Woman SI Success Story: డీఎస్పీ కొలువు లక్ష్యంగా.. కానీ!
Sakshi Education
తన చదువు ముగిసాక పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో సివిల్ ఎస్ఐగా పోటీ పడింది ఈ యువతి. తనకు డీఎస్పీగా ఎంపిక అవ్వాలని లక్ష్యం. కానీ, ప్రస్తుతం తను ఎస్ఐగా కొలువు సాధించింది.
అన్సాన్‌పల్లి గ్రామానికి చెందిన బానోతు సమ్మయ్య–లలిత దంపతుల కుమార్తె బానోతు గీత సివిల్ ఎస్సైగా ఎంపికయ్యారు. గీత పదో తరగతి వరకు పెద్దపల్లి జిల్లాలోని 8వ కాలనీలోనే చదువుకున్నారు. గోదావరిఖని గాంధీ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివారు.
Constables Success Stories : ఈ ఆరుగురు కానిస్టేబుల్స్.. ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..
ఇటీవల నిర్వహించిన ఎస్సై పరీక్షలకు హాజరై సివిల్ ఎస్సైగా ఎంపికయ్యారు. గ్రూప్–1, కానిస్టేబుల్ పరీక్షలకు సైతం గీత హాజరయ్యారు. డీఎస్పీ కొలువు సాధించడం తన లక్ష్యమని తెలిపారు. ఎస్సై కొలువు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తంచేశారు.
Published date : 08 Oct 2023 02:07PM