TSLPRB: ‘పోలీస్’ తుది పరీక్షల షెడ్యూల్ ఇదే..
మార్చి 12 నుంచి పలు విభాగాల్లోని 17,560 పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో పోలీస్ ఉద్యోగార్థులు తీవ్రంగా శ్రమించే సివిల్ ఎస్సై పోస్టులకు రాత పరీక్షను ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు. సివిల్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షను ఏప్రిల్ 23న నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు పరీక్షల తేదీలను వెల్లడిస్తూ ఆయన జనవరి 1న ఓ ప్రకటన విడుదల చేశారు. దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు తుది రాతపరీక్షకు సన్నద్ధం కావాలని సూచించారు.
చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్
పోస్టుల వారీగా తుది రాత పరీక్షల షెడ్యూల్
తేదీ |
సమయం |
పోస్ట్ |
వేదిక |
12–03–2023 |
ఉ.10:00–1:00 |
కమ్యూనికేషన్ ఎస్సై |
హైదరాబాద్ |
12–03–2023 |
మ.2.30–5:30 |
ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై |
హైదరాబాద్ |
26–03–2023 |
ఉ.10:00–1:00 |
ఎస్సై (పీటీఓ) |
హైదరాబాద్ |
02–04–2023 |
ఉ.10:00–1:00 |
కానిస్టేబుల్ (డ్రైవర్) |
హైదరాబాద్ |
02–04–2023 |
మ.2–30–5:30 |
కానిస్టేబుల్ (మెకానిక్) |
హైదరాబాద్ |
08–04–2023 |
ఉ.10:00–5:30 |
సివిల్ ఎస్సై (అర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లిష్) |
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ |
09–04–2023 |
ఉ.10:00–5:30 |
సివిల్ ఎస్సై (జనరల్ స్టడీస్, తెలుగు/ఉర్దూ) |
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ |
23–04–2023 |
ఉ.10:00–1:00 |
సివిల్/ట్రాన్స్‌పోర్ట్ /ఎక్సైజ్ కానిస్టేబుల్ |
ఉమ్మడి పది జిల్లా కేంద్రాలు |
23–04–2023 |
మ.2:30–5:30 |
ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ |
హైదరాబాద్ |
ఈనెల 5తో ముగియనున్న దేహదారుఢ్య పరీక్షలు
పలు విభాగాల్లోని ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు డిసెంబర్ 8న ప్రారంభించారు. ఈ ప్రక్రియ జనవరి 5తో ముగియనుంది. హైదరాబాద్‌సహా తెలంగాణ వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఫిజికల్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష హాల్‌టికెట్లను త్వరలోనే జారీ చేయనున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు. డ్రైవర్, డ్రైవర్ ఆపరేటర్స్, మెకానిక్ పోస్టులకు పోటీపడుతున్న అభ్యర్థులకు డ్రైవింగ్ టెస్ట్ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిపారు.