Skip to main content

Dream Achievement: ప‌ట్లుద‌ల‌తో గ‌మ్యానికి చేరిన యువ‌తీయువ‌కుడు

ఈ ఇద్ద‌రూ అతిసాధార‌ణ కుటుంబానికి చెందిన విద్యార్థులు. వీరి గమ్యం ఎస్ఐ గా ఎంపిక‌వ్వ‌డం, పోలీస్ శాఖ‌లో ప‌ని చేయ‌డం. ఈ నేప‌థ్యంలోనే వీరి కుటుంబాలు కూడా స‌హ‌క‌రించ‌డంతో ఫ‌లితం ద‌క్కింద‌ని తెలిపారు.
Achievement of dream by young talents
Achievement of dream by young talents

మండలంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన పల్లె పవన్‌ సివిల్‌ ఎస్సైగా ఎంపికయ్యాడు. ఇప్పగూడెంకి చెందిన పల్లె సత్యనారాయణ, వసంతల కుమారుడు పవన్‌. సత్యనారాయణ గీతకార్మికుడిగా పనిచేస్తుండగా.. వసంత గృహిణి. కాగా, చిన్ననాటి నుంచి పోలీస్‌ ఉద్యోగాన్ని ఇష్టపడే పవన్ ప‌ట్టుద‌ల‌తో చదివాడు. సివిల్‌ ఎస్సైగా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. కాగా.. గ్రామం నుంచి మొదటిసారి పవన్‌ ఎస్సైగా ఎంపికవడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Dream Successful: యువ‌కుడి గెలుపుతో ఊరంతా సంబరం

కొన్నె గ్రామానికి చెందిన సోనీ..

మండలంలోని కొన్నె గ్రామంలో పేద కుటుంబానికి చెందిన కందుకూరి సోనీ ఆదివారం వెలువడిన ఎస్సై ఫలితాల్లో ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన కందుకూరు శంకరయ్య, బుచ్చమ్మ దంపతులకు ఆరుగురు కుమార్తెలు కాగా.. ఒక కుమారుడు. అందులో ఒకరు సోనీ. ఆమె ఎస్సైగా ఎంపిక కావడంపై పలువురు అభినందించారు. కుటుంబసభ్యులు స్వీట్లు పంచిపెట్టారు.

Constable Posts Achievers: కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టామిలా.. మా కుటుంబంలో..

Published date : 08 Oct 2023 01:36PM

Photo Stories