Skip to main content

Telangana : టీఎస్‌పీఎస్సీ నుంచి మ‌రో 2 నోటిఫికేషన్లు విడుదల.. ఎక్కువ‌గా ఈ పోస్టుల‌కే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) న‌వంబ‌ర్ 30వ తేదీన మ‌రో రెండు నోటిఫికేషన్‌ల‌ను విడుద‌ల చేసింది.
tspsc
tspsc jobs notifications 2022

ఇవి గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్‌కు సంబంధించినవి. వీటిలో నాన్ గెజిటెడ్ పోస్టులు- 25, గెజిటెడ్ పోస్టులు- 32 ఉన్నాయి.

Telangana Government Jobs : త్వరలోనే 16,940 పోస్టుల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం.. డిసెంబ‌ర్‌లోనే వరుసగా..

నాన్ గెజిటెడ్ పోస్టుల వివరాలు ఇవే.. :

tspsc jobs notifications 2022

☛ టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) - 08
☛ టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజిస్ట్) - 07
☛ టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజిస్ట్ ) - 05
☛ ల్యాబ్ అసిస్టెంట్ - 01
☛ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 04

TSPSC Group-2 Notification : 726 గ్రూప్‌-2 పోస్టుల‌కు డిసెంబర్‌లో నోటిఫికేష‌న్‌..? ప‌రీక్షావిధానం ఇదే..

నాన్ గెజిటెడ్ పోస్టుల అర్హ‌తలు ఇవే..
➤ టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) : జియో ఫిజిక్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా ఎంటెక్ లో జియో ఫిజిక్స్ పూర్తి చేసిన వారు అర్హులు.
➤ ల్యాబ్ అసిస్టెంట్ :  కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
➤ టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజిస్ట్): జియాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
➤ టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజిస్ట్ ) : సివిల్ ఇంజనీరింగ్ లో జియాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. లేదా హైడ్రాలజీలో రెండేళ్ల ఎమ్సెస్సీ పూర్తి చేసి ఉండాలి.
 ➤జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ : జియాలజీలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా మ్యాథమేటిక్స్ లేదా జియాలజీ ఒక సబ్జెక్ట్ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

TSPSC Group-3 Notification : 1,373 గ్రూప్‌-3 పోస్టుల‌కు డిసెంబర్‌లోనే నోటిఫికేష‌న్‌..? ఈ పోస్టుల‌కు ప‌రీక్ష ఎలా ఉంటుందంటే..

వయ‌స్సు : 
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ముఖ్య‌మైన తేదీలు ఇవే..
నాన్ గెజిటెడ్ పోస్టులకు దరఖాస్తుల ప్రారంభ తేదీ : డిసెంబర్ 07, 2022
దరఖాస్తులకు చివరి తేదీ : డిసెంబర్ 28, 2022

గెజిటెడ్ పోస్టుల వివ‌రాలు ఇవే..

tspsc jobs

☛ అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ - 16
☛ అసిస్టెంట్ జియోఫిజిస్ట్ - 06
☛ అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ - 05
☛ అసిస్టెంట్ కెమిస్ట్ - 04
☛ అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ - 01

గెజిటెడ్ పోస్టుల అర్హతలు ఇవే..
➤ అసిస్టెంట్ జియోఫిజిస్ట్ : జియో ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
➤ అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ : జియాలజీలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
➤ అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ : సివిల్ ఇంజనీరింగ్ లో జియోలజీ అనేది ఒక సబ్జెక్ట్ కలిగి ఉండాలి. లేదా హైడ్రాలజీలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
➤ అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ : మెటీరియాలజీ లేదా ఫిజిక్స్ లేదా మ్యాథమేటిక్స్ లేదా అప్లైడ్ మేథమేటిక్స్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
➤ అసిస్టెంట్ కెమిస్ట్ : కెమిస్ట్రీ లేదా అప్లైడ్ కెమిస్ట్రీలో డిగ్రీ కలిగి ఉండాలి. లేదా కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసిన వారు కూడా అర్హులు. వీటితో పాటు.. పీజీ కూడా ఉండాలి.
గెజిటెడ్ పోస్టులకు వయస్సు :
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

గెజిటెట్ పోస్టుల ముఖ్య‌మైన తేదీలు ఇవే..
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ తేదీ : డిసెంబర్ 06, 2022
దరఖాస్తుల ప్రక్రియ చివ‌రి తేదీ : డిసెంబర్ 27, 2022

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

గెజిటెడ్ , నాన్ గెజిటెడ్ పోస్టుల పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 30 Nov 2022 08:03PM
PDF

Photo Stories