మౌర్య యుగం
1. భారతదేశంలో అత్యధిక ప్రాంతాన్ని ఒకే పాలన కిందికి తీసుకొచ్చిన మొదటి పాలకులు ఎవరు?
ఎ) మౌర్యులు
బి) నంద
సి) హర్యాంక
డి) గుప్త
- View Answer
- సమాధానం: ఎ
2. మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడిని ‘వ్రిహల, కులహీన’గా పేర్కొన్న గ్రంథం ఏది?
ఎ) పరిశిష్ట పర్వన్
బి) బృహత్కథా మంజరి
సి) ముద్రా రాక్షసం
డి) కథాసరిత్సాగర
- View Answer
- సమాధానం: సి
3. కౌటిల్యుడు 1000 కార్షాపణాలకు చంద్రగుప్త మౌర్యుడిని కొని, తక్షశిలలో విద్యాభ్యాసం చేయించినట్లు తెలుపుతున్న సాహిత్యం ఏది?
ఎ) జైన సాహిత్యం
బి) బౌద్ధ సాహిత్యం
సి) వైదిక సాహిత్యం
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: బి
4. కిందివాటిలో సరైంది ఏది?
ఎ) చంద్రగుప్తుడు చివరి నందరాజు ధననందుడిని ఓడించి, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు
బి) చంద్రగుప్తుడికి పర్వతకుడు అనే రాజు సహాయం చేసినట్లు పరిశిష్ట పర్వన్ అనే జైనగ్రంథం తెలుపుతోంది
సి) వాయవ్య భారత ఆధిపత్యం కోసం చంద్రగుప్తుడికి, మాసిడోనియా రాజు సెల్యుకస్ నికేటర్కు యుద్ధం జరిగింది
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
5. చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి సెల్యుకస్ నికేటర్ రాయబారిగా పంపిన మెగస్తనీస్ రచించిన గ్రంథం?
ఎ) ఇండికా
బి) నేచురల్ హిస్టరీ
సి) పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ
డి) ది అనబేసిస్ ఆఫ్ అలెగ్జాండర్
- View Answer
- సమాధానం: ఎ
6. పశ్చిమ ప్రాంతంలో సౌరాష్ర్ట వరకు చంద్రగుప్త మౌర్యుడి రాజ్యం విస్తరించినట్లు తెలుపుతున్న శాసనం ఏది?
ఎ) హాతిగుంఫా
బి) జునాగఢ్
సి) అలహాబాద్
డి) విలస
- View Answer
- సమాధానం: బి
7. జునాగఢ్ శాసనం ప్రకారం ఏ సౌరాష్ర్ట గవర్నర్ ‘సుదర్శన తటాకం’ను నిర్మించారు?
ఎ) పుష్య గుప్తుడు
బి) బుధ గుప్తుడు
సి) తిష్య
డి) ఇంద్ర కరణుడు
- View Answer
- సమాధానం: ఎ
8. చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని ఏ ప్రాంతంలో ఆచరించాడు?
ఎ) సువర్ణగిరి
బి) శ్రావణ బెళగొళ
సి) పాటలీపుత్రం
డి) వైశాలి
- View Answer
- సమాధానం: బి
9. గ్రీకులు బిందుసారుడిని ‘అమిత్ర ఖేట్స్’ అని పేర్కొన్నారు. అంటే?
ఎ) అమిత ప్రేమ ఉన్నవాడు
బి) ఎన్నో విజయాలు సాధించినవాడు
సి) శత్రువులను భయంకరంగా నాశనం చేసినవాడు
డి) శత్రువులను క్షమించినవాడు
- View Answer
- సమాధానం: సి
10. తక్షశిలలో తిరుగుబాటును అణచివేయడానికి అశోకుడిని బిందుసారుడు పంపినట్లు తెలుపుతున్న ఆధారాలు ఏవి?
ఎ) దివ్య వదన గ్రంథం
బి) షిర్కాఫ్ శాసనం
సి) ఎ, బి
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
11. ప్రఖ్యాత అజీవక పండితుడు పింగళి వత్స ఏ మౌర్యపాలకుడి ఆస్థానంలో ఉండేవాడు?
ఎ) బిందుసారుడు
బి) అశోకుడు
సి) కునాల
డి) సంప్రతి
- View Answer
- సమాధానం: ఎ
12. బిందుసారుడి వారసుల మధ్య వారసత్వ యుద్ధం జరిగిన కాలం?
ఎ) క్రీ.పూ. 270 - 260
బి) క్రీ.పూ. 273 - 269
సి) క్రీ.పూ. 267 - 265
డి) క్రీ.పూ. 265 - 260
- View Answer
- సమాధానం: బి
13. అశోకుడి శాసనాలను జేమ్స్ ప్రిన్సెస్ చదివిన సంవత్సరం ఏది?
ఎ) 1837
బి) 1860
సి) 1875
డి) 1825
- View Answer
- సమాధానం: ఎ
14. ‘అశోక’ పేరుతో కనుగొన్న మొదటి శాసనం ఏది?
ఎ) జౌళి శాసనం
బి) దౌగడ
సి) మస్కి
డి) ఉడెగొళం
- View Answer
- సమాధానం: సి
15. మౌర్యుల కాలంలో గూఢచారులుగా ఎవరిని నియమించేవారు?
ఎ) వేశ్యలు
బి) వితంతువులు
సి) అనాథ బాలలు
డి) పైవారందరినీ
- View Answer
- సమాధానం: డి
16. పురాణాలు అశోకుడిని ఏమని పేర్కొన్నాయి?
ఎ) ప్రియదర్శి
బి) దేవానాంప్రియ
సి) అశోకవర్ధన
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
17. అశోకుడు రాజు కాక ముందు ఏ ప్రాంతానికి రాజ ప్రతినిధిగా పనిచేశాడు?
ఎ) ఉజ్జయినీ
బి) తక్షశిల
సి) గాంధార
డి) కళింగ
- View Answer
- సమాధానం: ఎ
18. అశోకుడు తన సోదరుల్లో తిస్యను తప్ప మిగిలిన 99 మందిని హతమార్చి రాజ్యాన్ని ఆక్రమించినట్లు తెలుపుతున్న గ్రంథం?
ఎ) దీప వంశ
బి) మహా వంశ
సి) ఛుళు వంశ
డి) టిబెట్ చరిత్ర
- View Answer
- సమాధానం: బి
19. శాసనాల్లో (అలహాబాద్ స్తంభ శాసనం) అశోకుడి భార్యగా ఎవరిని పేర్కొన్నారు?
ఎ) కారువాకి
బి) అసంధి మిత్ర
సి) తిస్యరక్షిత
డి) విదిశ మహాదేవి
- View Answer
- సమాధానం: ఎ
20. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) అశోకుని జీవితం మలుపుతిప్పిన సంఘటన కళింగయుద్ధం (క్రీ.పూ. 262 - 261)
బి) అశోకుడు రాజ్యానికి వచ్చిన 8 ఏళ్ల తర్వాత కళింగయుద్ధం చేసినట్లు 13వ శిలా శాసనం తెలుపుతోంది
సి) కళింగయుద్ధ పరిణామాలకు చలించి అశోకుడు బౌద్ధ మతం స్వీకరించినట్లు బబ్రూ శాసనం తెలుపుతోంది
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
21. అశోకుడికి బౌద్ధమత దీక్ష ఇచ్చిన గురువు?
ఎ) ఉప గుప్తుడు
బి) సింహళ గ్రంథాల ప్రకారం నిగ్రధ
సి) ఎ, బి
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
22. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో అశోకుడి పెద్ద శిలాశాసనం లభించింది?
ఎ) ఎర్రగుడి
బి) రేణిగుంట
సి) బేతంచర్ల
డి) మందపల్లి
- View Answer
- సమాధానం:ఎ
23. అశోకుడు ప్రజల్ని తన కన్నబిడ్డలుగా భావించినట్లు తెలుపుతున్న శాసనం?
ఎ) ధౌళి
బి) జౌగడ
సి) ఎ, బి
డి) పైవేవీకావు
- View Answer
- సమాధానం: సి
24.ద్వి భాషల్లో ఉన్న అశోకుడి శాసనం ఏది?
ఎ) కాందహార్
బి) బైరట్
సి) కల్సి
డి) అలహాబాద్
- View Answer
- సమాధానం: ఎ
25. అశోకుడు బుద్ధుడి జన్మస్థలం సందర్శించి ఆ గ్రామ ప్రజలకు పన్ను మినహాయింపు ఇచ్చినట్లు తెలుపుతున్న శాసనం ఏది?
ఎ) రాంపూర్వ
బి) రుమ్మిందై
సి) కౌశాంబి
డి) మన్షేరా
- View Answer
- సమాధానం: బి
26. అశోకుడి శాసనాలను తరలించిన వ్యక్తులకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c గ్రూప్ - ఎ గ్రూప్ - బి 1. అలహాబాద్ శాసనం a. అక్బర్ 2. తోప్రా, మీరట్ శాసనాలు b. ఫిరోజ్ షా తుగ్లక్ 3. బైరట్ శాసనం c. కన్నింగ్ హామ్
బి) 1-c, 2-b, 3-a
సి) 1-b, 2-a, 3-c
డి) 1-a, 2-c, 3-b
- View Answer
- సమాధానం: ఎ
27. అశోకుడి శాసనాలు ఎక్కువగా బ్రాహ్మీలిపిలో ఉన్నాయి. అయితే ఖరోస్టి లిపిలో ఉన్న శాసనం ఏది?
ఎ) మన్షేరా
బి) షాబాజ్ గిరి
సి) ఎ, బి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
28. అశోకుడు 250 రాత్రులు బౌద్ధ సంఘంలో గడిపినట్లు తెలుపుతున్న శాసనం?
ఎ) ఎర్రగుడి
బి) మస్కి
సి) ఎ, బి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
29. జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e గ్రూప్ - ఎ గ్రూప్ - బి 1. యజ్ఞాలు, జంతుబలుల నిషేధం a. మొదటి శిలాశాసనం 2. ధర్మ మహామాత్యల నియామకం b. అయిదో శిలాశాసనం 3. బోధివృక్షం సందర్శన c. ఎనిమిదో శిలా శాసనం 4. పరమత సహనం d. 7, 12వ శిలాశాసనాలు 5. కళింగయుద్ధం, సమకాలీన రాజులు e. 13వ శిలాశాసనం
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-c, 2-e, 3-b, 4-d, 5-a
డి) 1-b, 2-e, 3-a, 4-d, 5-c
- View Answer
- సమాధానం: ఎ
30. కింది వాటిలో అశోకుడు నిర్వహించిన బౌద్ధ సంగీతి ఏది?
ఎ) మొదటి సంగీతి
బి) రెండో సంగీతి
సి) మూడో సంగీతి
డి) నాలుగో సంగీతి
- View Answer
- సమాధానం: సి
31. అశోకుడు వివిధ ప్రాంతాలకు పంపిన ప్రచారకులు, ప్రాంతాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
ఎ) 1-e, 2-d, 3-c, 4-b, 5-a గ్రూప్ - ఎ గ్రూప్ - బి 1. శ్రీలంక a. మహేంద్ర, సంఘమిత్ర 2. హిమాలయప్రాంతం b. మజ్జిహిమ 3. సువర్ణభూమి (బర్మా) c. సోనా, ఉత్తర 4. కశ్మీర్, గాంధార d. మజ్ హంతిక 5. మహిష మండలం e. మహాదేవుడు
బి) 1-a, 2-b, 3-c, 4-d, 5-e
సి) 1-c, 2-e, 3-b, 4-d, 5-a
డి) 1-b, 2-e, 3-a, 4-d, 5-c
- View Answer
- సమాధానం: బి
32. అశోకుడి తర్వాతి పాలకులు ఎవరు?
ఎ) తూర్పు ప్రాంతం - దశరథుడు
బి) పశ్చిమ ప్రాంతం- కునాల
సి) ఎ, బి
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
33. కింది వారిలో కశ్మీరీ చరిత్రలో ప్రముఖ స్థానం కలిగిన అశోకుడి కుమారుడు ఎవరు?
ఎ) కునాల
బి) సంప్రతి
సి) మహేంద్ర
డి) జలుక
- View Answer
- సమాధానం: డి
34. మౌర్య వంశ చివరి పాలకుడు ఎవరు?
ఎ) బృహద్రధుడు
బి) దశరథుడు
సి) సంప్రతి
డి) కునాల
- View Answer
- సమాధానం: ఎ
35. మౌర్యుల పాలనను అంతం చేసి శుంగ వంశాన్ని స్థాపించింది ఎవరు?
ఎ) అగ్నిమిత్ర శుంగ
బి) పుష్యమిత్ర శుంగ
సి) దేవభూతి
డి) వసుమిత్ర
- View Answer
- సమాధానం: బి
36. మౌర్యవంశ పతనం గురించి తెలుపుతున్న లిఖిత ఆధారాలు ఏవి?
ఎ) హర్ష చరిత్ర
బి) విష్ణు పురాణం
సి) ఎ, బి
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం:సి
37. మౌర్యుల పాలన ఎన్నేళ్లు కొనసాగింది?
ఎ) 150
బి) 137
సి) 100
డి) 400
- View Answer
- సమాధానం: బి
38. మౌర్యుల పాలనను తెలుపుతున్న ముఖ్య ఆధారం?
ఎ) కౌటిల్యుడు - అర్థశాస్త్రం
బి) మెగస్తనీస్ - ఇండికా
సి) ఎ, బి
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం:సి
39. కింది వాటిలో కౌటిల్యుడు పేర్కొన్న సప్తాంగాలకు చెందినవి?
ఎ) రాజు, రాజ్యం
బి) మంత్రి, దుర్గం
సి) దండం, మిత్రరాజ్యం, కోశం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
40. కింది వాటిలో అశోకుడి ఏ శాసనం మంత్రి పరిషత్ గురించి వివరిస్తోంది?
ఎ) మూడో శిలాశాసనం
బి) ఆరో శిలాశాసనం
సి) ఎ, బి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
41.మౌర్యుల కాలంలో ముఖ్య విభాగాలు, అధిపతులకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e గ్రూప్ - ఎ గ్రూప్ - బి 1. సీతాధ్యక్షుడు a. రాజు భూముల నిర్వహణ 2. అకరాధ్యక్షుడు b. గనులు 3. లక్షణాధ్యక్షుడు c. టంకశాల 4. పోతువాధ్యక్షుడు d. తూనికలు, కొలతలు 5. గణికాధ్యక్షుడు e. వేశ్యలు
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-b, 2-e, 3-d, 4-c, 5-a
డి) 1-c, 2-a, 3-d, 4-e, 5-b
- View Answer
- సమాధానం: ఎ
42. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) సమాహర్త - పన్నులు వసూలు చేసే అధికారి
బి) సన్నిదాత - ప్రభుత్వ ఆదాయాన్ని భద్రపరచే అధికారి
సి) తీర్థులు - మంత్రి పరిషత్ ఉపాధ్యక్షుడు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
43. మౌర్యుల కాలంలో ఇతీజ్ఞ మహామాత్రులు ఏ శాఖను పర్యవేక్షించేవారు?
ఎ) రహదారుల పర్యవేక్షణ
బి) స్త్రీల సంక్షేమం
సి) వృద్ధుల సంక్షేమం
డి) దమ్మ ప్రచారం
- View Answer
- సమాధానం: బి
44. మౌర్యుల నగరపాలనను విపులంగా వివరించి గ్రంథం?
ఎ) ఇండికా
బి) అర్థశాస్త్రం
సి) కథావత్తు
డి) విష్ణుపురాణం
- View Answer
- సమాధానం: ఎ
45. మౌర్యుల సామ్రాజ్యంలో ప్రధాన భాగాలు, రాజధానులను జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e గ్రూప్ - ఎ గ్రూప్ - బి 1. మౌర్య సామ్రాజ్యం a. పాటలీపుత్రం 2. ఉత్తరాపథం b. తక్షశిల 3. పశ్చిమ పథం (అవంతి) c. ఉజ్జయినీ 4. ప్రాచ్య పథం (కళింగ) d. తొసలి 5. దక్షిణా పథం e. సువర్ణగిరి
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-c, 2-e, 3-b, 4-a, 5-d
డి) 1-b, 2-e, 3-d, 4-c, 5-a
- View Answer
- సమాధానం: ఎ
46. పాటలీపుత్రం ఏ నదుల సంగమ ప్రాంతంలో ఉంది?
ఎ) సోన్, గండక్
బి) గంగా, సోన్
సి) ఘాగ్రా, గండక్
డి) గంగా, ఘాగ్రా
- View Answer
- సమాధానం: బి
47. మౌర్యుల పాలనా విభాగాలు, అధికారులకు సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) జనపథం- యువరాజు
బి) ఆహారం - ప్రాదేశకుడు, రజ్జుక
సి) విషయం- స్థానిక, గోప
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
-
48. కింది వాటిలో మౌర్యుల కాలంలో ముఖ్య రేవు పట్టణం ఏది?
ఎ) తామ్రలిప్తి
బి) బ్రోచ్
సి) సోపార
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
49. మౌర్యుల కాలంలో పంటలో ఎంతభాగాన్ని భూమిశిస్తుగా వసూలు చేసేవారు?
ఎ) 1/2
బి) 1/4
సి) 1/3
డి) 2/5
- View Answer
- సమాధానం: బి
50. మౌర్యుల కాలంలో శ్రేణులు సేకరించిన నిధులపై ఎంతశాతం వడ్డీ చెల్లించేవి?
ఎ) 15
బి) 12
సి) 20
డి) 10
- View Answer
- సమాధానం: ఎ
51. మౌర్యుల రాజప్రసాదం బయటపడిన ప్రాంతం ఏది?
ఎ) తాసలి
బి) కుమృహర్
సి) సారనాథ్
డి) సువర్ణగిరి
- View Answer
- సమాధానం: బి
52.అశోకుడు 8400 స్తూపాలను నిర్మించినట్లు తెలుపుతున్న గ్రంథం ఏది?
ఎ) దివ్యవదన
బి) దీపవంశ
సి) అశోకవదన
డి) ఛుళువంశ
- View Answer
- సమాధానం: ఎ
53. జాతీయపతాకంలోని ధర్మచక్రం, నాలుగు సింహాల తలలను అశోకుడు నిర్మించిన ఏ స్తూపం నుంచి స్వీకరించారు?
ఎ) రాంపూర్వ
బి) సారనాథ్
సి) రుమ్మిందై
డి) లౌరియా నందన్ ఘర్
- View Answer
- సమాధానం: బి
54. చంద్రగుప్త మౌర్యుడు సామాన్య కుటుంబీకుడని తెలిపిన గ్రీకు రచయిత ఎవరు?
ఎ) జస్టిన్
బి) ఎరియన్
సి) మెగస్తనీస్
డి) స్ట్రాబో
- View Answer
- సమాధానం: ఎ
55.అశోకుడు నిర్మించిన ఏకశిలా స్తంభాలు, వాటి ఫలకాలపై ఉన్న జంతువుల చిత్రాలకు సంబంధించి కిందివాటిని జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d గ్రూపు - ఎ గ్రూపు - బి 1. రాంపూర్వ a) వృషభం 2. రుమ్మిందై b) గుర్రం 3. లౌరియా నందన్ ఘర్ c) సింహం 4. సారనాథ్ d) నాలుగు సింహాలు
బి) 1-d, 2-c, 3-b, 4-a
సి) 1-b, 2-a, 3-c, 4-d
డి) 1-c, 2-d, 3-a, 4-b
- View Answer
- సమాధానం: ఎ
56. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) మౌర్యుల పతనానికి కారణం ఆర్థిక భారం - డి.డి. కోశాంబి
బి) మౌర్యుల పతనానికి కారణం అత్యధిక కేంద్రీకృత పాలన - రొమిలా థాపర్
సి) ఎ, బి
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: సి
57. శాసనాల్లో పేర్కొన్న అశోకుడి కుమారుడు ఎవరు?
ఎ) తివర
బి) జలుక
సి) సంప్రతి
డి) కునాల
- View Answer
- సమాధానం: ఎ
58.అశోకుడి అలహాబాద్ స్తంభ శాసనంపై శాసనాలు చెక్కించిన పాలకుడు ఎవరు?
ఎ) సముద్రగుప్తుడు
బి) జహంగీర్
సి) ఎ, బి
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
59. దక్కన్ ప్రాంతాన్ని జయించిన మౌర్య పాలకుడు ఎవరు?
ఎ) చంద్రగుప్త
బి) బిందుసార
సి) అశోకుడు
డి) దశరథ
- View Answer
- సమాధానం: బి
60. సింధు, గంగా, యమున.. ఈ మూడు నదుల పరీవాహక ప్రాంతాలపై ఆధిపత్యం సాధించిన మొదటి పాలకుడు ఎవరు?
ఎ) అశోకుడు
బి) కనిష్కుడు
సి) చంద్రగుప్త మౌర్యుడు
డి) పుష్యమిత్రశుంగుడు
- View Answer
- సమాధానం: సి
61. అశోకుడి శిలా శాసనాల్లో దక్షిణ భారతదేశానికి చెందిన ఏ పాలకుల గురించి పేర్కొన్నారు?
ఎ) చోళులు
బి) పాండ్యులు
సి) ఎ, బి
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి
62. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఎన్ని అధికరణలు ఉన్నాయి?
ఎ) 15
బి) 20
సి) 16
డి) 18
- View Answer
- సమాధానం: ఎ
63. కౌటిల్యుడి మరో పేరు?
ఎ) విష్ణుగుప్త
బి) చాణక్య
సి) ఎ, బి
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి