భారతీయ సాంస్కృతిక, సాంఘిక,మత, రాజకీయ చైతన్యం
1. భారతీయ ‘సాంస్కృతిక పునరుజ్జీవన పిత’ గా ఎవరిని పేర్కొంటారు?
1) రాజా రామ్మోహన్ రాయ్
2) మహాదేవ గోవింద రనడే
3) జ్యోతిబాపూలే
4) నారాయణ గురు
- View Answer
- సమాధానం: 1
2. రాజారామ్మోహన్రాయ్ కృషితో విలియం బెంటింక్ సతీ సహగమన నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1) 1830 జనవరి 3
2) 1829 డిసెంబర్ 4
3) 1828 మే 5
4) 1831 అక్టోబర్ 6
- View Answer
- సమాధానం: 2
3. రామ్మోహన్రాయ్కు ‘రాజా’ అనే బిరుదునిచ్చి తన పెన్షన్ కోసం ఇంగ్లండ్‌కు రాయబారిగా పంపిన మొఘల్ చక్రవర్తి ఎవరు?
1) బహదూర్ షా-2
2) మహ్మద్ షా-2
3) ఆలం షా - 2
4) అక్బర్ - 2
- View Answer
- సమాధానం:4
4. భారతీయులు స్థాపించి, భారతీయులే నిర్వహించి, భారతీయుల సంపాదకత్వంలో వెలువడిన మొదటి పత్రిక ఏది?
1) సంవాద కౌముది
2) మిరాత్ -ఉల్-అక్బర్
3) ఇండియన్ మిర్రర్
4) ఉద్బోధన
- View Answer
- సమాధానం: 1
5. తత్వరంజని/ తత్వబోధిని సభ స్థాపకుడు ఎవరు?
1) ద్వారకానాథ్ ఠాగూర్
2) రామచంద్ర విద్యా వాగీస్
3) దేవేంద్రనాథ్ ఠాగూర్
4) కేశవ చంద్రసేన్
- View Answer
- సమాధానం: 3
6. 1829లో బ్రహ్మసమాజంగా మారిన ‘ఆత్మీయసభ’ను రామ్మోహన్రాయ్ ఎప్పుడు స్థాపించారు?
1) 1815
2) 1816
3) 1820
4) 1825
- View Answer
- సమాధానం: 1
7. బ్రహ్మసమాజంలో వివిధ శాఖలు, స్థాపకులకు సంబంధించి సరైన జత గుర్తించండి.
ఎ) ఆది బ్రహ్మసమాజం - దేవేంద్రనాథ్ ఠాగూర్
బి) భారతీయ బ్రహ్మసమాజం - కేశవ చంద్రసేన్
సి) సాధారణ బ్రహ్మసమాజం - ఆనందమోహన్ బోస్
1) ఎ, బి, సి
2) బి, సి
3) ఎ, బి
4) ఎ, సి
- View Answer
- సమాధానం: 1
8. పశ్చిమ భారత సాంస్కృతిక పునరుజ్జీవన పితగా ఎవరిని పిలుస్తారు?
1) ఆత్మారాం పాండురంగ
2) మహాదేవ గోవింద రనడే
3) ఆర్.జి. భండార్కర్
4) జి.జి. అగార్కర్
- View Answer
- సమాధానం: 2
9. దైవారాధన, సమాజ సంస్కరణ ముఖ్య లక్ష్యాలుగా 1867లో స్థాపించిన సంస్థ ఏది?
1) బ్రహ్మసమాజం
2) రామకృష్ణ మఠం
3) ప్రార్థనా సమాజం
4) దివ్యజ్ఞాన సమాజం
- View Answer
- సమాధానం: 3
10. కింది సంస్థలు, స్థాపకులతో జతపర్చండి.
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ 1) వేద సమాజం ఎ) శ్రీధర్‌లు నాయుడు 2) సత్యశోధక సమాజం బి) జ్యోతిబా పూలే 3) దివ్యజ్ఞాన సమాజం సి) బ్లావట్స్కీ, కల్నల్ ఓల్కాట్ 4) ఆర్య సమాజం డి) దయానంద సరస్వతి 5) దేవసమాజం ఇ) శివనారాయణ అగ్నిహోత్రి
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-బి, 5-డి
4) 1-డి, 2-బి, 3-సి, 4-ఇ, 5-ఇ
- View Answer
- సమాధానం: 1
11. హిందూ సనాతన ధర్మాన్ని తీవ్రంగా విమర్శించి ‘లోక హితవాది’గా పేరొందిన వారు ఎవరు?
1) తులసీరామ్
2) శివనారాయణ్
3) గోపాల హరదేశ్ముఖ్
4) అగార్కర్
- View Answer
- సమాధానం: 3
12. వివేకానంద స్థాపించిన పత్రిక ఏది?
1) ఉద్బోధన
2) ప్రభుద్ధ భారత్
3) 1, 2
4) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: 3
13. దయానంద సరస్వతి రచించిన గ్రంథం ఏది?
1) సత్యార్థ ప్రకాశిక
2) వేదభాష్య
3) వేదభాష్య భూమిక
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
14.కింది సంస్థలను, వాటి స్థాపకులతో జతపర్చండి.
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ 1) సోషల్ సర్వీస్ లీగ్ ఎ) ఎన్.ఎం.జోషి 2) సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ బి) గోపాలకృష్ణ గోఖలే 3) రాధాస్వామి సత్సంగ్ సి) శివదయాళ్ సాహెబ్ 4) డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ డి) జి.జి. అగార్కర్, రనడే 5) సేవాసమితి ఇ) హృదయ్ నాథ్ కుంజ్రు
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-సి
4) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-డి, 5-బి
- View Answer
- సమాధానం: 1
15. క్రైస్తవమత ప్రభావం లేని ఆంగ్ల విద్యను అందించడానికి ఉద్దేశించిన దయానంద ఆంగ్లో వేదిక్ విద్యాసంస్థల స్థాపనలో ప్రముఖ పాత్ర వహించింది ఎవరు?
1) లాలా లజపతిరాయ్
2) ఎన్.ఎం.జోషి
3) లాలా హన్సరాజ్
4) శివదయాళ్
- View Answer
- సమాధానం: 3
16. మద్రాసు మహాజనసభను ఎవరు స్థాపించారు?
1) జి. సుబ్రమణ్య అయ్యర్
2) ఎం. వీరరాఘవాచారి
3) ఆనందాచార్యులు
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 4
17. కింది రచనలను వాటి రచయితలతో జతపర్చండి.
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ 1) గులాంగిరి ఎ) జ్యోతిబా పూలే 2) గిఫ్ట్ టు మోనోథీస్ట్స్ బి) రాజా రామ్మోహన్ రాయ్ 3) ధర్మవివేచన సి) దాదోబా పాండురంగ్ 4) ఎ థీస్ట్స్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ డి) ఎం.జి. రనడే 5) బ్రహ్మోధర్మ ఇ) దేవేంద్రనాథ్ ఠాగూర్
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-డి, 2-సి, 3-ఇ, 4-బి, 5-ఎ
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి, 5-ఇ
- View Answer
- సమాధానం: 1
18. హిందూ మహాసభ వివిధ దశల్లోని సరైనది గుర్తించండి.
1) పంజాబ్ హిందూ కాన్ఫరెన్స్ - 1909
2) సర్వదేశిక్ హిందూ సభ - 1915
3) అఖిల భారత హిందూ మహాసభ - 1921
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
19. ప్రముఖ ఉద్యమాలు, స్థాపకులకు సంబంధించి సరైనది గుర్తించండి.
ఎ) శుద్ధి ఉద్యమం - ఆర్య సమాజం
బి) యంగ్ బెంగాల్ ఉద్యమం - హెన్రీ డిరాజియా
సి) అరవిపురా ఉద్యమం - శ్రీ నారాయణ గురు
డి) ఆత్మగౌరవ ఉద్యమం - పెరియార్ రామస్వామి నాయకర్
1) ఎ, బి, సి
2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి
4) ఎ, బి, డి
- View Answer
- సమాధానం: 3
20. రహ్నుమయి మజ్దయాస్నన్ సభ ఏ మత సంస్కరణ కోసం ప్రయత్నించింది?
1) పార్శీ మతం
2) సిక్కు మతం
3) జైన మతం
4) క్రైస్తవ మతం
- View Answer
- సమాధానం:1
21. ప్రముఖ పత్రికలు, స్థాపకుల సరైన జత గుర్తించండి.
1) మిరాత్ - ఉల్ - అక్బర్ - రాజా రామ్మోహన్రాయ్
2) రాస్త్ గోఫ్తర్ - దాదాబాయి నౌరోజి
3) కుడి అరసు - పెరియార్ రామస్వామి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
22. సాంఘికంగా బహిష్కరణకు గురైన స్త్రీలు, వితంతువుల సంక్షేమానికి ‘సేవాసదన్’ను 1885లో స్థాపించిన వ్యక్తి ఎవరు?
1) రఘునాథరావు
2) బెహరాంజీ ఎమ్.మలబారి
3) జె.బి. వాచా
4) ఎస్.ఎస్.బెంగాలీ
- View Answer
- సమాధానం: 2
23. రూపంలేని దేవుడిని ఆరాధించడమే లక్ష్యంగా, విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ నిరంకారీ ఉద్యమాన్ని స్థాపించిందెవరు?
1) బాబా దయాల్ దాస్
2) పద్మనాభ పిళ్లై
3) రామకృష్ణ పిళ్లై
4) బాబారామ్సింగ్
- View Answer
- సమాధానం: 1
24. బ్రాహ్మణ వ్యతిరేకతతో ‘ప్రజామిత్ర మండలి’ అనే సంస్థను స్థాపించింది ఎవరు?
1) ముకుందరావు పాటిల్
2) సి.ఆర్.రెడ్డి
3) భాస్కరరావు జాదవ్
4) సాహూ మహరాజ్
- View Answer
- సమాధానం: 2
25. 1873లో అమృత్‌సర్‌లో ‘సింగ్‌సభ’ను స్థాపించింది ఎవరు?
1) ఠాకూర్‌సింగ్
2) జియాని జియాన్ సింగ్
3) 1, 2
4) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: 3
26. ఎవరి కృషితో 1856లో డల్హౌసీ గవర్నర్ జనరల్‌గా ఉన్నప్పుడు ‘హిందూ వితంతు పునర్వివాహ చట్టం’ చేశారు?
1) ఈశ్వర చంద్ర విద్యాసాగర్
2) కందుకూరి వీరేశలింగం పంతులు
3) 1, 2
4) పై ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 1
27. వితంతు విద్యను ప్రోత్సహించడానికి పుణేలో ‘శారదాసదన్’ను స్థాపించింది ఎవరు?
1) పండిత రమాబాయి
2) సావిత్రిపూలే
3) గంగాబాయి
4) జె.ఇ.డి. బెథూనే
- View Answer
- సమాధానం: 1
28. మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని డి.కె. కార్వే ఎప్పుడు స్థాపించారు?
1) 1915
2) 1916
3) 1917
4) 1918
- View Answer
- సమాధానం: 2
29. కింది మహిళా సంస్థలను వాటి స్థాపకులతో జతపర్చండి.
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ 1) భారత స్త్రీ మండలి ఎ) సరళాదేవీ చౌదరాని 2) ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ బి) దొరతి జినరాజదాస 3) ఆర్య మహిళా సభ సి) పండిత రమాబాయి 4) నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ డి) మెహ్రిబాయి టాటా 5) ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఇ) మార్గరెట్ కజిన్స్
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-సి
4) 1-సి, 2-ఇ, 3-బి, 4-డి, 5-ఎ
- View Answer
- సమాధానం: 1
30. కింది ఇస్లాం సంస్కరణ ఉద్యమాలను వాటి స్థాపకులతో జతపర్చండి.
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ 1) టిటుమిర్ ఉద్యమం ఎ) మీర్నిహర్ అలీ 2) ఫరా ఈద్ ఉద్యమం బి) హాజీ షరయత్ ఉల్లా 3) అలీఘర్ ఉద్యమం సి) సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ 4) వహాబీ ఉద్యమం డి) సయ్యద్ అహ్మద్ రాయ్‌బరేలీ 5) దియోబంద్ ఉద్యమం ఇ) ఖాసిమ్ ననౌతావి, రషీద్ అహ్మద్ గంగోహి
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-సి
4) 1-సి, 2-ఇ, 3-బి, 4-డి, 5-ఎ
- View Answer
- సమాధానం: 1
31. అంటరాని వర్గాల దేవాలయ ప్రవేశ బిల్లును కేంద్ర శాసన సభలో ప్రవేశపెట్టింది ఎవరు?
1) రంగా అయ్యర్
2) అంబేడ్కర్
3) టి.కె. మాధవన్
4) కె. కేలప్పన్
- View Answer
- సమాధానం: 1
32. మొదటి మహిళా శాసనసభ్యురాలు (మద్రాసు అసెంబ్లీలో)గా నియమితులైన వారు ఎవరు?
1) సుచేతా కృపలానీ
2) ముత్తులక్ష్మీరెడ్డి
3) సరోజినీ నాయుడు
4) సరళాదేవి
- View Answer
- సమాధానం: 2
33. బ్రాహ్మణేతరుల అభివృద్ధి కోసం స్థాపించిన సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ఏ పార్టీగా మారింది?
1) జస్టిస్ పార్టీ
2) ద్రవిడ కజగమ్
3) ద్రవిడ మున్నేట్ర కజగమ్
4) అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగమ్
- View Answer
- సమాధానం: 1
34. ‘మానవులకు మతం వద్దు, కులం వద్దు, దేవుడు వద్దు’ అనే నినాదాన్నిచ్చింది?
1) శ్రీ నారాయణ గురు
2) సదరన్ అయ్యపన్
3) పెరియార్
4) శివనారాయణ్
- View Answer
- సమాధానం:2
35. ‘మానవాళికి ఒకేమతం, ఒకే కులం, ఒకే దేవుడు’ అనే నినాదం ఎవరిది?
1) వివేకానంద
2) రామకృష్ణ పరమహంస
3) శ్రీనారాయణ గురు
4) తులసీరాం
- View Answer
- సమాధానం: 3
36. ‘ఇండియన్ నేషనల్ సోషియల్ కాన్ఫరెన్స’ స్థాపకుడు ఎవరు?
1) రఘునాథరావు
2) ఎం.జి.రనడే
3) 1, 2
4) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 3
37. క్రైస్తవ, హిందూ సిద్ధాంతాల ఆధారంగా సమాజ, మత సంస్కరణకు ప్రయత్నించి, క్రీస్తును ఆదర్శ మానవునిగా పేర్కొన్న ప్రముఖ సంస్కర్త ఎవరు?
1) రాజా రామ్మోహన్రాయ్
2) కేశవ చంద్రసేన్
3) లాలా హన్సరాజ్
4) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
- View Answer
- సమాధానం: 2
38. ఆంగ్ల విద్యను అభ్యసించిన మొదటితరం యువతను సోక్రటీస్ మాదిరి ప్రభావితం చేసిన వ్యక్తిగా ఎవరిని పేర్కొంటారు?
1) రాజా రామ్మోహన్రాయ్
2) హెన్రీ డిరాజియో
3) ద్వారకానాథ్ ఠాగూర్
4) కేశవ చంద్రసేన్
- View Answer
- సమాధానం:2
39. బానిసత్వాన్ని 1843లో నిర్మూలించిన గవర్నర్ జనరల్ ఎవరు?
1) విలియం బెంటింక్
2) లార్డ్ ఎలిన్‌బరో
3) లార్డ్ డల్హౌసీ
4) లార్డ్ అక్లాండ్
- View Answer
- సమాధానం: 2
40. 1920లో బాంబేలో జరిగిన ‘ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్’ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?
1) లాలా లజపతిరాయ్
2) ఎస్.ఎస్.బెంగాలీ
3) మోతీలాల్ నెహ్రూ
4) ఎన్.ఎం. జోషి
- View Answer
- సమాధానం: 1
41. ‘వేదాలకు మరలిపోండి’ అనే నినాదం ఎవరిది?
1) వివేకానంద
2) శ్రద్ధానంద
3) దయానంద సరస్వతి
4) ముకుల్దాస్
- View Answer
- సమాధానం: 3
42. భారతదేశంలో దివ్యజ్ఞాన సమాజ వ్యాప్తికి కృషి చేసిందెవరు?
1) అనిబిసెంట్
2) మేడం కామా
3) సిస్టర్ నివేదిత
4) మేడం బ్లావట్స్కీ
- View Answer
- సమాధానం: 1
43. కింది సంస్థలు, స్థాపకులు జతపర్చండి.
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ 1) లాండ్ హోల్డర్స్ సొసైటీ ఎ) ద్వారకానాథ్ ఠాగూర్ 2) బ్రిటిష్ ఇండియా సొసైటీ బి) విలియం ఆడమ్స్ 3) లండన్ ఇండియా సొసైటీ, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ సి) దాదాబాయి నౌరోజీ 4) నేషనల్ ఇండియన్ అసోసియేషన్ డి) మేరీ కార్పెంటర్ 5) ఇండియన్ అసోసియేషన్ ఇ) ఆనంద్ మోహన్ బోస్, ఎస్.ఎన్.బెనర్జీ
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-సి
4) 1-సి, 2-ఇ, 3-బి, 4-డి, 5-ఎ
- View Answer
- సమాధానం: 1