ఐసోటోపులు
Sakshi Education
- ఒకే పరమాణు సంఖ్య, భిన్న ద్రవ్యరాశి సంఖ్యలను కలిగిన పరమాణువులను ఐసోటోపులు అంటారు. వీటిని కనుగొన్నది ఆస్టన్ (Aston).
- ఒక పరమాణు కేంద్రకంలో అదనంగా న్యూట్రాన్లు వచ్చి చేరినప్పుడు ఐసోటోపులు ఏర్పడతాయి.
- పరమాణు కేంద్రకంలో అదనంగా న్యూట్రాన్ వచ్చి చేరడం వల్ల దాని ధర్మాల్లో ఎలాంటి మార్పు ఉండదు.
- ఐసోటోపులు సహజసిద్ధంగా ప్రకృతిలో లభిస్తాయి. మానవుడు తన అవసరాల కోసం కావాల్సిన ఐసోటోపులను అణు రియాక్టర్లలో ఉత్పత్తి చేసుకొంటున్నాడు. అయితే అణు రియాక్టర్లలో ఉత్పత్తి అయిన ఐసోటోపులు రేడియోధార్మికతను ప్రదర్శిస్తాయి. అందువల్ల వీటిని రేడియో ఐసోటోపులు అంటారు.
- రేడియో అయోడిన్ (I131): అయోడిన్ లోపం వల్ల కలిగిన గాయిటర్ వ్యాధి నివారణకు దీన్ని ఉపయోగిస్తారు.
- రేడియో ఆక్సిజన్ : కిరణజన్య సంయోగక్రియలో O2 విడుదల నీటి నుంచి జరుగుతుందని నిరూపించడానికి రూబెన్, కామెన్ అనే శాస్త్రవేత్తలు H218O అనే ఐసోటోప్‌ను వాడారు.
- రేడియో సోడియం (Na23): మానవుని శరీరంలో రక్త సరఫరాలో గల లోపాలను తెలుసుకోవడానికి, హృదయ స్పందనలను నియంత్రించడానికి దీన్ని ఉపయోగిస్తారు.
- రేడియో ఫాస్ఫరస్ (P32): ఈ ఐసోటోపులను ఉపయోగించి మెదడులో ఏర్పడిన కణితి స్థానాన్ని గుర్తించొచ్చు. అలాగే యంత్ర భాగాల అరుగుదల శాతాన్ని, నిర్ణీత సమయంలో ఒక మొక్క (లేదా) చెట్టు పీల్చుకొన్న నీటి శాతాన్ని అంచనా వేయొచ్చు.
- రేడియో కోబాల్ట్ (CO60): వీటి నుంచి γ కిరణాలు విడుదలవుతాయి. ఈ కిరణాలకు ఎలాంటి ఆవేశం, ద్రవ్యరాశి లేకపోవడం వల్ల పదార్థంలో ఎక్కువ లోతుకు చొచ్చుకొని వెళ్ళగలుగుతాయి. అందువల్ల క్యాన్సర్ గడ్డలను కరిగించేందుకు ఈ ఐసోటోపులను వాడతారు. కాబట్టి ఈ పద్ధతిని కోబాల్ట్ థెరపీ అంటారు.
- రేడియో కార్బన్: దీన్ని కార్బన్ డేటింగ్ పద్ధతిలో వాడతారు. C14ను ఉపయోగించి శిలాజాల వయసును లెక్కించవచ్చు. ఈ పద్ధతిని లిబ్బి అనే అమెరికా శాస్త్రవేత్త కనుగొన్నాడు. శిలాజాల అధ్యయనాన్ని పేలియంటాలజీ అంటారు.
శిలాజం వయసు = సంఖ్య/
సంఖ్య- C14 అర్ధజీవిత కాలం - 5770 సం॥
- యురేనియం: దీన్ని యురేనియం లేదా రేడియో డేటింగ్‌లో వాడతారు. U235 ఉపయోగించి భూమి వయసును లెక్కించవచ్చు.
నోట్: మనదేశంలో రేడియో ఐసోటోపులను ఆయా అణురియాక్టర్లలో ఉత్పత్తి చేసి వినియోగ స్థలాలకు రవాణా చేయడం కోసం భారత అణుశక్తి సంఘం ముంబైలో Board of Radiation and Isotope Technology అనే కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
X - కిరణాలు
ఇది మానవుడి తొలి శాస్త్రీయ ఆవిష్కరణ. క్రీ.శ.1895లో రాంట్‌జన్ కనుగొన్నాడు. అందువల్ల ఇతనికి భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ బహుమతి 1901లో లభించింది.
ధర్మాలు- ఉపయోగాలు:
- l Xకిరణాల తరంగదైర్ఘ్య అవధి 0.01Å ల నుంచి 100Å వరకు ఉంటుంది. కాబట్టి క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఈ కిరణాలు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి.
- వీటికి ఎలాంటి ఆవేశం, ద్రవ్యరాశి ఉండవు. అందువల్ల ఇవి ఒక రకమైన విద్యుదయస్కాంత తరంగాలు.
- విద్యుత్, అయస్కాంత క్షేత్రాల్లో ఇవి అపవర్తనం చెందవు.
- వీటి అయనీకరణ సామర్థ్యం దాదాపు శూన్యం. ఎందుకంటే [e=m=0]
- శూన్యంలో (లేదా) గాలిలో X-కిరణాల వేగం కాంతి వేగానికి సమానం.
(3×108m/sec) - X-కిరణాలు ఫొటోగ్రాఫిక్ ప్లేట్‌ను ప్రభావితం చెందిస్తాయి.
- ఈ కిరణాలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు.
i. కఠిన X- కిరణాలు, ii. మృదు X- కిరణాలు
ఉపయోగాలు:
- పైపులు, బాయిలర్లు, ఆనకట్టల్లో గల రంధ్రాలు (లేదా) పగుళ్ల స్థానాన్ని గుర్తించేందుకు వాడతారు.
- రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, విమానం, నౌకాశ్రయాలు, దేశ సరిహద్దుల వద్ద ప్రయాణికుల లగేజీని తనిఖీ చేసేందుకు ఉపయోగిస్తారు.
- స్మగ్లర్ల శరీరంలో ఉన్న ఓపియం (మత్తుమందు), ఆభరణాలు, పేలుడు పదార్థాలను గుర్తించేందుకు వాడతారు.
- జీర్ణాశయం X-కిరణాల ఫొటో తీసే ముందు రోగికి బేరియం మీల్స్ [BaSO4అనే రసాయన ద్రావణాన్ని తాగిస్తారు. ఈ రసాయన పదార్థం X-కిరణాలను కావాల్సిన చోట కేంద్రీకృతం చేస్తుంది.
- ముత్యాల ఉనికి, రబ్బరుటైర్లు, బంగారం, టెన్నిస్ బంతిలో లోపాలను గుర్తించేందుకు వాడతారు. సి.టి. (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) స్కానింగ్‌లో ఈ కిరణాలను ఉపయోగిస్తారు. వీటిని సర్ గాడ్‌ఫ్రే హౌంస్ ఫీల్డ్ కనుగొన్నందుకు అతనికి 1979లో వైద్యరంగంలో నోబెల్ బహుమతి లభించింది.
- వీటిని ఉపయోగించి రోగనిర్ధారణ చేయడాన్ని రేడియోగ్రఫీ అని, రోగ చికిత్స చేయడాన్ని రేడియోథెరపీ అని అంటారు. అందువల్ల X-కిరణాలను ఉపయోగించి పనిచేసే డాక్టర్‌ను Radiologist అంటారు.
12. X-కిరణాలను ఉత్పత్తి చేసేందుకు కూలిడ్జినాళం అనే పరికరాన్ని వాడతారు. ఈ పరికరాన్ని సీసపు పెట్టెలో అమర్చుతారు. ఎందుకంటే సీసం ద్వారా X-కిరణాలు చొచ్చుకొని వెళ్ళలేవు.
కాస్మిక్ కిరణాలు (విశ్వ కిరణాలు)
ఈ కిరణాలను క్రీ.శ.1912లో విక్టర్ హెజ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నందుకు అతనికి 1936లో నోబెల్ బహుమతి లభించింది. వీటికి కాస్మిక్ కిరణాలు అని పేరు పెట్టిన శాస్త్రవేత్త మిల్లికాన్.
ధర్మాలు: విశ్వ కిరణాల్లో గల ముఖ్య కణాలు
1. ఎలక్ట్రాన్
2. పాజిట్రాన్
3. ప్రోటాన్
4. న్యూట్రాన్
5. అయాన్‌లు
కాస్మిక్ కిరణాలు (విశ్వ కిరణాలు)
ఈ కిరణాలను క్రీ.శ.1912లో విక్టర్ హెజ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నందుకు అతనికి 1936లో నోబెల్ బహుమతి లభించింది. వీటికి కాస్మిక్ కిరణాలు అని పేరు పెట్టిన శాస్త్రవేత్త మిల్లికాన్.
ధర్మాలు: విశ్వ కిరణాల్లో గల ముఖ్య కణాలు
1. ఎలక్ట్రాన్
2. పాజిట్రాన్
3. ప్రోటాన్
4. న్యూట్రాన్
5. అయాన్‌లు
- అయితే వీటిలో సుమారు 80 శాతం వరకు ప్రోటాన్లు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు, నక్షత్రాల్లో ప్రోటాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
- వీటి ఉనికి, దిశలను తెలుసుకొనేందుకు ఉపయోగించేది కాస్మిక్ రే టెలిస్కోప్.
- ఈ కిరణాల తీవ్రత ధృవాల వద్ద ఎక్కువగా, భూమధ్యరేఖ వద్ద తక్కువగా ఉంటుంది.
- ఈ కిరణాల శక్తి 109ev నుండి 1020ev వరకు ఉంటుంది. అందువల్ల క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఈ కిరణాల తరంగదైర్ఘ్యం తక్కువగా ఉంటుంది. విశ్వంలో ఉన్న అన్ని కిరణాల కంటే గరిష్టమైన శక్తిని కాస్మిక్ కిరణాలు కలిగి ఉన్నాయి.
- కాస్మిక్ కిరణాలను 2 రకాలుగా వర్గీకరిస్తారు.
1. కఠిన 2. మృదు- కఠిన కాస్మిక్ కిరణాలు: 10 సెం.మీ.ల మందం గల సీసపు దిమ్మె ద్వారా చొచ్చుకొని వెళ్ళేవి. ఇవి సూపర్ నోవా నుంచి వెలువడి ఉండొచ్చని భావన.
- మృదు కాస్మిక్ కిరణాలు: 10 సెం.మీ. మందం గల సీసపు దిమ్మె ద్వారా చొచ్చుకొని వెళ్ళలేక ఆగిపోతాయి. ఇవి నోవా నుంచి (లేదా) సూర్యుని ఉపరితలం నుండి వెలువడుతుండొచ్చని భావన.
- మనదేశంలో కాస్మిక్ కిరణాల గురించి అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల్లో ముఖ్యులు..
1. విక్రం సారాభాయి,
2. హెచ్.జె. బాబా
3. మేఘనాథ్ సాహా మొదలైనవారు. - 1985లో భారత్, అమెరికా శాస్త్రవేత్తలు సంయుక్తంగా అనురాధ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించి కాస్మిక్ కిరణాల గురించి అధ్యయనం చేశారు.
- భారీ నక్షత్రాలు: వీటి ద్రవ్యరాశి చాలా ఎక్కువగా ఉండి పెద్ద పరిమాణంలో ఉంటాయి.
ఉదా: ఎప్సిలాన్ అరిగా - మధ్యతరహా: వీటి ద్రవ్యరాశి భారీ నక్షత్రాల కంటే తక్కువగా ఉంటుంది.
ఉదా: సూర్యుడు - మరుగుజ్జు నక్షత్రాలు: వీటి ద్రవ్యరాశి పైన పేర్కొన్న నక్షత్రాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. విశ్వంలో అధిక నక్షత్రాలు ఈ రకానికి చెందినవే.
Published date : 16 Aug 2016 12:42PM