TSBIE: ఇంటర్ ఫీజు చెల్లింపు చివరి తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: 2024 మార్చిలో జరిగే ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు ఖరారయ్యాయి.
ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకూ ఎలాంటి అపరాధ రుసుము లేకుండానే ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు సెక్రెటరీ నవీన్ మిత్తల్ తెలిపారు. రూ.వంద అపరాధ రుసుముతో నవంబర్ 16–23 వరకూ, రూ.500 అపరాధ రుసుముతో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకూ ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
రూ.వెయ్యి అపరాధ రుసుముతో డి సెంబర్ 6–13 వరకూ, రూ.2 వేల అపరాధ రుసుముతో డిసెంబర్ 15–20 వరకూ ఫీజు చెల్లించేందుకు అవకాశముందని తెలిపారు. ఫస్టియర్, సెకండియర్ జనరల్ కో ర్సులకు రూ.510, ఒకేషనల్ కోర్సులకు రూ.730 పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పారు.
Published date : 27 Oct 2023 11:42AM