Skip to main content

UPSC: సివిల్స్‌ మెయిన్స్‌లో 2,529 మంది అర్హత

సాక్షి, హైదరాబాద్‌: సివిల్‌ సర్విసెస్‌ మెయిన్స్‌ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ డిసెంబర్‌ 6న ప్రకటించింది.
UPSC
సివిల్స్‌ మెయిన్స్‌లో 2,529 మంది అర్హత

దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 16 నుంచి 25 మధ్య మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. ప్రిలిమ్స్‌ అర్హత సాధించిన దాదాపు 15 వేల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 700 మంది మెయిన్స్‌ రాశారు. పరీక్ష రాసిన వారిలో ఒక పోస్టుకు 2.5 మంది చొప్పున 2,529 మందిని పర్సనాలిటీ పరీక్ష (ఇంటర్వ్యూ)కు ఎంపిక చేశారు. దీని ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది ఇంటర్వ్యూకు వెళ్లగలుగుతున్నారు. దేశవ్యాప్తంగా 1,044 సివిల్‌ సర్విస్‌ పోస్టులను భర్తీ చేయాలని యూపీపీఎస్సీ సంకల్పించింది.

చదవండి: Success Story : ఇంటర్‌లో పెళ్లి.. సెలవుల్లో కూలీ .. ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే సివిల్స్‌లో ర్యాంకు

మెయిన్స్‌లో అర్హత పొందిన వారికి జనవరి రెండో వారంలో ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డిసెంబర్‌ 8 నుంచి 14 వరకు డిటైల్డ్‌ అప్లికేషన్‌ ఫాం–2 పూర్తి చేయాలని అభ్యర్థులకు యూపీపీఎస్సీ సూచించింది. ఇంటర్వ్యూలో, మెయిన్స్‌లో వచ్చే మార్కులను కలిపి ఫైనల్‌ ర్యాంకు ప్రకటిస్తారు. 

చదవండి: Success Story : ట్యూషన్‌ చెబుతూ... సివిల్స్‌లో టాపర్‌గా

ఎస్సీ స్టడీ సర్కిల్‌ నుంచి ముగ్గురు.. 

రాష్ట్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు సివిల్స్‌ ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. సర్కిల్‌ నుంచి 16 మంది మెయిన్స్‌ రాశారు. వరంగల్‌ జిల్లా ములుగుకు చెందిన డి. ప్రవీణ్, జనగామకు చెందిన కె. ప్రణయ్, నిజామాబాద్‌కు చెందిన డి. కిరణ్‌ కుమార్‌ ఎంపికైన వారిలో ఉన్నారు. సివిల్స్‌లో సత్తాచాటిన వారిని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అభినందించారు. 

చదవండి: Transgender Doctors: తొలి ట్రాన్స్‌జెండర్ డాక్ట‌ర్లు.. మొద‌ట్లో ఉద్యోగ దరఖాస్తులను తిరస్కరించినా కూడా..

Published date : 07 Dec 2022 01:33PM

Photo Stories