీం కుతుబ్‌షా
డి) సుల్తాన్ కులీ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: ఎ
38. చార్మినార్‌ను నిర్మించినవారు?
ఎ) అబుల్ హసన్ తానీషా
బి) సుల్తాన్ కులీ కుతుబ్‌షా
సి) ఇబ్రహీం కుతుబ్ షా
డి) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: డి
39. హైదరాబాద్‌లోని పురాతనమైన కట్టడాలు ఎక్కువగా ఏ రకమైన సంస్కృతికి సంబంధించినవి?
ఎ) ఇండో - ఆర్యన్
బి) ఇండో-గ్రీకు
సి) ఇండో - యూరోపియన్
డి) ఇండో - పర్షియన్
- View Answer
- సమాధానం: డి
40. తెలంగాణలో అసఫ్ జాహీల పాలన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
ఎ) 1723
బి) 1724
సి) 1725
డి) 1726
- View Answer
- సమాధానం: బి
41. ‘మహత్సిబ్’ అనే అధికారి ప్రధాన విధి?
ఎ) రాజు ముఖ్య సలహాదారుడు
బి) గూఢచర్యం
సి) ముఖ్య లేఖకుడు
డి) నైతిక విలువల ప్రచారం
- View Answer
- సమాధానం: డి
42. దాశరథీ శతకాన్ని ఎవరు రచించారు?
ఎ) అద్దంకి గంగాధర కవి
బి) కందుకూరి రుద్రకవి
సి) పొన్నెగంటి తెలగనార్యుడు
డి) కంచెర్ల గోపన్న
- View Answer
- సమాధానం: డి
43. గోల్కొండపై మొట్టమొదటి కోటను నిర్మించినవారు?
ఎ) కాకతీయులు
బి) కుతుబ్ షాహీలు
సి) నిజాం షాహీలు
డి) అసఫ్ జాహీలు
- View Answer
- సమాధానం: ఎ
44. తెలుగు కవులు ‘మల్కిభరాముడు’గా ఎవరిని కీర్తించారు?
ఎ) భక్త రామదాసు
బి) అబుల్ హసన్ తానీషా
సి) ఇబ్రహీం కుతుబ్ షా
డి) సుల్తాన్ కులీ కుతుబ్ షా
- View Answer
- సమాధానం: సి
45. గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన ఫ్రెంచి యాత్రికుడు?
ఎ) నికోలో కాంటె
బి) న్యూనిజ్
సి) టావెర్నియర్
డి) మార్కోపోలో
- View Answer
- సమాధానం: సి
46. కాకతీయుల కాలంలో గోల్కొండను ఏమని పిలిచేవారు?
ఎ) మంగళపురం
బి) రుద్రారం
సి) చాపల బండ
డి) గోవుల కొండ
- View Answer
- సమాధానం: డి
47. కోహినూర్ వజ్రం ఎక్కడ లభించింది?
ఎ) వజ్రకూరు
బి) నేలకొండపల్లి
సి) కొల్లూరు
డి) చెన్నారం
- View Answer
- సమాధానం: సి
48. గోల్కొండ నుంచి రాజధానిని హైదరాబాద్‌కు మార్చిన కుతుబ్ షా పాలకుడు?
ఎ) ఇబ్రహీం
బి) మహమ్మద్ కులీ
సి) సుల్తాన్ కులీ
డి) అబుల్ హసన్ తానీషా
- View Answer
- సమాధానం: బి
49. అసఫ్ జాహీల మొదటి రాజధాని ఏది?
ఎ) హైదరాబాద్
బి) ఔరంగాబాద్
సి) రాయచూర్
డి) పర్బనీ
- View Answer
- సమాధానం: బి
50. ఔరంగాబాద్ నుంచి తన రాజధానిని హైదరాబాద్‌కు మార్చిన అసఫ్ జాహీ రాజు?
ఎ) నాసర్‌జంగ్
బి) నిజాం అలీఖాన్
సి) మీర్ ఉస్మాన్ అలీఖాన్
డి) నిజాం ఉల్ ముల్క్
- View Answer
- సమాధానం: బి
51. సికింద్రాబాద్ నగరాన్ని ఎవరి పేరు మీద నిర్మించారు?
ఎ) మొదటి అసఫ్ జా
బి) రెండో అసఫ్ జా
సి) మూడో అసఫ్ జా
డి) నాలుగో అసఫ్ జా
- View Answer
- సమాధానం: సి
52. ఉస్మానియా విశ్వ విద్యాలయ స్థాపకుడు?
ఎ) మీర్ ఉస్మాన్ అలీఖాన్
బి) నిజాం అలీఖాన్
సి) మీర్ మహబూబ్ అలీఖాన్
డి) నిజాం అలీఖాన్
- View Answer
- సమాధానం: ఎ
53. ‘కాశీయాత్ర చరిత్ర’ను రాసిందెవరు?
ఎ) దాశరథి
బి) కొనగంటి సత్యనారాయణ
సి) ఏనుగుల వీరస్వామి
డి) కోలా శేషాచలం
- View Answer
- సమాధానం: సి
54. ‘హైదరాబాద్ అంబేద్కర్’గా పేరు పొందిన వారెవరు?
ఎ) భాగ్యరెడ్డి వర్మ
బి) అరిగే రామస్వామి
సి) బొజ్జం నర్సింహులు
డి) బి.ఎస్. వెంకటరావు
- View Answer
- సమాధానం: డి
55. చార్మినార్ ఎత్తు ఎంత?
ఎ) 52 మీ.
బి) 50.2 మీ.
సి) 49.8 మీ.
డి) 48.7 మీ.
- View Answer
- సమాధానం: డి
56. మహాత్మాగాంధీ ‘వరంగల్’ను సందర్శించిన రోజు?
ఎ) 1947 జనవరి 2
బి) 1947 ఫిబ్రవరి 20
సి) 1946 ఫిబ్రవరి 5
డి) 1946 జనవరి 8
- View Answer
- సమాధానం: సి
57. ‘హైదరాబాద్’ వారపత్రిక సంపాదకుడు?
ఎ) మందుముల నర్సింగరావు
బి) భాగ్యరెడ్డి వర్మ
సి) వామన్ నాయక్
డి) మాడపాటి హనుమంతరావు
- View Answer
- సమాధానం: బి
58. ‘తెలంగాణా సర్దార్’ బిరుదు ఎవరిది?
ఎ) జమలాపురం కేశవరావు
బి) రావి నారాయణరెడ్డి
సి) బూర్గుల రామకృష్ణారావు
డి) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం:ఎ