లీకేజీ కేసులో ఏ4 నిందితుడి ఉద్యోగం తొలగింపు
Sakshi Education
కుల్కచర్ల: టీఎస్‌పీఎస్పీ పేపర్ లీకేజీ కేసులో ఏ4గా ఉన్న డాక్యానాయక్‌ను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
పేపర్ లీకేజీలో కీలకంగా వ్యవహరించిన రేణుక భర్త డాక్యానాయక్ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో ఉపాధిహామీ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా(కాంట్రాక్ట్) విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారుల ఆదేశానుసారం మార్చి 20న డాక్యానాయక్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎంపీడీఓ నాగవేణి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చదవండి:
Governor: ప్రశ్నపత్రం ప్రచురణ ఎక్కడనే పరిస్థితి దాపురించింది
Published date : 21 Mar 2023 03:37PM