పోటీ పరీక్షలకు ‘ప్రైవేటు’ చదువు!
నిత్యం ఉండే పను లు, ఇతర సమస్యలతో ఇం ట్లో చదువుకోలేకపోవడం.. గ్రంథాలయాలకు వెళ్దామంటే కుర్చిలు, ఇతర సౌకర్యాలు లేక చదువుకోలేని పరిస్థితి ఉండటంతో.. దీనితో ప్రైవేటు రీడింగ్ హాల్స్‌వైపు చూస్తున్నారు. ఇటీవల నల్లగొండ పట్టణంలో ప్రైవేటుగా ఎనిమిది వరకు రీడింగ్ హాల్స్ వెలిశాయి. చాలా మంది నిరుద్యోగులు వీటిలో చదువుకుంటున్నారు.
అన్ని సౌకర్యాలతో ఆకట్టుకుంటూ..
ప్రైవేటు రీడింగ్ హాల్స్ నిర్వాహకులు.. షాపింగ్ కాంప్లెక్సుల పైఅంతస్తులు, ఫంక్షన్ హాళ్లు వంటి వాటిని తీసుకుని వాటిలో క్యాబిన్లు ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులు చదువుకోవడానికి నిశ్శబ్దంగా ఉండే వాతావరణం, ఫ్యాన్లు, ఏసీలు, తాగునీరు, టాయిలెట్లు సహా కావల్సిన అన్ని సౌకర్యాలను కలి్పస్తున్నారు. ప్రతి ఒక్కరికి వ్యక్తి గత క్యాబిన్ వంటి ఏర్పాటు ఉంటుంది. రిజి్రస్టేషన్ చేసుకున్న వారికి ఒక క్యాబిన్ ను కేటాయిస్తారు. అభ్యర్థి ఏ సమయంలోనైనా వచ్చి వారికి కేటాయించిన క్యాబిన్ లో కూర్చొని చదువుకోవచ్చు. ఇంటర్‌నెట్‌లో స్టడీ మెటీరియల్స్ చూసుకోవడానికి వైఫై సౌకర్యం ఉంటుంది. ఒక్కొక్కరికి నెలకు సుమారు రూ.700 నుంచి రూ.1,000 వరకు చార్జీ తీసుకుంటున్నారు. ఇంటర్నెట్, ఏసీ వంటి సౌకర్యాలున్న రీడింగ్ హాల్స్‌లో చార్జీలు కాస్త ఎక్కువగా ఉంటున్నాయి.