‘ఇండియన్ అసోసియేషన్’, ‘నేషనల్ కాన్ఫరెన్స్’ స్థాపకుడు ఎవరు?
భారత జాతీయోద్యమం:
1. ‘ఇండియన్ అసోసియేషన్’, ‘నేషనల్ కాన్ఫరెన్స్’ స్థాపకుడు ఎవరు?
1) ఆనందమోహన్ బోస్
2) సురేంద్రనాథ్ బెనర్జీ
3) 1, 2
4) డబ్ల్యు.సి. బెనర్జీ
- View Answer
- సమాధానం: 3
2. అలీపూర్ కుట్ర కేసులో అరబిందఘోష్ తరఫున వాదించిన ప్రముఖ న్యాయవాది ఎవరు?
1) మోతీలాల్ నెహ్రూ
2) చిత్తరంజన్ దాస్
3) రాజ్‌నారాయణ్ బోస్
4) తేజ్ బహదూర్ సప్రూ
- View Answer
- సమాధానం: 2
3. కింద పేర్కొన్న ఏ సందర్భంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ‘సర్’ బిరుదును త్యజించారు?
1) రౌలత్ చట్టాలు
2) జలియన్ వాలా బాగ్ దుర్ఘటన
3) స్వదేశీ ఉద్యమం
4) ఖిలాఫత్ ఉద్యమం
- View Answer
- సమాధానం: 2
4.బ్రిటిష్ పార్లమెంట్లో భారత్‌కు చెందిన తొలి సభ్యుడైన దాదాభాయ్ నౌరోజీ ఏ పార్టీ నుంచి హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు?
1) లిబరల్ పార్టీ
2) లేబర్ పార్టీ
3) కన్జర్వేటివ్ పార్టీ
4) స్వతంత్ర సభ్యుడిగా ఎన్నికయ్యారు
- View Answer
- సమాధానం: 1
5. బాలగంగాధర్ తిలక్ ఏ ఉద్యమ సందర్భంగా ‘లోకమాన్య’ బిరుదును పొందారు?
1) స్వదేశీ ఉద్యమం
2) హోమ్‌రూల్ ఉద్యమం
3) తీవ్రవాద విప్లవోద్యమం
4) విప్లవోద్యమం
- View Answer
- సమాధానం: 2
6. స్వతంత్ర పార్టీని స్థాపించింది ఎవరు?
1) ఎన్.జి. రంగా
2) రాజగోపాలాచారి
3) 1, 2
4) సూర్యసేన్
- View Answer
- సమాధానం: 3
7. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదం ఎవరిది?
1) భగత్‌సింగ్
2) చంద్రశేఖర్ ఆజాద్
3) రాజ్‌గురు
4) సుఖ్‌దేవ్
- View Answer
- సమాధానం: 1
8. జతపరచండి.
గ్రంథాలు
i) వాన్గార్డ్ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్
ii) ద ఇండియన్ స్ట్రగుల్
iii) గాంధీ వర్సెస్ లెనిన్
iv) బందీ జీవన్
v) ఇండియా విన్స్ ఫ్రీడమ్
రచయితలు
ఎ) ఎం.ఎన్. రాయ్
బి) నేతాజీ
సి) ఎస్.ఎ. డాంగే
డి) సచింద్రనాథ్ సన్యాల్
ఇ) మౌలానా అబుల్ కలాం
i ii iii iv v
1) ఎ బి సి డి ఇ
2) ఇ డి సి బి ఎ
3) డి ఇ ఎ బి సి
4) సి ఎ ఇ డి బి
- View Answer
- సమాధానం: 1
9. కింద పేర్కొన్న వాటిలో జవహర్లాల్ నెహ్రూ రచనలు ఏవి?
i) ది డిస్కవరీ ఆఫ్ ఇండియా
ii) గ్లిమ్సెస్ ఆప్ వరల్డ్ హిస్టరీ
iii) సోవియట్ ఏషియా
iv) విథర్ ఇండియా
v) ఇండియా అండ్ వరల్డ్
1) i, ii, iii
2) ii, iii, iv
3) iii, iv, v
4) i, ii, iii, iv, v
- View Answer
- సమాధానం: 4
10. జాతీయ సంస్థ, జాతీయ పత్రిక, జాతీయ పాఠశాల, జాతీయ వ్యాయామశాల లాంటి వాటిని స్థాపించి ‘జాతీయ’ అనే పదానికి విస్తృత ప్రచారం కల్పించినవారెవరు?
1) వివేకానంద
2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) నాగ గోపాలమిత్ర
4) భూపేంద్రనాథ్ దత్తా
- View Answer
- సమాధానం: 3
11. బ్రిటిషర్ల పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించి వైభవోపేత దర్బారును నిర్వహించిన ఒకే ఒక బ్రిటిష్ రాజు ఎవరు?
1) మొదటి జేమ్స్
2) అయిదో జార్జ
3) రెండో జేమ్స్
4) నాలుగో ఎడ్వర్డ
- View Answer
- సమాధానం: 2
12. నాగా పోరాటంలో ప్రముఖపాత్ర పోషించిన ‘గైడిన్ల్యు’కు ‘రాణి’ అనే బిరుదును ఇచ్చింది ఎవరు?
1) మహాత్మాగాంధీ
2) సర్దార్ పటేల్
3) జవహర్లాల్ నెహ్రూ
4) రాజేంద్రప్రసాద్
- View Answer
- సమాధానం: 3
13. జతపరచండి.
నాయకులు
i) ఫిరోజ్‌షా మెహతా
ii) బిపిన్ చంద్రపాల్
iii) డబ్ల్యు.సి. బెనర్జీ
iv) సురేంద్రనాథ్ బెనర్జీ
బిరుదులు
ఎ) అన్క్రౌన్డ కింగ్ ఆఫ్ బాంబే
బి) బెంగాల్ డాంటన్
సి) విస్మృత దేశభక్తుడు
డి) ఇండియన్ డెమస్తనీస్
i ii iii iv
1) ఎ బి సి డి
2) ఇ డి సి బి
3) డి సి ఎ బి
4) సి ఎ బి డి
- View Answer
- సమాధానం: 1
14. ‘ఇండియన్ సోషియాలజిస్ట్’ పత్రిక, ‘లండన్ హోమ్‌రూల్ సొసైటీ’ సంస్థ స్థాపకుడెవరు?
1) లాలా హరదయాళ్
2) శ్యాంజీ కృష్ణవర్మ
3) సోహన్‌సింగ్ బక్నా
4) మోహన్‌సింగ్
- View Answer
- సమాధానం: 2
15. భారతదేశంలో, భారత్ వెలుపల విప్లవాద పోరాటంలో పాల్గొన్న ఏకైక భారతీయ యువరాజు ఎవరు?
1) రాజా మహేంద్ర ప్రతాప్
2) రాయ్ దుర్లబ్
3) సాహూ మహరాజ్
4) విజయేంద్ర సింగ్
- View Answer
- సమాధానం: 1
16. కింది వాటిలో విప్లవాద, తీవ్రవాద జాతీయోద్యమ పోరాట సంస్థ ఏది?
1) అనుశీలనా సమితి
2) భారత మాతా సొసైటీ
3) ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
17. ప్రముఖ విప్లవాది, అత్యంత ధైర్యవంతుడైన ‘సూర్యసేన్’ ఏ ప్రాంతానికి చెందినవాడు?
1) మహారాష్ట్ర
2) పంజాబ్
3) బెంగాల్
4) బిహార్
- View Answer
- సమాధానం: 3
18. భారత కార్యదర్శి సలహాదారైన కర్జన్ విల్లీని లండన్‌లో హత్య చేసిన తిరుగుబాటుదారుడు ఎవరు?
1) శ్యాంజీ కృష్ణవర్మ
2) మదన్‌లాల్ డింగ్రా
3) రాస్ బిహారి బోస్
4) కుదీరాం బోస్
- View Answer
- సమాధానం: 2
19.జతపరచండి.
జాబితా - 1
i) జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు
ii) జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడైన తొలి ముస్లిం
iii) జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడైన తొలి ఆంగ్లేయ వ్యక్తి
iv) జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడైన తొలి తెలుగు వ్యక్తి
v) జాతీయ కాంగ్రెస్‌కు వరసగా ఆరేళ్లు అధ్యక్షత వహించిన వ్యక్తి
జాబితా - 2
ఎ) డబ్ల్యు.సి. బెనర్జీ
బి) బద్రుద్దీన్ త్యాబ్జీ
సి) జార్జ యూల్
డి) పి. ఆనందాచార్యులు
ఇ) అబుల్ కలాం ఆజాద్
i ii iii iv v
1) ఎ బి సి డి ఇ
2) ఇ డి సి బి ఎ
3) డి ఇ ఎ బి సి
4) సి ఎ ఇ డి బి
- View Answer
- సమాధానం: 1
20.ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన చివరి లేఖలో ‘విదేశీయులకు వ్యతిరేకంగా ఆయుధాలు ధరించాలి, పోరాటం చేస్తున్న సోదరులకు సహాయంగా నిలవాలి’ అని మహిళా లోకానికి పిలుపునిచ్చిన ప్రముఖ విప్లవకారిణి ఎవరు?
1) అంబికా చక్రవర్తి
2) కల్పనా దత్తా
3) ప్రీతిలతా ఒడయార్
4) మేడం కామా
- View Answer
- సమాధానం: 3
వైదిక యుగం:
21. కింది వాటిలో రుగ్వేదంలో పేర్కొన్న జనపదం ఏది?
1) పురు
2) ఛేది
3) అస్మక
4) 1,2
- View Answer
- సమాధానం: 4
22. గోత్రాన్ని మొదటగా ప్రస్తావించిన వేదం?
1) రుగ్వేదం
2) యజుర్వేదం
3) అథర్వణ వేదం
4) సామవేదం
- View Answer
- సమాధానం: 3
23. మలివేద నాగరికతలో ప్రజల ప్రధాన వినోదం ఏమిటి?
1) చదరంగం
2) రథాల పందేలు
3) తోలు బొమ్మలాట
4) కుస్తీ
- View Answer
- సమాధానం: 2
24. దశరాజ గణ యుద్ధం ఏ నదీ జలాల కోసం జరిగింది?
1) రావి
2) సట్లేజ్
3) చీనాబ్
4) బియాస్
- View Answer
- సమాధానం: 1
25. కింది వాటిలో పౌరుషేయాలుగా వేటిని పిలిచేవారు?
1) బ్రహ్మణాలు
2) అరణ్యకాలు
3) వేదాలు
4) ఉపనిషత్తులు
- View Answer
- సమాధానం: 3
26. యజ్ఞంలోని హోమగుండాల నిర్మాణం గురించి తెలిపే సూత్రం?
1) గృహసూత్రం
2) సుళువ సూత్రం
3) ధర్మ సూత్రం
4) శ్రౌతసూత్రం
- View Answer
- సమాధానం: 2
27. రుగ్వేదం సంకలనం చేసిన కాలం ఏది?
1) క్రీ.పూ. 1600 - 1000
2) క్రీ.పూ.1000 - 500
3) క్రీ.పూ.1700 - 1250
4) క్రీ.పూ.1500 - 1000
- View Answer
- సమాధానం: 4
28. వేదం అంటే అర్థం ఏమిటి?
1) ముక్తి
2) జ్ఞానం
3) ప్రార్థన
4) దివ్యమైన
- View Answer
- సమాధానం: 2
29. సతీసహగమనం, గోత్రం గురించి తొలిసారి ఏ గ్రంథంలో పేర్కొన్నారు?
1) రుగ్వేదం
2) యజుర్వేదం
3) సామవేదం
4) అథర్వణవేదం
- View Answer
- సమాధానం: 4
30. జతపరచండి?
జాబితా - 1
ఎ) సప్తసింధు ప్రాంతం
బి) మధ్య ఆసియా
సి) ఆర్కిటిక్ ప్రాంతం
డి) టిబెట్
జాబితా - 2
1) మాక్స్ ముల్లర్
2) ఎ.సి. దాస్
3) దయానంద సరస్వతి
4) తిలక్
1) ఎ-1, బి-2, సి -3, డి-4
2) ఎ-2, బి-1, సి -4, డి-3
3) ఎ-4, బి-3, సి -1, డి-2
4) ఎ-3, బి-4, సి -1, డి-2
- View Answer
- సమాధానం: 2
31. వేదకాలంలో గ్రామ పాలనాధిపతి?
1) గ్రామణి
2) రాజన్
3) జనక
4) కులాప
- View Answer
- సమాధానం: 1
32. సీత అంటే అర్థం?
1) క్షేత్రం
2) నాగలి
3) వివాహిత
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
33. వేదకాలంలో దేవునికి భక్తులకు మధ్యవర్తిగా ఎవరు ఉండేవారు?
1) పూజారి
2) రుషి
3) రాజు
4) అగ్ని
- View Answer
- సమాధానం: 4
34. వేదకాలంలో సేవించిన సురపానీయం కింది ఏ ధాన్యం నుంచి తయారు చేశారు?
1) గోధుమ
2) యవలు
3) జొన్న
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
35. జతపరచండి.
జాబితా -1 జాబితా - 2
ఎ) సాంఖ్య 1) కపిలుడు
బి) వైశేషిక 2) కణాదుడు
సి) న్యాయ 3) గౌతముడు
డి) ఉత్తర మీమాంస 4) బాదరాయన
1) ఎ-2, బి-1, సి -4, డి-3
2) ఎ-3, బి-1, సి -4, డి-2
3) ఎ-1, బి-2, సి -3, డి-4
4) ఎ-4, బి-2, సి -3, డి-1
- View Answer
- సమాధానం: 3
36. కింది వాటిలో త్రివేదాలలో లేనిది?
1) రుగ్వేదం
2) సామవేదం
3) యజుర్వేదం
4) అథర్వణవేదం
- View Answer
- సమాధానం: 4
37. కింది వాటిని జతపరచండి.
వేదం పఠకుడు
ఎ) రుగ్వేదం 1) బ్రహ్మణ
బి) సామవేదం 2) ఆధ్వర్యు
సి) యజుర్వేదం 3) ఉద్గాత్రి
డి) అధర్వణ వేదం 4) హోత్రి
1) ఎ-2, బి-1, సి -4, డి-3
2) ఎ-2, బి-4, సి -1, డి-3
3) ఎ-1, బి-2, సి -3, డి-4
4) ఎ-2, బి-2, సి -3, డి-1
- View Answer
- సమాధానం: 2
38. బ్రహ్మణాలకు ముగింపుగా దేన్ని పేర్కొంటారు?
1) అరణ్యకాలు
2) ఐతరేయ బ్రహ్మణం
3) ఉపనిషత్తులు
4) పురాణాలు
- View Answer
- సమాధానం: 1
39. యుద్ధం మానవుని మెదడులో మొదలవుతుందని పేర్కొంది?
1) అరణ్యకాలు
2) రుగ్వేదం
3) అథర్వణ వేదం
4) రుగ్వేదం
- View Answer
- సమాధానం: 3
40. ఉపనిషత్తులలో అత్యంత పురాతనమైనది?
1) చాందోగ్య ఉపనిషత్తు
2) కౌషితకి ఉపనిషత్తు
3) శ్వేతా శ్వేతరోపనిషత్తు
4) మాండకోపనిషత్తు
- View Answer
- సమాధానం: 1
41. మలివేద యుగపు ప్రజల వర్ణ వ్యవస్థ గురించి ఏ గ్రంథంలో ఉంది?
1) రుగ్వేదపు పురుష సూక్తం
2) శతపథ బ్రహ్మణం
3) యజుర్వేదం
4) హిరణ్యగర్భ సూక్తం
- View Answer
- సమాధానం: 1
42. ప్రాచీన భారత సాంస్కృతిక చరిత్రకు కింది వాటిలో అతి దగ్గరి అధారం?
1) వేదాలు
2) సూత్రాలు
3) ఉపనిషత్తులు
4) పురాణాలు
- View Answer
- సమాధానం: 1