Skip to main content

గ్రూప్-1 పరీక్షలో విజయం సాధించండిలా..!

తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశముందున్న వార్తలతో ఔత్సాహికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

గ్రూప్-1 నోటిఫికేషన్‌కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోందనే సమాచారంతో నాలుగేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసున్న లక్షల మంది అభ్యర్థుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. దాదాపు 150 ఖాళీలు ఉండొచ్చనే అంచనాలతో అభ్యర్థులు ప్రిపరేషన్‌కు సన్నద్ధమవుతున్నారు. ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రూప్1కు దరఖాస్తు చేసుకోవచ్చు. డీఎస్‌పీ వంటి యూనిఫామ్ పోస్టులు మినహా...మిగతా పోస్టులకు 44 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు పోటీపడొచ్చు. ఈ నేపథ్యంలో కోచింగ్ లేకుండా గ్రూప్1 పరీక్షలో విజయం సాధించడమెలాగో చూద్దాం...

ఈ పోస్టులుండే అవకాశం..
డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, జిల్లా రిజిస్ట్రార్లు, రవాణా అధికారులు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 వంటి పలు పోస్టులు ఉండే అవకాశముంది.

ఎంపిక ప్రక్రియ :
గ్రూప్1 పోస్టులకు ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో 150 మార్కులకు ఉంటుంది. తర్వాత మొత్తం ఖాళీల సంఖ్యకు దాదాపు 12 రెట్ల మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌ను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం ఆరు పేపర్లు, ఒక్కో పేపరు 150 మార్కులకు ఉంటుంది. అంటే... మొత్తం 900 మార్కులకు మెయిన్స్‌ పరీక్ష రాయాలి. వీటితోపాటు జనరల్ ఇంగ్లిష్ 150 మార్కులకు జరుగుతుంది. ఇది అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన వారి నుంచి ఖాళీల సంఖ్యకు 1:2 లేదా 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు జరుగుతుంది. మొత్తంగా 1000 మార్కులకు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం!

సబ్జెక్టు

పరీక్ష సమయం

గరిష్ట మార్కులు

ప్రిలిమినరీ పరీక్ష:

 

 

జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ తరహా)

2 గం. 30 ని.

150 మా.

రాత పరీక్ష మెయిన్:

 

 

జనరల్ ఇంగ్లిష్ (అర్హత పరీక్ష మాత్రమే)

3 గం.

150 మా.

పేపర్ 1:

 

 

జనరల్ ఎస్సే

3 గం.

150 మా.

  1. సమకాలీన సామాజిక అంశాలు, సాంఘిక సమస్యలు
  2. ఆర్థిక వృద్ధి, న్యాయం సంబంధిత అంశాలు
  3. భారత రాజకీయాలు-గతిశీలత
  4. భారత చారిత్రక, సాంస్కృతిక వారసత్వం
  5. శాస్త్ర సాంకేతిక రంగంలో తాజా పరిణామాలు
  6. విద్య, మానవ వనరుల అభివృద్ధి

 

 

పేపర్ 2:

 

 

చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం

3 గం.

150 మా.

  1. భారత చరిత్ర, సంస్కృతి; ఆధునిక భారత దేశ చరిత్రకు ప్రాధాన్యం (1757 నుంచి 1947).
  2. తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
  3. భారతదేశ, తెలంగాణ భౌగోళిక శాస్త్రం

 

 

పేపర్ 3:

 

 

భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన

3 గం.

150 మా.

  1. భారతీయ సమాజం, అంతర్నిర్మాణం, సమస్యలు, సామాజిక ఉద్యమాలు
  2. భారత రాజ్యాంగం
  3. పరిపాలన

 

 

పేపర్ 4:

 

 

ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి

3 గం.

150 మా.

  1. భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
  2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
  3. అభివద్ధి, పర్యావరణ సమస్యలు

 

 

పేపర్ 5:

 

 

సైన్స్‌ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్

3 గం.

150 మా.

  1. సైన్స్‌ అండ్ టెక్నాలజీ పాత్ర, ప్రభావం
  2. సైన్స్‌- దాని ఆధునిక అనువర్తనాలు (మోడ్రన్ ట్రెండ్‌‌స ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్‌‌జ ఆఫ్ సైన్స్‌).
  3. డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ ప్రాబ్లం సాల్వింగ్.

 

 

పేపర్ 6:

 

 

తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం

3 గం.

150 మా.

  1. తెలంగాణ భావన (1948-1970)
  2. సమీకరణ దశ (1971-1990)
  3. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా(1991-2014)

 

 


ప్రిపరేషన్ గెడైన్స్‌..
గ్రూప్1కు ప్రిపరేషన్ ప్రారంభించే ముందు అభ్యర్థులు పరీక్ష విధానాన్ని, సిలబస్‌ను సమగ్రంగా అధ్యయనం చేయాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌ ఉమ్మడి అంశాలను గుర్తించి, తొలుత వాటి ప్రిపరేషన్ పూర్తిచేయాలి. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలయ్యాక... ప్రిలిమ్స్‌కు కనీసం 45 రోజుల సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 45 రోజుల్లో ప్రిలిమ్స్ సిలబస్‌పై పట్టుసాధించేలా అభ్యర్థి సన్నద్ధత ఉండాలి. కొంత సమయం గత ప్రశ్నపత్రాల పరిశీలనకు కేటాయించాలి. ఆపై మెటీరియల్ సేకరణపై దృష్టిపెట్టాలి. ప్రామాణిక పుస్తకాలను సేకరించాలి. సబ్జెక్ట్ నిపుణుల మెటీరియల్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. సివిల్స్, గ్రూప్స్ విజేతలంతా చెప్పేది.. తాము తక్కువ పుస్తకాలను ఎక్కువసార్లు చదివామని! అభ్యర్థులు దీన్ని గుర్తుంచుకోవాలి.

ప్రిలిమ్స్.. అగ్నిపరీక్షే!
పోటీ తీవ్రంగా ఉండే గ్రూప్-1లో ప్రిలిమ్స్‌లో గట్టెక్కడం చాలా కీలకం. కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటివరకూ గ్రూప్-1 నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి పోటీ తీవ్రంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం కఠినంగా ఉండే అవకాశం ఎక్కువ. కాబట్టి పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగించాలి.

కరెంట్ అఫైర్స్..
గ్రూప్-1 ప్రిలిమ్స్ సిలబస్‌లో మొత్తం 13 అంశాలున్నాయి. 1, 2 అంశాలు కరెంట్ అఫైర్స్‌కు సంబంధించినవి.
  1. కరెంట్ అఫైర్స్- రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్
  2. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ అండ్ ఈవెంట్స్; జాతీయ, అంతర్జాతీయ, స్థానిక కరెంట్ అఫైర్స్‌తోపాటు అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్‌ కోణంలోనూ ముఖ్యమైనవే. వర్తమాన అంశాలకు ప్రిపరేషన్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మెయిన్స్‌లోని జనరల్ ఎస్సేతోపాటు పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్ వంటి సెక్షన్లకు కూడా ఉపయోగపడుతుంది. సివిల్స్ టాపర్ టీనా దాబీ మాటల్లో చెప్పాలంటే.... పోటీ పరీక్షల్లో కరెంట్ ఆఫైర్స్ పాత్ర 70 శాతం. ముఖ్యంగా సివిల్స్, గ్రూప్-1 వంటి ప్రతిష్టాత్మక సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేసే పరీక్షల్లో.. అభ్యర్థికి తనచుట్టూ జరుగుతున్న పరిణామాలపై ఆసక్తి, అవగాహన ఏమేరకు ఉంది... ఆయా పరిణామాలపై అతని స్పందన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు చేస్తాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్‌పై పట్టు కోసం రోజూ కొంత సమయం కేటాయించాలి. ఏదైనా ప్రామాణిక తెలుగు/ఇంగ్లిష్ దినపత్రికను అనుసరించడంతోపాటు, ఆయా పత్రికల్లో వచ్చే ఎడిటోరియల్ కథనాలు ఆసక్తితో చదివితే.. ప్రిలిమ్స్, మెయిన్స్‌, ఇంటర్వ్యూ... ఇలా మూడు రకాలుగా ఉపయోగపడుతుంది.
  3. జనరల్ సైన్స్‌.. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత విజయాలు
    మొత్తం 150 మార్కులకు జరిగే ప్రిలిమ్స్‌లో 20 నుంచి 25 ప్రశ్నల వరకు దీన్నుంచే వస్తున్నాయి. జనరల్ సైన్స్‌లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరుగుతున్న తాజా పరిణామాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వాస్తవానికి జనరల్ సైన్స్‌లో స్కోర్ చేసేందుకు పదో తరగతి స్థాయి పుస్తకాల్లోని అంశాలపై అవగాహన పెంచుకుంటే సరిపోతుంది. 6 నుంచి పదో తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను క్షుణ్నంగా అర్థం చేసుకుంటూ చదవాలి. తెలుగు మీడియం విద్యార్థులు స్టేట్ సిలబస్ 6 నుంచి పదో తరగతి పుస్తకాలు చదవాలి.
    • బయాలజీ నుంచి విటమిన్లు, వ్యాధులు, పోషణ(న్యూట్రిషన్), కొవ్వులు, రక్తం గ్రూపులు, మానవ జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ(మూత్ర పిండాలు), ప్రత్యుత్పత్తి వ్యవస్థ వంటి అంశాలపై దృష్టిపెట్టాలి. బయోటెక్నాలజీ, జెనిటిక్ ఇంజనీరింగ్, పర్యావరణం-కాలుష్యం, దుష్పరిణామాలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
    • ఫిజిక్స్‌లో కాంతి, ధ్వని, ఉష్ణం, విద్యుత్, హిగ్‌‌స బోసన్, డార్క్ ఎనర్జీ, డార్క్ మేటర్, రేడియోధార్మికత, న్యూక్లియర్ ఫ్యూజన్, న్యూక్లియర్ ఫిషన్ వంటి అంశాలు, వాటి అనువర్తనాలపై అవగాహన పెంచుకోవాలి. అణు ఇంధనం, దేశంలోని అణు రియాక్టర్లు, అవి ఏర్పాటైన ప్రాంతాలు తదితర అంశాలు తెలుసుకోవాలి.
    • కెమిస్ట్రీలో ఆవర్తన పట్టిక-అందులోని మూలకాలు-వాటి ప్రాధాన్యం, పరమాణు నిర్మాణం, అకర్బన-కర్బన పదార్థాలు, ఆమ్లాలు-క్షారాలు, రసాయన శాస్త్ర అనువర్తనాలు, ఇంధనాలు, పాలిమర్స్, కార్బన్ డేటింగ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
    • సైన్స్‌ అండ్ టెక్నాలజీ: ఇస్రో తాజా ప్రయోగాలు, రక్షణ రంగంలో క్షిపణి వ్యవస్థ, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు తదితరాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోవాలి. ఐటీ అనువర్తనాలు, ఐసీటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ తదితర అంశాలు ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఇస్రో, డీఆర్‌డీవో; శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్లను అనుసరిస్తుండాలి.
  4. ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్-డిజాస్టర్ మేనేజ్‌మెంట్- ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ ్ట్రాటజీస్
    • భూతాపం, దాని పర్యవసానాల నేపథ్యంలో ఇటీవల కాలంలో పోటీ పరీక్షల్లో ముఖ్యాంశంగా మారుతున్న అంశం.. ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్ (పర్యావరణ సమస్యలు). ఇందులో భాగంగా వాతావరణ మార్పులు, వేడెక్కుతున్న భూగోళం, పర్యావరణ సదస్సులు-ఒప్పందాలు, పారిస్ ఒప్పందం, పర్యావరణ సంబంధిత ముఖ్య సంస్థలు, జీవ వైవిధ్యం (బయోడైవర్సిటీ) తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. గ్రీన్ ఇండియా మిషన్ దేనికి సంబంధించింది? అజెండా 21 ప్రాధాన్యత ఏమిటి? ఇటీవల పోలెండ్‌లోని కాటొవైస్‌లో జరిగిన వాతావరణ మార్పులపై సదస్సు నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. ప్రిపరేషన్‌కు ప్రాథమికంగా ఎన్‌సీఈఆర్‌టీ 6-10వ తరగతి వరకు పుస్తకాలు, ఇండియా ఇయర్‌బుక్, ఎన్విరాన్‌మెంట్ మినిస్ట్రీ అధికారిక వెబ్‌సైట్‌ను, తాజా ఎకనామిక్ సర్వేలను చదవాలి.
    • విపత్తుల నిర్వహణలో ముందస్తు ప్రణాళిక, సమన్వయం, విపత్తు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు; విపత్తులు సంభవించినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చేపట్టాల్సిన చర్యలు; విపత్తుల నిర్వహణను పర్యవేక్షించే వివిధ వ్యవస్థలు ముఖ్యంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) గురించి తెలుసుకోవాలి. అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్
      (ఐడీఎం), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్‌ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్)ల గురించి తెలుసుకోవాలి. వీటితోపాటు ప్రభుత్వాల ఇతర చర్యలపైనా దృష్టిసారించాలి.
  5. ఎకనామిక్ అండ్ సోషల్ డవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా
    గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో గెట్టెక్కాలంటే.. ఎకానమీ చాలా కీలకమైంది. ఎందుకంటే... ఇందులో జాతీయాదాయం, పేదరికం, నిరుద్యోగం, జనాభా, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, బ్యాంకింగ్, ఆర్థిక సరళీకరణలు, నీతి ఆయోగ్, బడ్జెట్, బ్యాలెన్స్‌ ఆఫ్ పేమెంట్స్, ద్రవ్యోల్బణం వంటి అంశాలతోపాటు ప్రభుత్వ పథకాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ఆహారభద్రత నుంచి ప్రశ్నలు వస్తాయి. సామాజిక రంగ ప్రగతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పథకాలపై దృష్టిపెట్టాలి. హ్యూమన్ డవలప్‌మెంట్ ఇండెక్స్, జెండర్ డవలప్‌మెంట్ ఇండెక్స్, జెండర్ ఈక్వాలిటీ, గ్రీన్ ఇండెక్స్ వంటి గురించి తెలుసుకోవాలి. డీమానిటైజేషన్, బ్లాక్ మనీ, జీఎస్‌టీ, డిజిటలైజేషన్, జన్ ధన్ యోజనల గురించి సంపూర్ణ అవగాహన ఉండాలి. హెల్త్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, ఎఫ్‌డీఐ పాలసీ, సోషల్ సెక్యూరిటీ, మేకిన్ ఇండియా, ఎంఎస్‌ఎంఈల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఇంధనం, రహదారులు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు వంటి మౌలిక వసతులు, భూసేకరణ బిల్లు, విదేశీ వాణిజ్యంపైనా ప్రశ్నలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా ఆర్థిక రంగంలో సంభవిస్తున్న వర్తమాన అంశాలను నిత్యం అనుసరిస్తుండాలి. ఎకానమీలో ప్రాథమిక అవగాహన కోసం 8 నుంచి 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, ఎకనామిక్ సర్వేతోపాటు,తాజా బడ్జెట్‌ను చదవాలి.
  6. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ
    • జాగ్రఫీకి సంబంధించి ఇటీవల కాలంలో సివిల్స్, గ్రూప్స్ ప్రశ్నపత్రాలను చూస్తే... సౌరకుటుంబం-గ్రహాలు, భూమి అంతర్నిర్మాణం-శిలలు-ఖనిజాలు, భూస్వరూపాలు, ప్రపంచంలో వివిధ దేశాల్లో జనాభా, అత్యధిక జనాభా ఉన్న నగరాలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు వంటి అంశాలపై దృష్టిపెట్టాలి.
    • ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి నదులు, నదీ పరీవాహక ప్రాంతాలు, నదుల పుట్టుక, ఆయా నదులపై ఉన్న ముఖ్య ప్రాజెక్టులు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, అడవులు, నేలలు-రకాలు, పంటలు, వ్యవసాయం, కాలాలు-రుతుపవనాలు, వర్షపాతం, ముఖ్య ఖనిజాలు-లభించే ప్రాంతాలు తదితరాలపై దృష్టిసారించాలి. వాతావరణ పొరలు, ఎల్‌నినో, లానినో వంటివన్నీ భారత భౌగోళిక శాస్త్ర సిలబస్‌లో ముఖ్యమైన అంశాలే! కావేరీ నదీ జలాల పంపిణీ సమస్య నేపథ్యంలో ఆ నది జన్మస్థానం ఏది? అది ఎన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది? పరీవాహక ప్రాంతం ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది? వంటి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
    • తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి వివిధ జిల్లాల్లో ముఖ్య చారిత్రక ప్రాంతాలు, పరిశ్రమలు, అక్కడ లభించే ఖనిజాలు, పండే పంటలు, ప్రవహించే నదులు, సాగునీటి ప్రాజెక్టులు, అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, అడవులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జాగ్రఫీ కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో ప్రిపరేషన్ ప్రారంభించాలి. అట్లాస్‌ను అనుసరించాలి.
  7. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా
    ‘భారత చరిత్ర, సాంస్కృతిక వారసత్వం’ అనే ఒక్క చిన్న వాక్యంలోనే దాదాపు వేల ఏళ్ల చరిత్ర నిక్షిప్తిమై ఉంది. హరప్పా నాగరికత నుంచి 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకూ... ముఖ్యమైన అంశాలను చదవాలి. ఇది చాలా విస్తృత అంశం. కాబట్టి విద్యార్థులు హిస్టరేనే కదా... అని తేలిగ్గా తీసుకోకుండా.. సీరియస్‌గా ప్రిపరేషన్ ప్రారంభించాలి. హిస్టరీని లోతుగా ప్రిపేర్ అవ్వడం మెయిన్స్‌లోనూ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బ్రిటిషర్ల రాక, ఆధునిక భారతదేశ చరిత్ర, వలస వాదం, 1857 తిరుగుబాటు, స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ముఖ్య ఘట్టాలు, జాతీయ వాదం, గాంధీశకం, 1935 చట్టం, క్విట్ ఇండియా ఉద్యమం, 1947లో స్వాతంత్య్రం సిద్ధించే వరకూ.. అన్ని అంశాలపైనా అవగాహన తప్పనిసరి. 6 నుంచి 12 వ తరగతి వరకూ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, బిపిన్ చంద్ర, తెలుగు అకాడెమీ పుస్తకాలను చదవొచ్చు.
  8. ఇండియన్ కానిస్టిట్యూటషన్ అండ్ పాలిటీ
    గ్రూప్-1 ప్రిలిమ్స్ పాలిటీకి సంబంధించి కోర్‌తోపాటు కాంటెంపరరీ అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. కాబట్టి 1935 భారత ప్రభుత్వ చట్టం, భారత రాజ్యాంగ రూపకల్పన, ప్రవేశిక, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, సంక్షేమ పాలన, ఎస్సీ/ఎస్టీలు, మహిళలు, పార్లమెంటు ఇటీవల చేసిన చట్టాలు, సుప్రీంకోర్టు తాజా తీర్పులు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. పాలిటీ ప్రిపరేషన్‌ను ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో ప్రారంభించొచ్చు. ఆ తర్వాత లక్ష్మీకాంత్, డీడీ బుసు వంటి పుస్తకాలు రిఫర్ చేయాలి.
  9. గవర్నెన్స్‌ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా
    పాలన, సుపరిపాలన, ఈ-గవర్నెస్, కేంద్ర స్థాయిలో పాలనా యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్, ఫైనాన్స్‌ కమిషన్, యూపీఎస్‌సీ, కాగ్ వంటి వ్యవస్థల పనితీరు, జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ కమిషన్లు, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పాలన, పరిపాలన, పాలనకు సంబంధించిన అంశాలు, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, ఈ-గవర్నెన్స్‌, అనువర్తనాలు, ఉపయోగాలు, పరిమితులు, సిటిజన్ చార్టర్స్, ప్రజాస్వామ్యంలో సివిల్ సర్వీస్ పాత్ర, పేదరికం, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలు- అమలు, అట్టడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, తీరుతెన్నులు, విద్య, ఆరోగ్యం, మానవ వనరుల అభివృద్ధి, అభివృద్ధిలో వివిధ సామాజిక సంస్థలు, ఎన్‌జీవోలు, సెల్ప్‌హెల్ప్ గ్రూప్స్ పాత్ర, పరిపాలనలో విలువలు, అవినీతి నిర్మూలన తదితర అంశాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రిలిమ్స్‌లో ఎలాంటి ప్రశ్నలు అడిగినా... సమాధానం గుర్తించే సామర్థ్యం వస్తుంది. ఎన్‌సీఈఆర్‌టీ, లక్ష్మీకాంత్, డీడీ బసు పుస్తకాలు ఉపయుక్తం.
  10. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలించి 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులు; తాగునీటి కోసం మిషన్ భగీరథ (వాటర్ గ్రిడ్), చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఆరోగ్య లక్ష్మి, గ్రామ జ్యోతి, పల్లె ప్రగతి వంటి పథకాలు ప్రారంభించింది. ఆయా పథకాలను ఎప్పుడు ప్రారంభించారు.. వాటి లక్ష్యం.. కేటాయింపులు.. లబ్ధిదారులు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

  11. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్‌‌ట్స, అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ
    ప్రాచీన తెలంగాణ చరిత్రను తీసుకుంటే... శాతవాహనుల కాలం నుంచి చాళుక్య యుగం వరకూ... నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వర్తక వ్యాపారాలు, సాహిత్య వికాసం గురించి ప్రధానంగా తెలుసుకోవాలి. అలాగే తెలంగాణ మధ్యయుగ చరిత్రను తీసుకుంటే.. కాకతీయుల కాలం నుంచి కుతుబ్‌షాహీల వరకూ.. నాటి సామాజిక పరిస్థితులు, వర్తక-వాణిజ్యాలు, సాహిత్యం, కాకతీయుల కాలం నాటి నీటిపారుదల వ్యవస్థ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఆధునిక తెలంగాణ చరిత్రలో.. అసఫ్ జాహీల చరిత్ర 1724 నుంచి 1948 వరకూ.. ముఖ్యంగా సాలార్‌జంగ్ సంస్కరణలు, భూమిశిస్తు విధానం, నాడు జరిగిన సామాజిక-సాంస్కృతిక ఉద్యమాలు, ఆదివాసీ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం వంటి అంశాలను అధ్యయనం చేయాలి. సమకాలీన తెలంగాణ ఉద్యమం వివిధ దశల్లో జరిగిన తీరు... అందుకు దోహదం చేసిన సామాజిక, ఆర్థిక, అస్తిత్వ పోరాట కారణాలను అకడెమిక్ కోణంలో అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్‌కు తెలుగు అకాడెమీ పుస్తకాలను ఒకటికి నాలుగుసార్లు చదవాలి.
  12. సోషల్ ఎక్స్‌క్లూజన్.. రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజెబిలిటీ, అండ్ ఇంక్లూజివ్ పాలసీస్
    ఇందులో ప్రధానంగా భారతదేశంలో ఆదివాసీలు, గిరిజనుల ప్రత్యేకత, దేశంలో కుటుంబం, మతం, కుల వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలి. సామాజిక మినహాయింపు, మధ్యతరగతి, వైకల్యం, భారతీయ సమాజంలో విలక్షణత-భిన్నత్వంలో ఏకత్వం, మానవ అక్రమ రవాణా, లింగ సమానత్వం, వెనుకబడిన వర్గాలను జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి.
  13. లాజికల్ రీజనింగ్: అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్
    అభ్యర్థుల లాజికల్ థికింగ్, మ్యాథ్స్‌పై అవగాహనను పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగం ఇది. ఇందులో మంచి స్కోర్ చేయాలంటే.. నంబర్ సీరీస్, కోడింగ్-డీకోడింగ్, సీటింగ్ అరేంజ్‌మెంట్, ర్యాంకులు-అమరిక, అక్షర క్రమం, రక్త సంబంధాలు, కాలం-దూరం, పని-కాలం, లాభం-నష్టం, శాతాలు, సగటులు తదితర అంశాలపై పట్టు సాధించాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ విభాగం నుంచి అడిగే ప్రశ్నలకు కచ్చిత సమాధానాలు గుర్తించే సామర్థ్యం లభిస్తుంది.

టాపర్ టిప్స్..
గ్రూప్-1 రాష్ట్ర స్థాయి పరీక్ష కావడంతో తెలంగాణకు సంబంధించిన సమాచారాన్ని ఎక్కువగా చదివాను. తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే, ప్రాచీన చరిత్ర, ఉద్యమ చరిత్ర పుస్తకాలను ఎక్కువగా చదివా. పాలిటీకి లక్ష్మీకాంత్ పుస్తకం, హిస్టరీకి శీనయ్య మెటీరియల్, బిపిన్ చంద్ర, ఎకనామిక్స్‌కు మునిరత్నం నాయుడు పుస్తకాలు, సైన్స్‌ అండ్ టెక్నాలజీకి సి.హరికృష్ణ పుస్తకాలు ఉపకరించాయి. పోటీ పరీక్షల శైలి పూర్తిగా మారిపోయింది. స్టాటిక్ సబ్జెక్టుపై కాకుండా తాజా పరిణామాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. ఇక మెయిన్ పరీక్షలో అత్యంత కీలకం రైటింగ్. అందుకోసం రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. గ్రూప్-1 పరీక్షల్లో విజయానికి ఎంతో సహనం ఉండాలి. స్థిరంగా లక్ష్యం వైపు అడుగులు వేయగలిగే ఓర్పు అవసరం.
- 2011 గ్రూప్-1లో మూడో ర్యాంకు ద్వారా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ దక్కించుకున్న బొందిలి రోహిత్ సింగ్.
Published date : 31 Dec 2018 08:15PM

Photo Stories