Skip to main content

TSPSC: బాధితుల కోసం వాట్సాప్‌ నంబర్‌

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై హైకోర్టులో పిల్‌ వేయాలా, సుప్రీంకోర్టును ఆశ్రయించాలా అనే విషయంలో న్యాయసలహా ప్రకారం నిర్ణయం తీసుకుంటామని బీజేపీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కన్వీనర్, టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు సిహెచ్‌ విఠల్‌ తెలిపారు.
TSPSC
బాధితుల కోసం వాట్సాప్‌ నంబర్‌

పేపర్‌ లీక్‌ వల్ల నష్టపోయిన విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అయ్యేందుకు బీజేపీ ఒక వాట్సాప్‌ నంబర్‌ 8688821794ను అందుబాటులోకి తీసుకొచి్చంది. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు చంద్రవదన్, కృష్ణప్రసాద్, మర్రిశశిధర్‌రెడ్డి, ఎస్‌.కుమార్, కరుణాగోపాల్‌లతో కలిసి విఠల్‌ ఏప్రిల్‌ 11న మీడియాతో మాట్లాడారు. లీకేజీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేసి కేసీఆర్‌ సర్కార్‌ అభాసుపాలైందన్నారు.

చదవండి: TSPSC Paper Leak Case 2023 : ల‌వ‌ర్ కోసం.. క్వశ్చన్ పేపర్‌ను రూ.6 ల‌క్ష‌ల‌కు కొనుగోలు.. మ‌రో ఇద్ద‌రు ఆరెస్ట్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు..

పేపర్‌ లీకేజీపై విచారణ జరుపుతున్న సిట్‌ అధిపతికి కోర్టు ధిక్కార కేసులో నాలుగు వారాల శిక్ష పడిందని మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. పేపర్‌ లీక్‌ విషయంలో తమకు కేటీఆర్‌పై అనుమానాలున్నాయని, ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో యువతకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రపతి, గవర్నర్‌కు నివేదిక ఇవ్వాలని బీజేపీ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ నిర్ణయించినట్టు మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. 

చదవండి: TSPSC: సిబ్బందే లీక్‌ చేస్తారని ఊహించలేదు

Published date : 12 Apr 2023 01:35PM

Photo Stories