Skip to main content

TS SI and Constable Part 2 Application Documents : ఎస్సై, కానిస్టేబుల్‌ పార్ట్‌-2 దరఖాస్తుకు కావాల్సిన సర్టిఫికెట్లు ఇవే.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవల నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష 2022 ఫలితాలను అక్టోబ‌ర్ 21వ తేదీన విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులు పార్ట్‌-2 దరఖాస్తును అక్టోబర్ 27వ తేదీ నుంచి చేసుకోవాలి.

ఈ దశలో అభ్యర్ధులు ముందుగా అవసరమైన ధ్రువీకరణపత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించవల్సి ఉంటుంది. ఈ క్రమంలో అర్హులైన అభ్యర్ధులందరూ తదుపరి దశగా పలిచే ‘పార్ట్‌-2’గా పిలిచే ఈ ప్రక్రియలో భాగంగా https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి. ఈ అవ‌కాశం అక్టోబ‌రు 27వ తేదీ నుంచి నవంబరు 10వ తేదీ వరకు ఉంది. అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేస్తేనే అభ్యర్థులు తదుపరి దశకు అర్హత సాధిస్తారు.

TS SI & Constable Prelims Exam Results 2022 link : ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత ప‌రీక్ష‌ ఫలితాలు విడుదల.. ఎంత మంది పాస్ అయ్యారంటే..

తుది గడువు వరకు వేచి చూడకుండా ముందుగానే..

ts police

తెలంగాణ ప్రభుత్వం వివిధ నోటిఫికేషన్ల కింద విడుదల చేసిన 554 ఎస్సై, 16,321 కానిస్టేబుల్‌ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8.5 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రాయగా వారిలో 2.69 లక్షల మంది అర్హత సాధించారు. తుది గడువు వరకు వేచి చూడకుండా ముందుగానే సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసుకోవల్సిందిగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సూచిస్తోంది.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నియామక ప్రక్రియ జరుగుతుండటంతో స్థానికత అంశం కీలకంగా మారింది. ఈ మేరకు తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఉద్యోగాలను జిల్లా, కంటీజియస్‌ జిల్లా కేడర్‌గా విభజించారు. ఆయా కేడర్లలో స్థానికులకే 95 శాతం ఉద్యోగావకాశాలుండటంతో అభ్యర్థులు స్థానికతను రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

చ‌ద‌వండి : TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

కావాల్సిన‌ డాక్యుమెంట్స్ ఇవే..

Police Jobs Documents

1. డేట్ ఆఫ్ బర్త్ కొరకు DOB సర్టిఫికేట్ లేదా.. పదో తరగతి మెమోను అప్ లోడ్ చేయాలి.

2. ఎస్సై అభ్యర్థులు అయితే.. డిగ్రీ సర్టిఫికేట్ ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ అభ్యర్థులు ఇంటర్‌ మెమోను అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది.

3. బీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ కింద వర్తిస్తే.. నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. వీటిని ఎంఆర్ఓల ద్వారా జారీ చేయపడతాయి. ఈ సర్టిఫికేట్స్ అనేవి ఏప్రిల్ 1, 2021 తర్వాత తీసుకుంటే వాటిని పరిగణలోకి తీసుకుంటారు.

4. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు EWS సర్టిఫికేట్ ను తీసుకోవాలి. వీటిని అప్లికేషన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

5. 1వ త‌ర‌గ‌తి నుంచి 10వ తరగతి వరకు స్డడీ సర్టిఫికేట్స్ ఉండాలి. లేదంటే.. 1 నుంచి 7వ త‌ర‌గ‌తి వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నా సరిపోతుంది.

6. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం తప్పినిసరిగా ఉండాలి.

7. ఏజెన్స్ ఏరియాకు చెందిన వారు.. ఏజెన్సీ కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.

7. ఆధార్ కార్డు, పరీక్ష హాల్ టికెట్స్ ను కూడా దగ్గర ఉంచుకోవాలి.

8. ఇతర రిజర్వేషన్ అభ్యర్థులు రిజర్వేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

9. ఇంతక ముందు నుంచే ప్రభుత్వం ఉద్యోగంలో కొనసాగుతున్న వారు.. సర్వీస్ సర్టిఫికేట్ ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు.. నో డ్యూ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతంది.

Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్‌ ఇదే.. ఇలా చదివితే..

స్థానికత విష‌యంలో మాత్రం..

TS Police Local Jobs

అందుకు 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకున్న పాఠశాలల నుంచి పొందిన స్టడీ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఆ ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే స్థానికత కానుంది. ఒకవేళ ఈ పత్రాల్ని సమర్పించకపోతే స్థానికేతరులుగా పరిగణించే అవకాశం ఉంది. అప్పుడు నాన్‌లోకల్‌ కోటాలో 5 శాతం మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగే క్యాస్ట్‌ (కుల ధ్రువీకరణపత్రాలు) సర్టిఫికెట్‌ కూడా కీలకమైనది. ఏ మాత్రం తప్పటడుగు వేసినా జనరల్‌ కేటగిరీగా పరిగణించే అవకాశం ఉంది.

ఎస్సై ప్రిలిమినరీ ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & ‘కీ’  కోసం క్లిక్ చేయండి

Published date : 26 Oct 2022 06:27PM

Photo Stories