దీనికోసం ఇప్పటికే టెండర్లు పిలిచిన తెలంగాణ ఇంటర్ బోర్డ్, వచ్చిన వాటిని పరిశీలిస్తోంది. బిడ్డింగ్‌కు రెండు కంపెనీలు టెండర్లు వేసినట్టు సమాచారం. వీటిల్లో అన్ని విధాల అర్హత, సామర్థ్యం ఉన్న వాటినే ఎంపిక చేయాలని నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియపై బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ మార్చి 8న అధికారులతో కలిసి చర్చించారు.
ప్రశ్నపత్రాల ఆన్‌లైన్ మూల్యంకనం అత్యంత కీలకమైంది కావడంతో, అన్ని అర్హతలను, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. టెండర్‌లో పాల్గొన్న కంపెనీల ట్రాక్ రికార్డును పరిశీలించాలని మిత్తల్ ఆదేశించారు.