Success Story as SI: పట్టుదలతో ఎస్ఐగా ఎంపికైన యువకులు
చదువుకు పేదరికం అడ్డుకాదని చదువుకుంటే ఏదైనా సాధించవచ్చన్న తపనతో కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగం సాధించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నిరుపేద యువకులు పోలీస్ ఉద్యోగంలో స్థిరపడాలన్న లక్ష్యంతో కష్టపడి చదివి, నిరంతర సాధన చేశారు. విడుదలైన ఫలితాల్లో ఎస్సైలుగా ఎంపికైనట్లు వెల్లడించారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మారుమూల మండలమైన నాగలిగిద్ద నుంచి ఇద్దరు ఎస్సైలుగా ఎంపికయ్యారు.
Woman SI Success Story: డీఎస్పీ కొలువు లక్ష్యంగా.. కానీ!
నాగలిద్ద మండలంలోని కరస్ గుత్తి గ్రామానికి చెందిన అల్లపురే భీం రావ్ బీటెక్ పూర్తి చేశారు. 2013-18 కాలంలో కరస్ గుత్తి సర్పంచ్ గా పని చేశాడు. రెండేళ్లుగా పంచాయతీ సెక్రటరీగా కొనసాగుతూనే.. ఎస్సై పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతూ ఉత్తీర్ణ సాధించారు. తండ్రి అశోకరావు, లలితాబాయి హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
Woman IAS Success Story: దృఢ సంకల్పంతో యువతి విజయం
అదేవిధంగా ముక్టపూర్ గ్రామానికి చెందిన గరిడే గామ్ పుండ్లిక్ కొన్ని నెలలుగా విద్య వాలంటీరుగా పనిచేస్తూ సప్లమెంటరీ డిగ్రీ పూర్తి చేసి ఎస్సై పోస్ట్ కోసం ప్రిపేర్ అయి ఉద్యోగం సాధించాడు. అతడి తండ్రి విఠల్ 20 ఏళ్ల క్రితమే మరణించారు. తల్లి సరస్వతి కష్టపడి గొడకు పుండ్లిక్ ను చదివించింది.
Civil SI: సివిల్ ఎస్ఐగా ఎంపికైన రచిత్ర
శెరి దామురుగిద్ద పంచాయతీ పరిధిలోని గోప్య నాయక్ తాండకు చెందిన రాథోడ్ వినోద్ ఎస్సైగా ఎంపికయ్యాడు. తెలంగాణ మోడల్ స్కూల్ మెర్గిలో 2015-16 పదో తరగతి పూర్తి చేసి, 2016-2018 ఇంటర్ వరకు చదువుకున్నారు. అనంతరం డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఆయన తండ్రి రాందాస్, శాంతాబాయిలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంటారు.