ధ్రువ నక్షత్రానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
i) ప్లూటోను గ్రహంగా పరిగణించట్లేదు. ఎందుకంటే ఇది కొన్నిసార్లు నెప్ట్యూన్ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.
ii) మనకు అతి దగ్గరలో ఉండే నక్షత్రం సూర్యుడు. సౌరవ్యవస్థకు కాంతిశక్తి, ఉష్ణశక్తిని సమకూర్చే ప్రధాన శక్తి వనరు సూర్యుడు.
iii) సౌరవ్యవస్థలో అతి చిన్న గ్రహం, సూర్యుడికి అతి చేరువలో ఉండే గ్రహం బుధుడు.
iv) గ్రహాలన్నింటిలో భూమికి దగ్గరగాఉండేది శుక్రుడు. అన్నింటికంటే ప్రకాశవంతమైన గ్రహం కూడా ఇదే. ఈ గ్రహాన్ని ‘వేగుచుక్క’ లేదా ‘సాయంకాలపు చుక్క’ అంటారు.
v) బుధగ్రహం, శుక్ర గ్రహాలకు ఉపగ్రహాలు లేవు.
ఎ) i, ii
బి) i, ii, iii
సి) i, iv, v
డి) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: డి
2. కింది వాటిలో సరైన వాక్యాలేవి?
i) గ్రహాలన్నీ పడమర నుంచి తూర్పునకు ఆత్మభ్రమణం చేయగా.. శుక్ర గ్రహం, యురేనస్ గ్రహాలు తూర్పు నుంచి పడమర దిశలో ఆత్మభ్రమణం చేస్తాయి.
ii) సౌర కుటుంబంలో భూ కక్ష్యకు బయట ఉండే మొదటి గ్రహమైన కుజ గ్రహానికి రెండు సహజ చంద్రులు (ఉపగ్రహాలు) ఉన్నాయి. ఇది ఎరుపు రంగులో కనిపిస్తుంది.
iii) భూమితో పోల్చినప్పుడు బృహస్పతి పరిమాణంలో 1300 రెట్లు, ద్రవ్యరాశిలో 318 రెట్లు అధికంగా ఉంటుంది. దీనికి 50 ఉపగ్రహాలు ఉన్నాయి.
iv) శని గ్రహం పసుపు వర్ణంలో ఉంటుంది. దీని చుట్టూ వలయాలు ఉంటాయి.
ఎ) i, ii
బి) ii, iii
సి) i, iv
డి) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: డి
3. కింది వాటిలో అంతర గ్రహాలేవి?
ఎ) బుధుడు, శుక్రుడు
బి) బుధుడు, శుక్రుడు, భూమి
సి) బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు
డి) బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, శని
- View Answer
- సమాధానం: సి
4. కింది వాటిలో బాహ్య గ్రహాలు ఏవి?
ఎ) బుధుడు, శుక్రుడు, శని, యురేనస్
బి) బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్
సి) బుధుడు, శుక్రుడు, శని, నెప్ట్యూన్
డి) భూమి, అంగారకుడు, బృహస్పతి, శని
- View Answer
- సమాధానం: బి
5. జతపరచండి.
జాబితా-I జాబితా-II అ) సూర్యుడి వ్యాసం i) 15,00,00,000 కి.మీ. ఆ) భూమి వ్యాసం ii) 3,84,399 కి.మీ. ఇ) చంద్రుడి వ్యాసం iii) 13,92,000 కి.మీ. ఈ) సూర్యుడు, భూమికి మధ్య దూరం iv) 12,756 కి.మీ. ఉ) చంద్రుడు, భూమికి మధ్య దూరం v) 3,474 కి.మీ.
అ ఆ ఇ ఈ ఉ ఎ) i ii iii iv v బి) i iv ii iii v సి) iii iv v i ii డి) iii iv i v ii
- View Answer
- సమాధానం: సి
6. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
i) హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది.
ii) సూర్యుడి కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 20 సెకన్లు (500 సెకన్లు) పడుతుంది.
iii) చంద్రుడి కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం 1.3 సెకన్లు.
iv) షూమేకర్ లెవీ-9 అనే తోకచుక్క శని గ్రహాన్ని ఢీకొట్టింది.
ఎ) i, ii
బి) ii, iii
సి) i మాత్రమే
డి) iv మాత్రమే
- View Answer
- సమాధానం: డి
7. ధ్రువ నక్షత్రానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) ఏడాదికి ఒకసారే కనిపిస్తుంది
బి) నిలకడగా ఉన్నట్లు కనిపిస్తుంది
సి) సప్తర్షి మండలంలో ఉంటుంది
డి) ఎర్రగా కనిపిస్తుంది
- View Answer
- సమాధానం: బి
8. భూ ఆత్మభ్రమణ దిశ ఏవిధంగా ఉంటుంది?
ఎ) తూర్పు నుంచి పడమరకు
బి) పడమర నుంచి తూర్పునకు
సి) ఉత్తరం నుంచి దక్షిణానికి
డి) దక్షిణం నుంచి ఉత్తరానికి
- View Answer
- సమాధానం: బి
9. మానవుడు చంద్రుడిపై ఏ సంవత్సరంలో కాలుమోపాడు?
ఎ) 1968
బి) 1969
సి) 1970
డి) 1979
- View Answer
- సమాధానం: బి
10. చంద్రయాన్-1కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
i) భారతదేశం ఈ కార్యక్రమాన్ని 2008 అక్టోబర్ 22న ప్రారంభించింది.
ii) చంద్రుడిపై పదార్థ మూలకాలు, He-3 గురించి తెలుసుకోవడం దీని ప్రధాన ఉద్దేశం.
iii) చంద్రుడిపై నీటిజాడను వెతకడం, చంద్రుడి త్రిమితీయ అట్లాస్ తయారుచేయడానికి దీన్ని ప్రారంభించారు.
iv) సౌరవ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించిన ఆధారాలను వెతకడానికి ఇది తోడ్పడుతుంది.
ఎ) i, ii
బి) ii, iii
సి) i, ii, iii
డి) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: డి
11. జతపరచండి.
గ్రహం సూర్యుడి చుట్టూ పరిభ్రమణ కాలం అ) భూమి i) 29.5 ఏళ్లు ఆ) శుక్రుడు ii) 12 ఏళ్లు ఇ) కుజుడు iii) 365 రోజులు ఈ) బృహస్పతి iv) 687 రోజులు ఉ) శని v) 225 రోజులు
అ ఆ ఇ ఈ ఉ ఎ) iii v iv i ii బి) iii v iv ii i సి) iii v ii i iv డి) iii v ii iv i
- View Answer
- సమాధానం: బి
12. జతపరచండి.
జాబితా-I జాబితా-II అ) బ్లూ ప్లానెట్ i) శుక్రుడు ఆ) మార్నింగ్ స్టార్ ii) భూమి ఇ) రెడ్ స్టార్ iii) అంగారకుడు ఈ) ఆరెంజ్ ప్లానెట్ iv) యురేనస్ ఉ) గ్రీన్ ప్లానెట్ v) శని
అ ఆ ఇ ఈ ఉ ఎ) ii i iii v iv బి) ii i iii iv v సి) iv v i ii iii డి) iii i ii v iv
- View Answer
- సమాధానం: ఎ
13. సూర్యుడి చుట్టూ తోకచుక్కలు ఏ కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటాయి?
ఎ) వృత్తాకార కక్ష్య
బి) దీర్ఘవృత్తాకార కక్ష్య
సి) అతి దీర్ఘ వృత్తాకార కక్ష్య
డి) నిర్దిష్టమైన కక్ష్య అంటూ ఏదీ ఉండదు
- View Answer
- సమాధానం: సి
14. ‘విశ్వానికి కేంద్రంలో సూర్యుడు ఉంటాడు, ఇతర అంతరిక్ష వస్తువులన్నీ సూర్యుడి చుట్టూ పడమర నుంచి తూర్పునకు తిరుగుతాయి’ అని తెలిపింది ఎవరు?
ఎ) న్యూటన్
బి) టాలెమి
సి) కోపర్నికస్
డి) హైగన్
- View Answer
- సమాధానం: సి
15. టెలికమ్యూనికేషన్ రిలే కోసం ఉపయోగించే ఉపగ్రహాలను భూకక్ష్యలో ఉంచుతారు. ఒక ఉపగ్రహం అలాంటి కక్ష్యలో ఉందని కింద పేర్కొన్న ఏ సందర్భంలో చెప్పవచ్చు?
i) ఉపగ్రహం కక్ష్య జియోసింక్రనస్లో ఉన్నప్పుడు
ii) ఉపగ్రహం కక్ష్య వలయాకారంలో ఉన్నప్పుడు
iii) ఉపగ్రహం కక్ష్య భూమధ్యరేఖ తలంలో ఉన్నప్పుడు
iv) ఉపగ్రహం కక్ష్య 22,236 కి.మీ. ఎత్తులో ఉన్నప్పుడు
ఎ) i, ii, iii
బి) i, ii, iv
సి) ii, iii, iv
డి) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: ఎ
16. అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడటానికి కారణం ఏమిటి?
ఎ) ఆ ప్రాంతంలో ట్రోపో ఆవరణ కల్లోలం ఉండటం, క్లోరో ఫ్లోరో కార్బన్ల అంతరప్రవాహం
బి) ప్రధానంగా ధ్రువాగ్రం కావడం, స్ట్రాటో ఆవరణంలో మేఘాలుండటం, క్లోరోఫ్లోరో కార్బన్ల అంతర ప్రవాహం
సి) ధ్రువాగ్రం కావడం, స్ట్రాటో ఆవరణంలో మేఘాలు లేకపోవడం, మీథేన్, క్లోరో ఫ్లోరో కార్బన్ల అంతర ప్రవాహం
డి) గ్లోబల్ వార్మింగ్ కారణంగా ధ్రువ ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరగడం
- View Answer
- సమాధానం: బి
17. భూ వాతావరణంలో ‘ఐనో ఆవరణం’ రేడియో కమ్యూనికేషన్లకు అనువుగా ఉండటానికి కారణమేమిటి?
i) ఓజోన్ ఉనికి వల్ల రేడియో తరంగాలు భూమిపై పరావర్తనం చెందడం
ii) రేడియో తరంగాలకు సుదీర్ఘమైన తరంగదైర్ఘ్యం ఉండటం
ఎ) i మాత్రమే
బి) ii మాత్రమే
సి) i, ii
డి) రెండూ కాదు
- View Answer
- సమాధానం: బి
18. తీవ్రమైన చలికాలంలో సరస్సు ఉపరితలం గడ్డకట్టుకుపోయినా.. దాని అడుగు భాగంలోని నీరు ద్రవ రూపంలోనే ఉంటుంది. దీనికి కారణం ఏమిటి?
ఎ) మంచు అథమ ఉష్ణవాహకం
బి) సరస్సు ఉపరితలం గాలిలా అదే ఉష్ణోగ్రతలో ఉండటం వల్ల ఉష్ణాన్ని కోల్పోదు
సి) నీటి సాంద్రత 4°C వద్ద గరిష్టంగా ఉండటం
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి
19. బ్లూటూత్, వై-ఫై (Wi-fi)ల మధ్య ప్రధాన తేడాకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) బ్లూటూత్‌కు 2 - 4 GHz రేడియో పౌనపున్యం అవసరం. వై-ఫై 2.4 GHz నుంచి 5 GHz వరకు ఉపయోగిస్తుంది
బి) బ్లూటూత్‌ను వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క (W-LAN)కు మాత్రమే ఉపయోగిస్తారు. వై-ఫైను వైర్లెస్ వైడ్ ఏరియా నెట్వర్క్ కు మాత్రమే వినియోగిస్తారు
సి) బ్లూటూత్ సాంకేతిక విధానాన్ని ఉపయోగిస్తూ రెండు సాధనాల మధ్య సమాచారాన్ని ప్రసారం చేసినప్పుడు.. సాధనాలు పరస్పరం కనిపించే కక్ష్యలో ఉండాలి. వై-ఫై సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు సాధనాలు పరస్పరం కనిపించే రేఖలో ఉండాల్సిన పనిలేదు.
డి) ఎ, బిలు మాత్రమే సరైనవి
- View Answer
- సమాధానం: సి
20. కింది వాటిలో సి.ఎఫ్.ఎల్. (CFL), ఎల్.ఇ.డి. ల్యాంప్ మధ్య తేడాను వివరించే వాక్యాలను గుర్తించండి.
i) కాంతిని ఉత్పత్తి చేయడానికి CFL పాదరస బాష్పాన్ని ఉపయోగించుకుంటుంది. LED ల్యాంప్ అర్ధవాహక సామగ్రిని వినియోగించుకుంటుంది.
ii) LED ల్యాంప్ సగటు జీవన వ్యవధి కంటే CFL ల్యాంప్ సగటు జీవన వ్యవధి చాలా ఎక్కువ.
iii) LED ల్యాంప్‌తో పోల్చితే CFL ల్యాంప్కు శక్తి సామర్థ్యం తక్కువ.
ఎ) i మాత్రమే
బి) ii, iii
సి) i, iii
డి) i, ii, iii
- View Answer
- సమాధానం: డి
21. భూమి చుట్టూ పరిభ్రమించే కృత్రిమ ఉపగ్రహం కిందకు పడిపోదు. దీనికి కారణం భూమ్యాకర్షణ అనేది..
ఎ) చాలా దూరంలో ఉండకపోవడం
బి) చంద్రుడి ఆకర్షణ వల్ల తటస్థం కావడం
సి) దాని స్థిర గమనానికి అవసరమైన వేగాన్ని సమకూర్చడం
డి) దాని గమనానికి అవసరమైన త్వరణాన్ని సమకూర్చడం
- View Answer
- సమాధానం: సి
22. గ్రహ శకలాలు, తోకచుక్కలకు తేడా ఏమిటి?
i) గ్రహ శకలాలు చిన్న చిన్న శిలామయంగా ఉంటాయి. తోకచుక్కలు శిలామయ లోహ పదార్థాలు కలిసిపోయి గడ్డకట్టిన వాయువులతో ఏర్పడ్డాయి.
ii) గ్రహ శకలాలు ప్రధానంగా గురు, అంగారక గ్రహాల కక్ష్యల్లో ఉంటాయి. తోకచుక్కలు శుక్ర, బుధ గ్రహాల కక్ష్యల్లో కనిపిస్తాయి.
iii) తోకచుక్కలకు స్పష్టమైన, ప్రకాశమైన తోక ఉంటుంది. గ్రహ శకలాలకు ఇది ఉండదు.
పై వాక్యాల్లో సరైంది ఏది?
ఎ) i, ii
బి) i, iii
సి) iii
డి) i, ii, iii
- View Answer
- సమాధానం: బి
23. దిగువ స్ట్రాటో ఆవరణంలో జెట్ విమానాలు చాలా పొడవుగా, సజావుగా ఎగురుతాయి. కింది వాటిలో దీనికి సముచితమైన వివరణ ఏది?
i) దిగువ స్ట్రాటో ఆవరణంలో మేఘాలు, నీటి ఆవిరి ఉండకపోవడం
ii) దిగువ స్ట్రాటో ఆవరణంలో ఊర్థ్వపవనాలు లేకపోవడం
ఎ) i మాత్రమే
బి) ii మాత్రమే
సి) i, ii
డి) రెండూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
24. మోటార్ కారులో పనిచేసే శీతలీకరణ వ్యవస్థ (రేడియేటర్)కు వర్తించే సూత్రం ఏది?
ఎ) ఉష్ణవహనం
బి) ఉష్ణసంవహనం
సి) ఉష్ణ వికిరణం
డి) ఎ, సి
- View Answer
- సమాధానం: ఎ
25. ఎర్ర నేలలకు ఆ రంగు రావడానికి ప్రధాన కారణం ఏమిటి?
ఎ) మెగ్నీషియం పుష్కలంగా ఉండటం
బి) సంచితమైన హ్యూమస్ పదార్థం
సి) ఫెర్రిక్ ఆక్సైడ్లు ఉండటం
డి) ఫాస్ఫేట్లు పుష్కలంగా ఉండటం
- View Answer
- సమాధానం: సి
26.ప్రస్తుతం, సమీప భవిష్యత్‌లో గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో భారత్‌కు ఉన్న పరిమితులకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
i) ప్రత్యామ్నాయ సాంకేతిక విజ్ఞానం తగినంతగా అందుబాటులో లేదు
ii) భారత్ ఈ అంశంలో పరిశోధన, అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించలేదు
iii) అభివృద్ధి చెందిన అనేక దేశాలు ఇప్పటికే భారత్‌లో కాలుష్యం కలిగించే పరిశ్రమలను ఏర్పాటు చేశాయి
ఎ) i, ii
బి) ii మాత్రమే
సి) i, iii
డి) i, ii, iii
- View Answer
- సమాధానం: ఎ
27. కింది వాక్యాలను పరిశీలించండి.
i) అన్ని రంగులు ఆహ్లాదకరమైనవి
ii) కొన్ని రంగులు ఆహ్లాదకరమైనవి
iii) ఏ రంగూ ఆహ్లాదకరమైంది కాదు
iv) కొన్ని రంగులు ఆహ్లాదకరమైనవి కావు
పైన పేర్కొన్న వాటిలో ivవ స్టేట్మెంట్ వాస్తవం అనుకుంటే.. కచ్చితంగా కింది వాటిలో ఏ నిర్ణయానికి రావచ్చు?
ఎ) i, ii సరైనవి
బి) i తప్పు
సి) ii తప్పు
డి) iii తప్పు
- View Answer
- సమాధానం: బి
28. రాత్రివేళల్లో చూడటానికి ఉపయోగించే పరికరాల్లో ఏ కిరణాలను ఉపయోగిస్తారు?
ఎ) రేడియో తరంగాలు
బి) మైక్రో తరంగాలు
సి) పరారుణ తరంగాలు
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
29. భూ గ్రహంలోని మాంటిల్ కింది భాగంలోని కోర్ ప్రధానంగా దేనితో ఏర్పడింది?
ఎ) అల్యూమినియం
బి) క్రోమియం
సి) ఇనుము
డి) సిలికాన్
- View Answer
- సమాధానం: సి
30. సూర్యుడి ద్రవ్యరాశిలో 1.44 రెట్లు తక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలు అవి నశించే క్రమంలో వైట్ డ్వార్ఫ్ గా మారి అంతరిస్తాయని ఏ శాస్త్రవేత్త నిరూపించారు?
ఎ) ఎడ్విన్ హబుల్
బి) ఎస్. చంద్రశేఖర్
సి) స్టీఫెన్ హాకింగ్
డి) స్టీవెన్ ఐస్‌బర్గ్
- View Answer
- సమాధానం: బి