Inter results: పరీక్షల తర్వాత నెలలో ఇంటర్ ఫలితాలు
- ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు ముగిసిన నెల రోజుల్లోనే ఫలితాలు వెల్లడిస్తామని ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. పరీక్షకు ఒక నిమిషం ఆలస్యంగా వచి్చనా అనుమతిం చేది లేదని స్పష్టం చేశారు. హాల్ టికెట్లపై కాలేజీ ప్రిన్సిపల్ సంతకం ఉండాల్సిన అవసరం లేదన్నా రు. ఈ నెల 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కమిషనర్ సయ్యద్ ఒమర్ మీడియాతో మాట్లాడారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు హాజరవుతారని వివరించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను, ఆరోగ్య కార్యకర్తలను అందుబాటులో ఉంచుతామన్నారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు వ్యక్తిగతంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకావద్దని, 70% సిలబస్‌తోనే పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఫీజు బకాయిలు చెల్లించని విద్యార్థుల హాల్ టికెట్లను ప్రైవేటు కాలేజీలు ఇవ్వడం లేదన్న ఆరోపణలపై కమిషనర్ స్పందిస్తూ, విద్యార్థి నేరుగా బోర్డ్ లాగిన్ ద్వారా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్షలకు హాజరయ్యే ప్రతీ విద్యార్థి మాస్క్ ధరించాలని సూచించారు.
also read: Inter hall tickets: బోర్డు వెబ్‌సైట్‌లో ఇంటర్ హాల్ టికెట్లు