శీతోష్ణస్థితి
1. తెలంగాణ రాష్ర్టంలో ఎలాంటి శీతోష్ణస్థితి ఉంటుంది?
1) అనార్ధ్ర శీతోష్ణస్థితి
2) అర్ధ శీతోష్ణస్థితి
3) అర్ధశుష్క శీతోష్ణస్థితి
4) ఉపఅర్ధ శీతోష్ణస్థితి
- View Answer
- సమాధానం: 3
2. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ఎప్పుడు ప్రవేశిస్తాయి?
1) జూన్ మొదటి వారంలో
2) జూన్ చివరి వారం
3) జూలై మొదటి వారం
4) జూన్ రెండో వారం
- View Answer
- సమాధానం: 4
3. తెలంగాణ రాష్ర్ట సగటు అత్యధిక ఉష్ణోగ్రత ఎంత?
1) 42°C
2) 31.5°C
3) 38.5°C
4) 18°C
- View Answer
- సమాధానం: 2
4. తెలంగాణ ప్రాంతంలో నైరుతి రుతుపవన కాలంలో ఎంత శాతం వర్షపాతం సంభవిస్తుంది?
1) 65%
2) 70%
3) 75%
4) 80%
- View Answer
- సమాధానం: 4
5. తెలంగాణలో అధికంగా చలి ఉండే ప్రాంతం?
1) ఉత్తర తెలంగాణ
2) దక్షిణ తెలంగాణ
3) తూర్పు తెలంగాణ
4) మధ్య తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
6.తెలంగాణ రాష్ర్టంలో సగటు వర్షపాతం ఎంత?
1) 1162.4 మి.మీ.
2) 828.7 మి.మీ.
3) 906.6 మి.మీ.
4) 782 మి.మీ.
- View Answer
- సమాధానం: 3
7. ఈశాన్య రుతుపవనాల వల్ల తెలంగాణలో కురిసే సాధారణ వర్షపాతం ఎంత?
1) 150 మి.మీ.
2) 129 మి.మీ.
3) 384 మి.మీ.
4) 258 మి.మీ.
- View Answer
- సమాధానం:2
8. ఈశాన్య రుతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది?
1) కరీంనగర్
2) ఆదిలాబాద్
3) మహబూబ్నగర్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
9. నైరుతి రుతుపవనాల వల్ల అల్పంగా వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది?
1) ఆదిలాబాద్
2) హైదరాబాద్
3) మహబూబ్ నగర్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 3
10. తెలంగాణ రాష్ర్టంలో ఈశాన్య రుతుపవన కాలం?
1) సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు
2) అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు
3) నవంబర్ నుంచి మార్చి వరకు
4) డిసెంబర్ నుంచి జూన్ వరకు
- View Answer
- సమాధానం: 2
11. తెలంగాణ రాష్ర్టంలో 24 గంటల్లో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైంది?
1) పేరూరు
2) రామగుండం
3) కొత్తగూడెం
4) మహబూబ్ నగర్
- View Answer
- సమాధానం: 1
12. తెలంగాణ రాష్ర్టంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఏది?
1) కరీంనగర్
2) హైదరాబాద్
3) నల్లగొండ
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 4
13. దక్షిణ తెలంగాణలో ఏ నెలలో అధిక వర్షపాతం సంభవిస్తుంది?
1) జూలై
2) ఆగస్టు
3) సెప్టెంబర్
4) అక్టోబర్
- View Answer
- సమాధానం: 3
14. నైరుతి రుతుపవనాల వల్ల తెలంగాణ ప్రాంతంలో సంభవించే సాధారణ వర్షపాతం ఎంత?
1) 129 మి.మీ.
2) 715 మి.మీ.
3) 906.6 మి.మీ.
4) 560 మి.మీ.
- View Answer
- సమాధానం: 2
15. తెలంగాణ ప్రాంతంలో వర్షపాత అస్థిరత్వం నైరుతి రుతుపవన కాలంలో ఎంత ఉంటుంది?
1) 25 శాతం కంటే ఎక్కువ
2) 25 శాతం కంటే తక్కువ
3) 80 శాతం కంటే తక్కువ
4) 80 శాతం కంటే ఎక్కువ
- View Answer
- సమాధానం: 1
16. తెలంగాణలో అత్యంత కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏది?
1) నిర్మల్
2) కోదాడ
3) సూర్యపేట
4) రామగుండం
- View Answer
- సమాధానం: 4
17. తెలంగాణ ప్రాంతంలో వేసవిలో కురిసే వర్షాలను ఏమని పిలుస్తారు?
1) ఏరువాక
2) మ్యాంగో షవర్స్
3) కాలభైశాభి
4) నార్వెస్టర్స్
- View Answer
- సమాధానం: 2
18. ఉత్తర తెలంగాణలో అధిక వర్షపాతం సంభవించే నెల ఏది?
1) నవంబర్
2) డిసెంబర్
3) జూలై
4) అక్టోబర్
- View Answer
- సమాధానం: 3
19. తెలంగాణ రాష్ర్టంలో వేసవిలో ఉరుములు, మెరుపులతో కురిసే వర్షాలకు కారణం అయ్యే మేఘాలు ఏవి?
1) నింబస్
2) సిర్రస్
3) క్యుములో నింబస్
4) క్యుములో సిర్రస్
- View Answer
- సమాధానం: 3
20.వర్షాకాలానికి, శీతాకాలానికి సంధిమాసం ఏది?
1) సెప్టెంబర్
2) అక్టోబర్
3) నవంబర్
4) ఆగస్టు
- View Answer
- సమాధానం: 2
21. కిందివాటిలో 1000 మి.మీ. కంటే ఎక్కువ సగటు వర్షపాతం నమోదయ్యే జిల్లా ఏది?
1) నల్లగొండ
2) రంగారెడ్డి
3) మహబూబ్నగర్
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 4
22. తెలంగాణ రాష్ర్టంలో నైరుతి రుతుపవన కాలం?
1) జూన్ నుంచి సెప్టెంబర్
2) జూలై నుంచి అక్టోబర్
3) జూన్ నుంచి సెప్టెంబర్
4) అక్టోబర్ నుంచి డిసెంబర్
- View Answer
- సమాధానం: 3
23. తెలంగాణ రాష్ట్రానికి లభించే వర్షపాతం అత్యధికంగా ఏ రుతుపవనాల ద్వారా కలుగుతుంది?
1) ఈశాన్య రుతుపవనాలు
2) నైరుతి రుతుపవనాలు
3) ఆగ్నేయ రుతుపవనాలు
4) తిరోగమన రుతుపవనాలు
- View Answer
- సమాధానం: 2
24. తెలంగాణ ప్రాంతంలో సాధారణంగా అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఏది?
1) నల్లగొండ
2) మెదక్
3) వరంగల్
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 4
25. ఈశాన్య రుతుపవనాల వల్ల అల్ప వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది?
1) కరీంనగర్
2) హైదరాబాద్
3) మహబూబ్నగర్
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 1
26. తెలంగాణలో సాధారణంగా అధిక వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది?
1) హైదరాబాద్
2) మహబూబ్నగర్
3) ఆదిలాబాద్
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 3