Skip to main content

Tenth Class Publice Exams 2024 Update : టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల్లో న‌లుగురిపై వేటు.. కారణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న విష‌యం తెల్సిందే. ఈ పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా.. 6వ రోజు బయలాజికల్‌ సైన్స్‌ పరీక్షలో ఒక్క విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసును నమోదు చేశామని వివరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పదో తరగతి పరీక్షల సిబ్బందిలో నలుగురిపై వేటు వేశామని తెలిపారు.
ts tenth class students

భద్రాద్రి కొత్తగూడేం జిల్లాలో ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌, ఒక డిపార్ట్‌మెంటల్‌ అధికారి, కరీంనగర్‌ జిల్లాలో ఒక ఇన్విజిలేటర్‌, సంగారెడ్డి జిల్లాలో ఒక ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తొలగించామని పేర్కొన్నారు. ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. ఈ పరీక్షకు రెగ్యులర్‌ విద్యార్థులు 4,95,146 మంది దరఖాస్తు చేస్తే, 4,93,741 (99.72 శాతం) మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. 1,405 (0.28 శాతం) మంది గైర్హాజరయ్యారని వివరించారు.

☛ AP Schools Summer Holidays 2024 : ఎండ ఎఫెక్ట్.. ఏపీలో ముందుగానే స్కూల్స్‌కు భారీగా వేస‌వి సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ప్రైవేటు విద్యార్థుల్లో 7,524 మంది దరఖాస్తు చేసుకుంటే, 6,587 (87.55 శాతం) పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 937 (12.45 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

 Seven Day Holidays For School Students : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా 7 రోజులు పాటు సెలవులు.. ఎందుకంటే..?

Published date : 29 Mar 2024 02:38PM

Photo Stories