AP Police Jobs 2022 : పోలీసు ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. 6,511 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..
ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొద్ది నెలల క్రితం పోలీసు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈమేరకు పోలీసు శాఖ రూపొందించిన నియామక ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది. మొదటి దశ కింద ఈ ఏడాది 6,511 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ను ఖరారు చేసింది.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
డిసెంబర్ నాటికి దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేయనుంది. 2023 ఫిబ్రవరిలో రాత పరీక్ష, అనంతరం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించనుంది. ఎంపికైన అభ్యర్థులకు 2023 జూన్‌లో పోలీసు శిక్షణ ప్రారంభించి 2024 ఫిబ్రవరి నాటికి వారికి పోలీసు శాఖలో పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || SI, Constable Jobs||Events
అత్యధిక ఉద్యోగాలు ఈ విభాగంలోనే..
రిజర్వ్ విభాగంలో 96 ఎస్సై పోస్టులను, అలాగే సివిల్ విభాగంలో 315 ఎస్సై పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ విభాగంలో 2520 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అలాగే సివిల్ విభాగంలో 3580 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 6511 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఒకే సారి ఇచ్చే అవకాశం ఉంది. అత్యధికంగా సివిల్ విభాగంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కొన్నేళ్లుగా పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగులకు త్వరలోనే ఊరట లభించనున్నది.
GK & Current Affairs: పోలీసు ఉద్యోగాల రాతపరీక్షలో.. కరెంట్ అఫైర్స్, జీకే పాత్ర..
Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ కసితోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..
Competitive Exams: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా..? కాదా..?