SI Success Story: ఉద్యోగం చేస్తూ ఎస్ఐగా కొలును సాధించాడు
మండల పరిధిలోని కమలాపురం గ్రామానికి చెందిన తాటికొండ మాధవచారి గ్రామంలో డిష్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తనుకున్న శక్తికి మించి కుమారుడు సాయి శశాంక్‌ను ఉన్నత చదువులు చదివించారు. తొలుత గ్రామంలోని తాఫర్ విద్యావిహార్ హై స్కూల్‌లో 1 నుంచి 10 వరకు చదివించాడు.
SI Post Achievers: ఎస్ఐగా కొలువు సాధించిన ఇద్దరు యువకులు
మొక్కవోని దీక్షతో చదివి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ లోని అమీర్‌పేట్ తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. కొలువు సాధించి తల్లిదండ్రుల కష్టం తీర్చాలనే లక్ష్యంతో ఎస్సై ఉద్యోగం కోసం నిరంతరం ప్రిపేర్ అయ్యాడు. ఈ క్రమంలో శనివారం విడుదలైన ఎస్సై పరీక్షా ఫలితాల్లో కాళేశ్వరం జోన్ 1 నుంచి ఓపెన్ కటాఫ్‌లో 400/272 మార్కులతో సాయి శశాంక్ ఎస్సై కొలువును సాధించాడు.
SI Success: అపజయాన్ని విజయంగా మార్చుకున్న యువకుడు..
పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. మండలంలో డిష్ ఆపరేటర్‌గా అందరికి సుపరిచితుడైన మాధవచారి కుమారుడు ఎస్సైగా ఉద్యోగం సాధించిన విషయం తెలుసుకుని పరిచయస్తులు, బంధువులు ఫోన్‌చేసి సంతోషాన్ని పంచుకుంటున్నారు.