1, 433 Jobs: కొలువులకు గ్రీన్సిగ్నల్.. పోస్టుల వివరాలు ఇవీ...
Sakshi Education
సర్కారు కొలువులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా మున్సిపల్, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖల్లోని ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది.
ఈ రెండు శాఖల్లోని వివిధ కేడర్లలో 1,433 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు వివిధ శాఖల్లో 35,220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసినట్టయింది. ఈ పోస్టులన్నింటినీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన శాఖల్లోని ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థిక శాఖ కరసత్తు చేస్తోంది. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
పోస్టుల వివరాలు ఇవీ...
పోస్టు |
ఖాళీల సంఖ్య |
చీఫ్ ఇంజనీర్, ఆర్‌డబ్ల్యూఎస్ |
420 |
ఈఎన్‌సీ (జనరల్ అండ్ పంచాయతీరాజ్) |
350 |
పంచాయతీరాజ్, హెచ్‌ఓడీ |
3 |
టీఎస్‌ఐపీఏఆర్‌డీ |
2 |
ఎలక్షన్ కమిషన్, తెలంగాణ |
3 |
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఓడీ |
196 |
పబ్లిక్ హెల్త్ |
236 |
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ |
223 |
మొత్తం |
1,433 |
Published date : 08 Jun 2022 01:38PM