Skip to main content

TSPSC Paper Leak 2022 : టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌ల్లో మ‌రో కొత్త కోణం.. ఆ పరీక్షల‌ను కూడా రద్దు చేయాలని..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) పేపర్‌ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం.
tspsc paper leak news
tspsc paper leak news 2023 details

సీపీడీవో అండ్‌ ఈవో పరీక్ష పేపర్‌ లీక్‌ అయ్యిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 46 వేల మంది మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. దీంతో, సీపీడీవో అండ్‌ ఈవో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

☛ TSPSC Paper Leak 2023 : టీఎస్‌పీఎస్సీ 26 నోటిఫికేషన్లు.. 20 పరీక్షలకు పైగా ర‌ద్దు..?

పేపర్‌ లీక్‌లో వ్య‌వ‌హారంలో ఎంద‌రో..

tspsc latest news telugu

పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ప్రొఫెసర్‌, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ స్పందించారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పేపర్‌ లీక్‌లో ఒక్కరే ఉన్నారని అనుకోవడం లేదు. పేపర్‌ లీక్‌పై రకరకాల వదంతులు వచ్చాయి. పరీక్షల రద్దుతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. మళ్లీ క్వాలిఫై అవుతామో లేదోనని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది జీవితాలలో కేసీఆర్‌ ప్రభుత్వం ఆడుకుంటోంది. లీక్‌ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్‌ వెంటనే రాజీనామా చేయాల‌న్నారు.

➤☛ TSPSC Paper Leak Case : ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లోకి గ్రూప్‌–1 సహా ఇతర ప్రశ్నపత్రాలు.. ఇంకా న‌మ్మ‌లేని నిజాలు ఎన్నో..

టీఎస్‌పీస్సీలో సమగ్ర పక్షాళన జరగాలి. డిమాండ్ల సాధన కోసం అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తాము. రాష్ట్రంలో అన్ని పార్టీలతో కలిసి త్వరలో పోరాటానికి పిలుపునిస్తామన్నారు.

Published date : 20 Mar 2023 05:32PM

Photo Stories