Jobs Recruitment 2021: భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు..ఏడాదికి వేతనం రూ.2 కోట్లకు పైనే..
తాజాగా ఈ జాబితాలోకి ట్యాక్సీ రైడ్ దిగ్గజ సంస్థ ఉబర్ టెక్నాలజీస్ చేరింది. ఓ ఐఐటీ విద్యార్థికి ఏడాడికి రూ. 2.5 కోట్ల ప్యాకేజీతో తమ కంపెనీలో ఉద్యోగం ఇచ్చింది. ఆ వివరాలు..
ఓ విద్యార్థికి..
ఐఐటీ బాంబే విద్యార్థి ప్రతిభకు ఉబర్ ఫిదా అయ్యింది. అందుకే ఏడాదికి ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగా వేతనం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అలానే ఐఐటీ గుహవటి విద్యార్థికి ఏడాదికి సుమారు 2 కోట్ల రూపాయల వేతనం ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇది మాత్రమే కాక, నివేదికల ప్రకారం ఈ ఏడాది 11 మంది ఐఐటీ రూర్కీ విద్యార్థులు సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ వేతనంతో వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు.
రూ. 1.54 కోట్లు మాత్రమే..
ఈ ఆఫర్‌లు గత ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువ. ఉదాహరణకు, 2020లో ఐఐటీ బాంబే విద్యార్థి అందుకున్న అత్యధిక ప్యాకేజీ రూ. 1.54 కోట్లు మాత్రమే. గతేడాది కరోనావైరస్, ప్రపంచవ్యాప్త లాక్‌డౌన్.. వ్యాపారలపై భారీ ప్రభావం చూపింది. ఈ గందరగోళాలన్ని ముగిసి ప్రస్తుతం మార్కెట్‌లు స్థిరంగా ఉండటమే భారీ ప్యాకేజ్ ఆఫర్‌కి కారణమని నిపుణులు భావిస్తున్నారు.
IIT HYderabad: నియామకాల్లో జోరు..రూ.65.45 లక్షల వార్షిక వేతనంతో..