Skip to main content

Police jobs: పోలీసు ఉద్యోగాలకు మొదటిరోజే 15 వేల దరఖాస్తులు

  • పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు 

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసిన 17 వేల పైచిలుకు పోస్టులకు మొదటిరోజు దరఖాస్తులు భారీగానే వచ్చాయి. సోమవారం ఉదయం 8 గంటలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా 12 గంటల్లోనే 15 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చినట్లు బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఎలాంటి సాంకేతిక సమస్య రాలేద న్నారు. దర ఖాస్తు వేళ సాంకేతిక సమస్యలు తలెత్తితే సంబంధిత టెక్నికల్‌ టీం ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని స్పష్టం చేశారు. గత నోటిఫికేషన్ల సమయంలో కూడా మొదటి రెండు రోజులు భారీగా దరఖాస్తులు రాకపోయినా వారం రోజుల్లోనే 52 నుంచి 53% మేర దరఖాస్తులను బోర్డు స్వీకరించింది. గతంలో నిర్వహించిన ఉద్యోగాల భర్తీకి మొత్తం 6 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి బోర్డు ఆధ్వర్యంలో సివిల్‌ పోలీసు, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు విభాగాల ఉద్యో గాలు భర్తీ చేస్తున్నందున గతం కంటే ఎక్కువగా దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. మూడో రోజు నుంచి భారీగా దర ఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  

Also read: పోలీస్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు తెలుసుకోండిలా..

Published date : 03 May 2022 03:53PM

Photo Stories