పోలీసుశాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే సీనియారిటీ!
Police Departmentలో మల్టీజో నల్–1, మల్టీజోనల్–2 ఉన్నాయి. గతంలో వరంగల్ జోన్, హైదరాబాద్ జోన్‌గా ఉన్న ఈ రెండు ఇప్పుడు మల్టీజోన్లుగా అందుబా టులోకి వచ్చాయి. Inspector, DSP కేడర్ పోస్టులు మల్టీజోన్ పరిధిలో ఉండగా, హెడ్‌కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులేమో రేంజ్ పరిధిలో ఉంటాయి. అయితే ప్రమోషన్లకు కీలకంగా మారే సీనియారిటీ జాబితా రూపొందించడంలో ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకే సీనియారిటీ ఉంటుందని పోలీస్‌వర్గాలు తెలిపాయి. పోలీస్ ఉద్యోగానికి ఎంపికైన సమయంలో అకాడమీలో ఉన్న సీనియారిటీ ప్రామాణికం గానే జాబితా రూపొందిస్తారని, రెండు మల్టీజోన్లలో ఏర్పడే ఖాళీల ఆధారంగా ఆయా మల్టీజోన్లలో పనిచేసే అధికారులకు పదోన్నతులు కల్పిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. రేంజ్‌ల్లో పనిచేసేవారికి కూడా ఒకే సీనియారిటీ ద్వారా పదోన్నతు లు కల్పిస్తారని, జోన్ కేడర్‌లో పనిచేసేవారికి కూడా అక్కడ ఏర్పడిన ఖాళీ ఆధారంగా పదోన్నతి ఆటోమెటిగ్గా వచ్చేలా నిబంధన లు రూపొందించినట్టు వెల్లడించారు. దీని ద్వారా సీనియారిటీ సమస్యలు రాకుండా ఉండటంతోపాటు ఏక విధానం ద్వారా పదోన్నతులు కల్పించే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. అగ్జిలేటరీ ప్రమోషన్ పొందిన అధికారి తన బ్యాచ్ అధికారుల ముందు వరుసలో ఉంటారని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
చదవండి: