TS SI Success Story : హవల్దార్..నుంచి సివిల్ ఎస్సై ఉద్యోగం కొట్టానిలా.. నా సక్సెస్ సీక్రెట్ ఇదే..
ఈ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్(జి) మండలంలోని గొల్లమాడకు చెందిన తోట రమేశ్ సత్తాచాటి.. సివిల్ ఎస్సై ఉద్యోగాన్ని కొట్టాడు.
☛ Women SI Success Story : ఓ పేదింటి బిడ్డ 'ఎస్ఐ' ఉద్యోగం కొట్టిందిలా.. ఈమె విజయం కోసం..
తోట రమేశ్ వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడు. తోట చిన్న లస్మన్న–లస్మవ్వ దంపతుల కుమారుడు రమేశ్. తోట రమేశ్.. 16 ఏళ్లపాటు ఇండియన్ ఆర్మీలో హవల్దార్‌గా సేవలందించి 2020 నవంబర్‌లో రిటైరయ్యారు. అనంతరం రెండున్నర ఏళ్లుగా కష్టపడి చదువుతూ ఎస్సై పరీక్షకు ప్రిపేరయ్యారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో సివిల్ ఎస్సై ఉద్యోగం సాధించారు. కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమని నిరూపించారు. తోట రమేశ్‌ని గ్రామస్తులు, మండలవాసులు ఆయనకు అభినందనలు తెలిపారు.
వివిధ విభాగాలకు చెందిన 587 ఎస్సై ఉద్యోగాలకు 434 మంది పురుషులు, 153 మంది మహిళల్ని ఎంపికయ్యరు. ఆగస్టు 7వ తేదీన ఎస్సై, ఏఎస్సై పోస్టుల కటాఫ్ మార్కుల కేటాయింపు, అభ్యర్థుల జన్మతేదీ వంటి వివరాలు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.