Skip to main content

TSLPRB: కానిస్టేబుల్‌ తుది రాత పరీక్ష ప్రాథమిక కీ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: యూనిఫాం సర్వీసెస్‌ కొలువుల భర్తీలో భాగంగా వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన తుది రాత పరీక్ష ప్రాథమిక కీ మే 22 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది.
TSLPRB
కానిస్టేబుల్‌ తుది రాత పరీక్ష ప్రాథమిక కీ విడుదల

ఈ మేరకు టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు మే 21న ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు  www.tslprb.in వెబ్‌సైట్‌లో ప్రాథమిక కీ ని చూడవచ్చని తెలిపారు. ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలుంటే ప్రతి ప్రశ్నకు వేర్వేరుగా అభ్యంతరాలు వెబ్‌సైట్‌లో సూచించిన వెబ్‌ టెంప్లేట్‌ ఫార్మట్‌లో మే 24 సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు.

చదవండి: TS Constable Final Exam Preliminary Key 2023 : కానిస్టేబుల్ ఫైన‌ల్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల.. ఈ ప్ర‌శ్న‌ల‌కు..

అభ్యంతరాలున్న ప్రతి ప్రశ్నకు వేర్వేరుగా సూచించిన ఫార్మట్‌లోనే అభ్యంతరాలు పంపాలని, లిఖితపూర్వకంగా నేరుగా పంపే అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్ల స్కాన్‌ కాపీలను తుది కీ విడుదల చేసిన తర్వాత మాత్రమే అభ్యర్థుల యూజర్‌ అకౌంట్లకు పంపుతామని తెలిపారు.

చదవండి: Inspiring Story : శెభాష్‌.. ఇద్దరు ఇద్ద‌రే.. ఒకేసారి మహిళా డీజీపీలుగా..

Published date : 22 May 2023 03:12PM

Photo Stories