Inter Results: విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించాలి
Sakshi Education
ములుగు: ఇంటర్ మొదటి, రెండో సంవత్సర పరీక్షల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పాస్, ఫెయిల్ అయినా విద్యార్థులు టెన్షన్‌కు గురికాకుండా మానసిక ఒత్తిడిని జయించాలని డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య ఏప్రిల్ 22న ఒక ప్రకటనలో సూచించారు.
పరీక్షలో ఫెయిల్ అయితే మళ్లీ రాసి ఉత్తీర్ణత సాధించవచ్చని తెలిపారు. చిన్న చిన్న విషయాలను లోతుగా ఆలోచించి ఆత్మహత్యలకు పాల్పడవద్దని పేర్కొన్నారు. ఎవరైనా మానసిన ఒత్తిడికి గురి అయితే 14416 టెలీ మానస కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేసి సేవలను ఉపయోగించుకోవచ్చని సూచించారు.
చదవండి: 10th Class & Inter Exams: ఓపెన్ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా ఆస్పత్రిలోనూ ప్రత్యేక మానసిక వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారని వివరించారు. తల్లిదండ్రులు సైతం తమతమ పిల్లలను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు.
Published date : 24 Apr 2024 10:59AM