Skip to main content

Inter: నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఈ ఏడాది నుంచి కొత్తగా ఈ సబ్జెక్టు ప్రాక్టికల్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి పేపర్‌ లీక్‌లు లేకుండా చూడాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఈ దిశగా చర్యలు చేపట్టారు.
Arrangements Set for Intermediate Exams in Hyderabad   Inter practicals from today    Intermediate Exams Arrangements Complete in Hyderabad

 పెద్ద ఎత్తున ఇన్విజిలేటర్లను నియమించడం, మొబైల్‌ స్క్వాడ్‌లను రంగంలోకి దించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌కు 4,78,527 మంది, సెకండియర్‌కు 4,43,993 మంది.. మొత్తం 9,22,520 మంది హాజరవుతున్నారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ప్రాక్టికల్స్‌ జరుగుతున్నాయి.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

థియరీ పరీక్షకు 1,531 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే, ప్రాక్టికల్స్‌ కోసం 2,032 కేంద్రాలు ఏర్పాటు చేశారు. బైపీసీ నుంచి 1,04,089 మంది, ఎంపీసీ నుంచి 2,17,714 మంది ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. ఈ ఏడాది నుంచి కొత్తగా ఇంగ్లిష్‌ సబ్జెక్టు ప్రాక్టికల్స్‌ కూడా నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఈనెల 16న ఉంటుంది. అన్ని గ్రూపుల వారు హాజరుకావాల్సి ఉంటుంది.    

Published date : 02 Feb 2024 10:17AM

Photo Stories