తెలంగాణ - నైసర్గిక స్వరూపం
1. తెలంగాణ రాష్ర్టం ఉన్న ‘దక్కన్ పీఠభూమి’ ఏ శిలలతో విస్తరించి ఉంది?
1) రూపాంతర శిలలు
2) అగ్నిశిలలు
3) స్ఫటిక శిలలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
2. తెలంగాణ పీఠభూమి ప్రాంతం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది?
1) 300-450 మీ.
2) 480-600 మీ.
3) 730 మీ.
4) 520 మీ.
- View Answer
- సమాధానం: 2
3. నిర్మల్ కొండల్లో ఎత్తైనది ఏది?
1) మహబూబా ఘాట్
2) జహంగీర్ ఘాట్
3) షాజహాన్ ఘాట్
4) హైదర్ ఘాట్
- View Answer
- సమాధానం: 1
4.నిజామాబాద్ జిల్లాలో పడమటి కనుమలను ఏమంటారు?
1) రాజు గుట్టలు
2) శేషాచలం గుట్టలు
3) సిర్నపల్లి పంక్తులు
4) యల్లండ్లపాడు గుట్టలు
- View Answer
- సమాధానం: 3
5. రాచకొండ గుట్టలు విస్తరించి ఉన్న తెలంగాణ జిల్లా?
1) ఆదిలాబాద్
2) ఖమ్మం
3) మహబూబ్నగర్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 4
6. తెలంగాణ పీఠభూమి ప్రాంతం ఏ దిక్కునుంచి ఏ దిక్కునకు వాలి ఉంది?
1) ఆగ్నేయం నుంచి వాయవ్యానికి
2) పశ్చిమం నుంచి తూర్పునకు
3) వాయవ్యం నుంచి ఆగ్నేయానికి
4) నైరుతి నుంచి ఈశాన్యానికి
- View Answer
- సమాధానం:3
7. నిర్మల్ కొండల పొడవు ఎంత?
1) 300 కి.మీ.
2) 150 కి.మీ.
3) 520 కి.మీ.
4) 180 కి.మీ.
- View Answer
- సమాధానం: 2
8.హైదరాబాద్ నగరం సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉంది?
1) 480 మీ.
2) 730 మీ.
3) 520 మీ.
4) 536 మీ.
- View Answer
- సమాధానం: 4
9. తూర్పు కనుమలను మహబూబ్నగర్ జిల్లాలో ఏ పేరుతో పిలుస్తారు?
1) రాఖీ కొండలు
2) సిర్నపల్లి పంక్తులు
3) ఆమ్రాబాద్ గుట్టలు
4) నిర్మల్ కొండలు
- View Answer
- సమాధానం: 3
10. పడమటి కనుమలు తెలంగాణ ప్రాంతంలో మొదట ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి?
1) మహబూబ్నగర్
2) ఆదిలాబాద్
3) నిజామాబాద్
4) మెదక్
- View Answer
- సమాధానం: 2
11. తెలంగాణ ప్రాంతం కృష్ణ, తుంగభద్ర నదీ లోయల మధ్య ఎంత ఎత్తు వరకు ఉంది?
1) 300-450 మీ.
2) 450-730 మీ.
3) 480-600 మీ.
4) 600-730 మీ.
- View Answer
- సమాధానం: 1
12. ఖమ్మం జిల్లాలో విస్తరించిన గుట్టలు ఏవి?
1) రాచకొండ గుట్టలు
2) కందికల్ గుట్టలు
3) యల్లండ్లపాడు గుట్టలు
4) నిర్మల్ గుట్టలు
- View Answer
- సమాధానం: 3
13. రాఖీ గుట్టలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) వరంగల్
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 2
14. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతంలో విస్తరించిన శిలలు ఏవి?
1) క్వార్ట్జ శిలలు
2) రూపాంతర శిలలు
3) అతి పురాతన స్ఫటిక శిలలు
4) గోండ్వానా శిలలు
- View Answer
- సమాధానం: 4
15. పడమటి కనుమలను వరంగల్ జిల్లాలో ఏమని పిలుస్తారు?
1) రాఖీ గుట్టలు
2) వెంకటాద్రి గుట్టలు
3) కందికల్ గుట్టలు
4) రాచకొండ గుట్టలు
- View Answer
- సమాధానం: 3
16. తూర్పు కనుమలను రంగారెడ్డి జిల్లాలో ఏ పేరుతో పిలుస్తారు?
1) ఆమ్రాబాద్ కొండలు
2) అనంతగిరి గుట్టలు
3) అమృత కొండలు
4) నీలగిరి కొండలు
- View Answer
- సమాధానం: 2
17.తెలంగాణలో గోదావరి నది ఏ కొండల మధ్య ప్రవహిస్తుంది?
1) పాపి కొండలు
2) అనంతగిరి గుట్టలు
3) నల్లమల కొండలు
4) నీలగిరి కొండలు
- View Answer
- సమాధానం: 1
18. తెలంగాణ ప్రాంతంలో వ్యాపించిన పశ్చిమ కనుమల శాఖ పేరు?
1) నీలగిరి పర్వతాలు
2) ఎల్లోరా పర్వతాలు
3) సహ్యాద్రి పర్వతాలు
4) ఆరావళి పర్వతాలు
- View Answer
- సమాధానం: 3
19. అనంత పద్మనాభస్వామి దేవాలయం ఏ కొండల్లో నెలకొని ఉంది?
1) అమృత కొండలు
2) రాచకొండ గుట్టలు
3) పాపి కొండలు
4) అనంతగిరి గుట్టలు
- View Answer
- సమాధానం: 4
20. మూసీ నది ఏ కొండల్లో జన్మిస్తుంది?
1) రాచకొండ గుట్టలు
2) అనంతగిరి కొండలు
3) పాపి కొండలు
4) సిర్నపల్లి పంక్తులు
- View Answer
- సమాధానం: 2
21. కింది వాటిలో ఖమ్మం జిల్లాలో విస్తరించిన కొండలు ఏవి?
1) నందగిరి కొండలు
2) రాఖీ గుట్టలు
3) రాచకొండ గుట్టలు
4) పాపి కొండలు
- View Answer
- సమాధానం: 4
22.భీమా, గోదావరి నదుల మధ్య దక్కన్ పీఠభూమి ఎంత ఎత్తు వరకు ఉంది?
1) 600 మీ.
2) 730 మీ.
3) 450 మీ.
4) 520 మీ.
- View Answer
- సమాధానం: 2
23.తూర్పు కనుమలు తెలంగాణ రాష్ర్టంలోకి ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి?
1) మహబూబ్నగర్
2) ఖమ్మం
3) వరంగల్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 1
24.రాజు గుట్టలు ఏ జల్లాలో విస్తరించి ఉన్నాయి?
1) రంగారెడ్డి
2) హైదరాబాద్
3) ఖమ్మం
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 3
25. నల్లమల కొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి?
1) హైదరాబాద్
2) మహబూబ్నగర్
3) వరంగల్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 2