తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర
1. వేయి స్తంభాల గుడి నిర్మాణానికి సంబంధించని అంశం?
1) ఏకశిల
2) త్రికూఠ శైలి నిర్మాణం
3) నక్షత్ర ఆకారం
4) నల్లని రాతి పనితనం
- View Answer
- సమాధానం: 1
2. బౌద్ధ మతస్థులకు అభయం ఇస్తున్నట్లుగా ఉన్న మాందాత శిల్పం ఎక్కడ ఉంది?
ఎ) ఏలేశ్వరం
బి) జగ్గయ్యపేట
సి) నాగార్జునకొండ
డి) బావికొండ
1) ఎ, బి మాత్రమే
2) సి మాత్రమే
3) సి, డి మాత్రమే
4) బి మాత్రమే
- View Answer
- సమాధానం: 4
3. ఆంధ్రుల గురించి పేర్కొనే అశోకుడి శిలాశాసనం ఏది?
1) 9వ
2) 13వ
3) 6వ
4)10వ
- View Answer
- సమాధానం: 2
4. శాతవాహనుల నిజమైన రాజ్యస్థాపకుడు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) సిముఖుడు
4) శాతకర్ణి-1
- View Answer
- సమాధానం: 4
5. ‘ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ గ్రంథ రచయిత?
1) వెల్లోడి
2) కె.ఎం. మున్షీ
3) లాయక్ అలీ
4) జె.ఎన్. చౌదరి
- View Answer
- సమాధానం: 3
6. కంచి, పొన్న అనే నాట్యగత్తెలు ఏ పాలకుల కాలంలో ప్రసిద్ధి?
1) వెలమ
2) రెడ్డి
3) కాకతీయ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
7. శాతవాహనుల కాలం నాటి అంతర్జాతీయ నౌకా కేంద్రం?
1) అరికమేడు(పుదుచ్చేరి)
2) బారిగజ
3) మైసోలియా
4) కళ్యాణి
- View Answer
- సమాధానం: 1
8. ప్రఖ్యాత అమరావతి స్తూపాన్ని నిర్మించిన శాతవాహన రాజు?
1) గౌతమీ పుత్ర శాతకర్ణి
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) మూడో పులోమావి
4) రెండో పులోమావి
- View Answer
- సమాధానం: 4
9. కాకతీయుల కాలం నాటి ఉద్యోగుల గురించి పేర్కొన్న రచన ఏది?
1) క్రీడాభిరామం
2) సకల నీతి సమ్మతం
3) సుమతీ శతకం
4) భోగినీ దండకం
- View Answer
- సమాధానం: 2
10. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బండెనక బండి కట్టి... అనే గేయం రచించింది ఎవరు?
1) గద్దర్
2) బండి యాదగిరి
3) దాశరథి
4) దొడ్డి కొమురయ్య
- View Answer
- సమాధానం: 2
11. శాతవాహనుడి వంశ స్థాపకుడైన శ్రీముఖుడి నాణేలు ఎక్కడ లభించాయి?
1) పెద్ద బంకూరు
2) కొండాపురం
3) ధూళికట్ట
4) కోటి లింగాల
- View Answer
- సమాధానం: 4
12. కుతుబ్షాహీల కాలంలో గోల్కొండ రాజ్యంలో ప్రసిద్ధి చెందిన పరిశ్రమ?
1) వస్త్ర
2) పింగాణీ
3) గాజు
4) వజ్ర
- View Answer
- సమాధానం: 4
13. ‘కలంకారీ’ అంటే?
1) చిత్రకళ
2) నాట్యకళ
3) శిల్పకళ
4) లలితకళ
- View Answer
- సమాధానం: 1
14. ‘సుగ్రీవ విజయం’ అనే తొలి యక్షగానాన్ని రచించింది?
1) పొన్నగంటి తెలగనార్యుడు
2) కందుకూరి రుద్రకవి
3) సారంగు తమ్మయ్య మంత్రి
4) పిల్లలమర్రి పిన వీరభద్రుడు
- View Answer
- సమాధానం: 2
15. ‘బిద్రి’ పాత్రల తయారీలో రాగి, తుత్తు నాగాలను ఏ నిష్పత్తిలో ఉపయోగించారు?
1) 1:16
2) 4:15
3) 5:8
4) 2:3
- View Answer
- సమాధానం: 1
16. ఆర్యసమాజ్ శాఖను హైదరాబాద్లో ఎప్పుడు స్థాపించారు?
1) 1892
2) 1893
3) 1884
4) 1895
- View Answer
- సమాధానం: 1
17. హైదరాబాద్ నగర వాస్తు శిల్పి ఎవరు?
1) షోయబుల్లా ఖాన్
2) మీర్ మొమిన్ అస్త్రాబాదీ
3) సుల్తాన్ కులీ
4) మీర్ ఖాసీం అలీ
- View Answer
- సమాధానం: 3
18. మూసీనదిపై వంతెనను ఇబ్రహీం కుతుబ్షా ఎప్పుడు నిర్మించాడు?
1) 1558
2) 1578
3) 1568
4) 1548
- View Answer
- సమాధానం: 3
19. 1944లో భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆంధ్ర మహాసభ రెండుగా చీలిపోయింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినవారు?
1) మాడపాటి హనుమంతరావు
2) బద్దం ఎల్లారెడ్డి
3) రావి నారాయణరెడ్డి
4) కె.వి.రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 3
20. అచ్చ తెలుగు గ్రంథం ‘యయాతి చరిత్ర’ను రచించింది?
1) తెలగనార్యుడు
2) కందుకూరి రుద్రకవి
3) గంగాధరుడు
4) సారంగు తమ్మయ్య
- View Answer
- సమాధానం: 1
21. గోల్కొండ రాజ్యంలో తొలి మసీదు ఏది?
1) మక్కా మసీదు
2) టోలి మసీదు
3) తారామతి మసీదు
4) జామా మసీదు
- View Answer
- సమాధానం: 3
22. ‘బిద్రి’ కళకు ప్రసిద్ధి చెందిన కేంద్రాలు ఏవి?
ఎ) బీదర్
బి) హైదరాబాద్
సి) గుల్బర్గా
1) ఎ మాత్రమే
2) ఎ, సి మాత్రమే
3) ఎ, బి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 3
23. నల్లటి రూపం, అమ్మెనియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్ల మిశ్రమంతో కూడిన కళ ఏది?
ఎ) కలంకారీ
బి) బిద్రి
సి) ఫిలిగ్రి
1) ఎ మాత్రమే
2) ఎ, బి మాత్రమే
3) బి మాత్రమే
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 3
24. ‘దక్కన్’ చిత్రకళ పితామహుడు?
1) మీర్ సయ్యద్ ఆలీ
2) అబ్దుల్ సమద్
3) మీర్ మొమిన్
4) మీర్ హకీం
- View Answer
- సమాధానం: 4
25. రుద్రమదేవి ‘మరణశాసనం’ ఏది?
ఎ) చందుపట్ల శాసనం
బి) కందుకూరు శాసనం
సి) మోటుపల్లి శాసనం
1) ఎ మాత్రమే
2) ఎ, బి మాత్రమే
3) బి, సి మాత్రమే
4) ఎ, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 1
26. కింది వాటిలో సరైంది?
ఎ)ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన -1918
బి) నిజాం కళాశాల స్థాపన -1887
సి) మహబూబియా కళాశాల స్థాపన -1894
1) ఎ, బి మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి, సి మాత్రమే
4) బి, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 1
27. సాలార్జంగ్ ప్రవేశపెట్టిన నూతన నాణేలు ఏవి?
ఎ) దినార్
బి) హాలి సిక్కా
సి) రూక
1) బి మాత్రమే
2) ఎ, బి మాత్రమే
3) బి, సి మాత్రమే
4) ఎ మాత్రమే
- View Answer
- సమాధానం: 1
28. కిందివాటిలో సరైంది?
ఎ) 1883లో చందానగర్ రైల్వే సంఘటన
బి) 1849లో వహాబీ ఉద్యమం
సి) 1888లో ముల్కీ ఉద్యమం
1) ఎ మాత్రమే
2) ఎ, సి మాత్రమే
3) బి, సి మాత్రమే
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
29. నిజాం కాలంనాటి ‘రెవెన్యూ విధానం’ ఏది?
ఎ) మహాకామా - ఇ- నసిరి
బి) జిలాబంది
సి) గల్లాబక్ష్
1) ఎ మాత్రమే
2) బి, సి మాత్రమే
3) బి మాత్రమే
4) ఎ, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
30. ‘సుల్తానిల్ అహాదే-వజ్జమాన్ హమియు మిల్లతిరసూలిర్ రహమాన్’ అని తమ నాణేలపై ముద్రించిన రాజ్యవంశం ఏది?
ఎ) బీజాపూర్ - ఆదిల్షాహీలు
బి) బీదర్ - బరీద్షాహీలు
సి) గోల్కొండ - కుతుబ్షాహీలు
1) ఎ మాత్రమే
2) సి మాత్రమే
3) బి, సి మాత్రమే
4) ఎ, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 1
31. తెలుగు అక్షరాలతో నాణేలు ముద్రించిన విజయనగర రాజ్యవంశం?
1) సంగమ
2) సాళువ
3) తుళు
4) అరవీటి
- View Answer
- సమాధానం: 4
32. జాజ్నగర్ అంటే ఏ ప్రాంతం?
1) తెలంగాణ
2) పాండ్య - మధురై
3) ఒడిశా - కళింగ
4) హోయసల - ద్వారసముద్రం
- View Answer
- సమాధానం: 3
33. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని తిరుగుబాట్ల గురించి ప్రస్తావించిన శాసనం ఏది?
1) బయ్యారం
2) కలువచేరు శాసనం
3) ధర్మసాగరం
4) హన్మకొండ శాసనం
- View Answer
- సమాధానం: 2
34. ‘దక్షిణ భారతదేశపు నాణేలు’ గ్రంథం రచయిత ఎవరు?
1) ఇలియట్
2) అబ్దుల్ వాలీ
3) శేర్వాణి
4) రాంప్సన్
- View Answer
- సమాధానం: 1
35. ‘జురిబా హైదరాబాద్’ పేరిట నాణేలు ముద్రించింది?
1) మహమ్మద్ కుతుబ్షా
2) మహమ్మద్ కులీ కుతుబ్షా
3) అబుల్ హసన్ తానీషా
4) అబ్దుల్లా కుతుబ్షా
- View Answer
- సమాధానం: 4
36. తొలి ఆంధ్ర మహాసభ 1930లో మెదక్ జిల్లాలోని జోగిపేటలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు?
1) మాడపాటి హనుమంతరావు
2) బూర్గుల రామకృష్ణారావు
3) సురవరం ప్రతాపరెడ్డి
4) కొండా వెంకట రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 3
37. కాకతీయుల కాలంనాటి సాంఘిక పరిస్థితులు, ప్రతాపరుద్రుడి కాలంలోని నర్తకి మాచల్దేవి గురించి వివరాలు అందించే గ్రంథం ఏది?
1) ప్రతాపరుద్ర యశోభూషణం
2) ప్రేమాభిరామం
3) ప్రియాభిరామం
4) క్రీడాభిరామం
- View Answer
- సమాధానం: 4
38. హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందింది ఎవరు?
1) భాగ్యరెడ్డి వర్మ
2) బి.ఎస్. వెంకట్రావ్
3) జూలా రంగారావు
4) శ్యాంసుందర్
- View Answer
- సమాధానం: 2
39. ‘హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటం - నా అనుభవాలు, జ్ఞాపకాలు’ ఎవరి ఆత్మకథ?
1) రావి నారాయణరెడ్డి
2) స్వామి రామానంద తీర్థ
3) బూర్గుల రామకృష్ణారావు
4) మాడపాటి హనుమంతరావు
- View Answer
- సమాధానం: 2
40. ‘గోల్కొండ’ రాజ్యంలో వర్తక వ్యాపారాలకు కేంద్రాలు?
ఎ) ఏలూరు - తివాచీలు
బి) ఓరుగల్లు - రత్న కంబళ్లు
సి) గోల్కొండ - వజ్రాలు
1) ఎ మాత్రమే
2) ఎ, బి మాత్రమే
3) ఎ, బి, సి
4) బి, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 3