ఒకేరోజు రెండు పరీక్షలా?
Sakshi Education
రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నేతృత్వంలో ఆగస్టు 7న నిర్వహించనున్న సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రిలిమినరీ రాత పరీక్షను వాయిదా వేయాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అ«ధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.
ఆయన జూలై 19న గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆగస్టు 7న UPPSC ఆధ్వర్యంలో పారా మిలటరీ అసిస్టెంట్ కమాండెంట్ పరీక్ష కూడా జరగనుందని గుర్తు చేశారు. రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆగస్టు 7న కాకుండా మరో తేదీన పరీక్ష నిర్వహించాలని ఆయన కోరారు. ఒకే రోజు అభ్యర్థులు రెండు పరీక్షలు ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు.
చదవండి:
Published date : 20 Jul 2022 04:05PM